అతనికి హారర్ షో చూపిస్తా! | Vijender confident ahead of sixth pro fight | Sakshi
Sakshi News home page

అతనికి హారర్ షో చూపిస్తా!

Published Thu, May 12 2016 6:32 PM | Last Updated on Mon, Oct 22 2018 8:44 PM

అతనికి హారర్ షో చూపిస్తా! - Sakshi

అతనికి హారర్ షో చూపిస్తా!

బోల్టాన్: శుక్రవారం జరగనున్న తన ఆరో ప్రొఫెషనల్ ఫైట్లో విజయంపై దీమాతో ఉన్నాడు విజేందర్ సింగ్. ఇప్పటివరకు పాల్గొన్న ఐదు బౌట్లలో అన్నింటినీ టెక్నికల్ నాకౌట్ ద్వారా గెలుచుకున్న విజేందర్.. తొలిసారిగా సోల్డ్రాతో తలపడనున్న ఎనిమిది రౌండ్ల పోరు కోసం భారీగా కసరత్తులు చేసినట్లు వెల్లడించాడు. 'తొలి సారిగా ఎనిమిది రౌండ్ల పోరులో తలపడుతున్నాను. దీని కోసం ఓర్పుగా ఎక్కువ సమయం రింగ్లో సామర్థ్యం మేర రాణించడంపై దృష్టి పెట్టాను. రోజురోజుకూ కఠినమైన శిక్షణ పొందుతున్నాను. ఈ బౌట్లో విజయం ద్వారా నా ప్రొ బాక్సింగ్ కెరీర్ను 6-0కు తీసుకెళ్లాలనుకుంటున్నాను' అని విజేందర్ గురువారం వెల్లడించాడు.

అయితే ఆరో రౌండ్లో తలపడనున్న ప్రత్యర్థి.. పోలాండ్కు చెందిన సోల్డ్రా మాత్రం రేపు విజేందర్కు హారర్ షో చూపిస్తానంటూ హెచ్చరికలు పంపాడు. అమెచ్యూర్ కేటగిరీలో పాల్గొన్న 98 ఫైట్లలో 82 విజయాలు సాధించిన సోల్డ్రా.. ప్రొ బాక్సింగ్ కెరీర్లో సైతం 16 ఫైట్లలో 12 విజయాలు సాధించి మంచి రికార్డుతోనే ఉన్నాడు. ఇప్పటికే విజేందర్ బొక్కలిరగ్గొడతానంటూ వ్యాఖ్యలు చేసిన సోల్డ్రా ఫైట్పై  ఆసక్తిని పెంచిన విషయం తెలిసిందే.  అయితే తుదిపోరులో సోల్డ్రా రాణిస్తాడా.. లేక గతంలో విజేందర్ను మట్టికరిపించేందుకు పామురక్తం తాగానంటూ వ్యాఖ్యానించి చివరికి రింగ్లో చేతులెత్తేసిన అలెగ్జాండర్ హోర్వత్ మాదిరిగానే తోకముడుస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement