కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు శుభారంభం ఇచ్చారు. అయితే మరింత మంది భారత అథ్లెట్లు, క్రీడాకారులు పతకాలు సాధించి దేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించాలని సగటు భారతీయుడు కోరుకుంటున్నాడు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. మన్‌దీప్ జంగ్రాకు, ఇతర భారత క్రీడాకారులకు మన మద్దతు తెలుపుదాం అంటూ 'ద బ్యాక్ బెంచర్స్' ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ అయిన వీడియో వైరల్ అవుతోంది. కామన్వెల్త్ గేమ్స్ 2018లో భారత ప్లేయర్లు మరిన్ని పతకాలు సాధించాలంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
భారత ప్లేయర్లు తొలి రోజే ఒక స్వర్ణం, ఒక రజతం సాధించారు. తనపై పెట్టుకున్న ఆశలను, అంచనాలను నిజంచేస్తూ మహిళల 48 కేజీల విభాగంలో భారత లిఫ్టర్ మీరాబాయి చాను విజేతగా నిలవగా, పురుషుల 56 కేజీల విభాగంలో గురురాజా 249కేజీలు బరువెత్తి రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సాధించాడు. 53 కేజీల విభాగంలో లిఫ్టర్ సంజిత చాను 192 కేజీ బరువును ఎత్తి పసిడిని అందించారు.
Comments
Please login to add a commentAdd a comment