Mandeep Jangra: అరంగేట్రంలోనే అదరగొట్టాడు | Mandeep Jangra Indian Boxer Wins Maiden Professional Bout In USA | Sakshi
Sakshi News home page

Mandeep Jangra: అరంగేట్రంలోనే అదిరిపోయే పంచ్‌!

Published Mon, May 10 2021 8:07 AM | Last Updated on Mon, May 10 2021 8:12 AM

Mandeep Jangra Indian Boxer Wins Maiden Professional Bout In USA - Sakshi

న్యూఢిల్లీ: ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌ అరంగేట్రంలోనే భారత బాక్సర్‌ మన్‌దీప్‌ జాంగ్రా గెలుపు రుచి చూశాడు. అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన బౌట్‌లో అర్జెంటీనా బాక్సర్‌ లూసియానో రామోస్‌పై మన్‌దీప్‌ విజయం సాధించాడు. తన ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌ కెరీర్‌లో తొలి విజయాన్ని అందుకున్నాడు. నాలుగు రౌండ్లపాటు సాగిన ఈ బౌట్‌లో 27 ఏళ్ల మన్‌దీప్‌ పంచ్‌ల ముందు రామోస్‌ నిలబడలేకపోయాడు. అమెచ్యూర్‌ బాక్సర్‌గా 69 కేజీల విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన మన్‌దీప్‌ 2013 ఆసియా బాక్సింగ్‌ చాంపియన్‌ షిప్‌లో రజతం... 2014 గ్లాస్గో కామన్వెల్త్‌ గేమ్స్‌లో రజతం సాధించాడు. 

పక్కా ప్రణాళికతో టోక్యో ఒలింపిక్స్‌కు...
నాలుగు దశాబ్దాలుగా ఊరిస్తున్న ఒలింపిక్‌ హాకీ పతకాన్ని ఈసారి అందుకునే సత్తా  భారత పురుషుల హాకీ జట్టుకు ఉందని కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ వ్యాఖ్యానించాడు. జూలై–ఆగస్టులలో జరిగే టోక్యో ఒలింపిక్స్‌ కోసం భారత జట్టు బెంగళూరులో సన్నద్ధమవుతోంది. టోక్యో వాతావరణానికి అనుగుణంగాబెంగళూరులో ప్రాక్టీస్‌ కొనసాగిస్తున్నామని మన్‌ప్రీత్‌ అన్నాడు. 

చదవండి: గుర్‌ప్రీత్‌కు కాంస్యం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement