సోఫియా: భారత టాప్ బాక్సర్ నిఖత్ జరీన్ స్ట్రాంజా మెమోరియల్ బాక్సింగ్ టోర్నీలో తన జోరు కొనసాగిస్తూ తుది పోరుకు అర్హత సాధించింది. రెండు సార్లు ప్రపంచ చాంపియన్ అయిన నిఖత్ ఏకపక్ష సమరంలో గెలిచి ఈ టోర్నమెంట్‌లో ఫైనల్లోకి ప్రవేశించింది. 50 కేజీల విభాగంలో శనివారం జరిగిన సెమీస్‌లో నిఖత్ 5–0 స్కోరుతో స్థానిక బాక్సర్ జ్లాటిస్లోవ్ చుకనోవాపై విజయం సాధించింది.
తొలి రౌండ్‌లో నిఖత్ జాగ్రత్తగా ఆడగా బల్గేరియా బాక్సర్ కూడా పోటీనిచ్చింది. దాంతో స్కోరు 3–2తో ముగిసింది. అయితే తర్వాతి రెండు రౌండ్లలో ఆమెకు ఎదురు లేకుండా పోవడంతో 5–0, 5–0తో రౌండ్లు సొంతమయ్యా యి. ఓవరాల్ స్కోరింగ్‌తో చివరకు 5–0తో నిఖత్‌దే పైచేయి అయింది.
నేడు జరిగే ఫైనల్లో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన సబీనా బొ»ొకులోవాతో నిఖత్ తలపడుతుంది. 66 కేజీల విభాగంలో మరో భారత బాక్సర్ అరుంధరి చౌదరి కూడా ఫైనల్‌కు చేరగా...పురుషుల 51 కేజీల విభాగంలో భారత బాక్సర్ అమిత్ పంఘాల్ కూడా ఫైనల్లోకి అడుగుపెట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment