Mandeep Jangra
-
వరల్డ్ టైటిల్ నెగ్గిన భారత బాక్సర్ మన్దీప్
భారత ప్రొఫెషనల్ బాక్సర్ మన్దీప్ జాంగ్రా అంతర్జాతీయ బాక్సింగ్ వేదికపై అపూర్వ విజయం సాధించాడు. ప్రపంచ బాక్సింగ్ సమాఖ్య (డబ్ల్యూబీఎఫ్) సూపర్ ఫెదర్ వెయిట్లో మన్దీప్ ప్రపంచ చాంపియన్‌గా ఆవిర్భవించాడు. కేమన్ ఐలాండ్స్‌లో జరిగిన ఈ ఈవెంట్ టైటిల్ పోరులో బ్రిటన్ బాక్సర్ కొనొర్ మెకింటోష్ను మన్దీప్ కంగుతినిపించాడు. 31 ఏళ్ల ఈ హరియాణా స్టార్ పంచ్ పవర్ ముందు బ్రిటన్ ప్రత్యర్థి నిలువలేకపోయాడు.ఆరంభ రౌండ్ నుంచి ప్రత్యర్థిపై ముష్టిఘాతాలు కురిపించిన భారత బాక్సర్ మొత్తం పది రౌండ్ల పాటు మెకింటోష్కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగాడు. రౌండ్ రౌండ్‌కు తన పంచ్ పదును పెరిగిపోవడంతో ప్రత్యర్థికి ఎటు పాలుపోలేదు. అమెచ్యూర్ సర్క్యూట్లో 12 సార్లు రింగ్‌లోకి దిగితే కేవలం ఒకే ఒక్కసారి ఓడిన మన్దీప్ 11 సార్లు ఘనవిజయం సాధించాడు.కాగా2014 గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో జాంగ్రా రజత పతకం గెలిచాడు. మాజీ ఒలింపిక్ రజత పతక విజేత రాయ్ జోన్స్ జూనియర్... మన్‌దీప్‌ను చాంపియన్‌గా మలిచాడు. ‘నా కెరీర్లోనే ఇదే అతిపెద్ద విజయం. ఎన్నో ఏళ్లపాటు కఠోరంగా శ్రమించినందుకు దక్కిన ఫలితమిది. భారత ప్రతిష్ట పెంచిన విజయమిది. నన్ను ప్రోత్సహించిన వారందరికీ కృతజ్ఞతలు’ అని మన్దీప్ వ్యాఖ్యానించాడు. -
Mandeep Jangra: అరంగేట్రంలోనే అదరగొట్టాడు
న్యూఢిల్లీ: ప్రొఫెషనల్ బాక్సింగ్ అరంగేట్రంలోనే భారత బాక్సర్ మన్దీప్ జాంగ్రా గెలుపు రుచి చూశాడు. అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన బౌట్లో అర్జెంటీనా బాక్సర్ లూసియానో రామోస్‌పై మన్దీప్ విజయం సాధించాడు. తన ప్రొఫెషనల్ బాక్సింగ్ కెరీర్లో తొలి విజయాన్ని అందుకున్నాడు. నాలుగు రౌండ్లపాటు సాగిన ఈ బౌట్లో 27 ఏళ్ల మన్దీప్ పంచ్‌ల ముందు రామోస్ నిలబడలేకపోయాడు. అమెచ్యూర్ బాక్సర్‌గా 69 కేజీల విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన మన్దీప్ 2013 ఆసియా బాక్సింగ్ చాంపియన్ షిప్లో రజతం... 2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం సాధించాడు. పక్కా ప్రణాళికతో టోక్యో ఒలింపిక్స్‌కు... నాలుగు దశాబ్దాలుగా ఊరిస్తున్న ఒలింపిక్ హాకీ పతకాన్ని ఈసారి అందుకునే సత్తా భారత పురుషుల హాకీ జట్టుకు ఉందని కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ వ్యాఖ్యానించాడు. జూలై–ఆగస్టులలో జరిగే టోక్యో ఒలింపిక్స్ కోసం భారత జట్టు బెంగళూరులో సన్నద్ధమవుతోంది. టోక్యో వాతావరణానికి అనుగుణంగాబెంగళూరులో ప్రాక్టీస్ కొనసాగిస్తున్నామని మన్‌ప్రీత్ అన్నాడు. చదవండి: గుర్‌ప్రీత్‌కు కాంస్యం -
చక్ దే ఇండియా.. వైరల్ వీడియో
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు శుభారంభం ఇచ్చారు. అయితే మరింత మంది భారత అథ్లెట్లు, క్రీడాకారులు పతకాలు సాధించి దేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించాలని సగటు భారతీయుడు కోరుకుంటున్నాడు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. మన్దీప్ జంగ్రాకు, ఇతర భారత క్రీడాకారులకు మన మద్దతు తెలుపుదాం అంటూ 'ద బ్యాక్ బెంచర్స్' ఫేస్బుక్ పేజీలో పోస్ట్ అయిన వీడియో వైరల్ అవుతోంది. కామన్వెల్త్ గేమ్స్ 2018లో భారత ప్లేయర్లు మరిన్ని పతకాలు సాధించాలంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. భారత ప్లేయర్లు తొలి రోజే ఒక స్వర్ణం, ఒక రజతం సాధించారు. తనపై పెట్టుకున్న ఆశలను, అంచనాలను నిజంచేస్తూ మహిళల 48 కేజీల విభాగంలో భారత లిఫ్టర్ మీరాబాయి చాను విజేతగా నిలవగా, పురుషుల 56 కేజీల విభాగంలో గురురాజా 249కేజీలు బరువెత్తి రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సాధించాడు. 53 కేజీల విభాగంలో లిఫ్టర్ సంజిత చాను 192 కేజీ బరువును ఎత్తి పసిడిని అందించారు. -
దేశం కోసం ఆడటం గౌరవం
తాను శక్తి ఉన్నంత వరకూ భారత్ తరఫునే బరిలోకి దిగుతానని అర్జున అవార్డీ మన్ దీప్ జంగ్రా స్పష్టం చేశాడు. బాక్సింగ్ లో తన సీనియర్ విజయేందర్ ఈ నెలలో ప్రొఫెషనల్ బాక్సింగ్ అరంగేట్రం పై స్పందించిన మన్ దీప్.. సీనియర్ గా విజయేందర్ పై చాలా గౌరవం ఉందని అన్నాడు. అతడి ఆట చూస్తూనే పెరిగాం అని గుర్తుచేసుకున్నాడు. ప్రొఫెషనల్ బాక్సర్ గా రాణించాలనేది అతడి వ్యక్తిగత నిర్ణయం అని అన్నాడు. కానీ.. దేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవ మని..చెప్పాడు. విజయేందర్ క్వీన్స్ బెర్రీ ప్రమోషన్స్ తో ఒప్పందం వల్ల ప్రొఫెషనల్ బాక్సింగ్ ఆడే అవకాశం వచ్చిందని తెలిపాడు. తాను ఇలాంటి ఆఫర్ ను తిరస్కరిస్తానని స్పష్టం చేశాడు. డబ్బు కోసం ఆడటం కంటే.. దేశం కోసం తనకు సంతోషాన్ని ఇస్తుందని అన్నాడు. -
ఆసియా బాక్సింగ్ క్వార్టర్స్ లోకి శివ, దేవేంద్రో
ఆసియన్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్లో భారత బాక్సర్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. 56 కిలోల విభాగంలో శివ థాపా, 49 కేజీల విభాగంలో దేవేంద్రో సింగ్ లు క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించారు. జోర్డాన్ కు చెందిన మహ్మద్ అల్వదీతో జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో శివ 3-0 తేడాతో విజయం సాధించాడు. మరో మ్యాచ్ లో దేవేంద్రో 3-0 తేడాతో చైనాకు చెందిన హీ- జున్ జున్ ను ఓడించాడు. కాగా..గత ఏడాది ఇదే టోర్నీలో రజత పతకం సాధించిన మన్దీప్ జంగ్రా ఈ సారి ప్రీ క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగాడు. 69 కిలోల విభాగంలో బరిలోకి దిగిన మన్దీప్ 1-2 స్కోర్ తో జపాన్ బాక్సర్ యసుహిరో సుజుకీ చేతిలో పరాజయం చెందాడు. సెప్టెంబర్ ఒకటిన జరగనున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో దేవేంద్రో క్వాంగూ లాంగూతో, శివ కజకిస్తాన్ కు చెందిన ఒమర్ బెక్‌తో తలపడనున్నారు.