Jabardasth: Jordar Sujatha Gifts Costly Phone To Rocking Rakesh Details Inside - Sakshi
Sakshi News home page

Jordar Sujatha: రాకింగ్‌ రాకేశ్‌కు కాస్ట్‌లీ ఫోన్‌ గిఫ్టిచ్చిన సుజాత

Published Tue, May 3 2022 2:37 PM | Last Updated on Tue, May 3 2022 3:23 PM

Jordar Sujatha Gifts Costly Phone To Rocking Rakesh - Sakshi

జోర్దార్‌ సుజాత.. టీవీ యాంకర్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె బిగ్‌బాస్‌ షోతో మరింత ఎక్కువమందికి చేరువైంది. నాగార్జునను కిట్టూ అని పిలుస్తూ అందరినీ తనవాళ్లే అనుకునే అమాయకత్వం, చిరునవ్వు చాలామందిని కట్టిపడేసింది. బిగ్‌బాస్‌ తెలుగు నాలుగో సీజన్‌లో పాల్గొన్న ఆమె సూపర్‌ సుజాత అనే యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా నిత్యం అభిమానులను ఎంటర్‌టైన్‌ చేస్తోంది. ఇక జబర్దస్త్‌ కమెడియన్‌ రాకింగ్‌ రాకేశ్‌తో ప్రేమలో పడ్డ సుజాత తాజాగా తన ప్రియుడికి మర్చిపోలేని బహుమతినిచ్చింది. లక్ష రూపాయల విలువైన కొత్త ఫోన్‌ కొనిచ్చింది. ఈ మేరకు తన యూట్యూబ్‌ ఛానల్‌లో ఓ వీడియోను వదిలింది.

చదవండి:  ఆయన ఫోటో చూసి భోరున విలపించిన మిత్రాశర్మ

'నా ఆత్మీయుడు, ఫ్రెండ్‌, అంతకుమించి అయిన రాకేశ్‌కు ఫోన్‌ కొనిస్తున్నాను. తను కొద్దిరోజుల నుంచి మొబైల్‌తో ఇబ్బందిపడుతున్నాడు. పైగా కోపం వస్తే ఫోన్‌ పగలగొట్టే అలవాటు ఉంది. నేను అతడి మనసుకు దగ్గరైన వ్యక్తిని కాబట్టి నేను ఫోన్‌ కొనిస్తే దాన్ని పగలగొట్టడానికి ఆలోచిస్తాడు కదా అనిపించింది. తను నాకు దగ్గరైనప్పటి నుంచి చాలా సంతోషంగా ఉన్నాను, నా ప్రతీ విజయంలో రాకేశ్‌ ఉన్నాడు. నేను ఫోన్‌ గిఫ్టిస్తే దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాడనిపించింది, అందుకే ఈ ఫోన్‌ బహుమతిగా ఇస్తున్నాను' అని చెప్పుకొచ్చింది. సామ్‌సంగ్‌ గెలాక్సీ S 22 అల్ట్రా ఫోన్‌తో పాటు స్మార్ట్‌ వాచ్‌ కొనుగోలు చేసింది. వీటి ఖరీదు లక్షా 20 వేల రూపాయలు అని రాకేశ్‌ వెల్లడించాడు. ఇక సుజాత వీటిని తనకోసమే కొన్నానని చెప్పడంతో అతడు సర్‌ప్రైజ్‌ అయ్యాడు. మాటలు రావడం లేదంటూ ఎమోషనల్‌ అయ్యాడు.

చదవండి:  విశ్వక్​ సేన్​ గురించి చెప్పగానే షాకయ్యా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement