
తమిళసినిమా: చెయ్యి చూశావా ఎంత రఫ్‌గా ఉందో. నాతో పెట్టుకుంటే పంచ్‌పడుద్ది అంటున్నట్టుంది నటి త్రిష వాలకం చూస్తుంటే. ఏంటీ అసందర్భ ప్రేలాపన అని అనుకుంటున్నారా? చెన్నై చంద్రం త్రిష నటిగా దశాబ్దం కాలాన్ని అవలీలగా దాటేసింది. ఈ చిన్నది ప్రేమలో ఫెయిల్ అయ్యి ఉండవచ్చుగానీ, నటిగా సక్సెస్‌లోనే ఉంది. జయాపజయాలకు అతీతంగా నటిగా తన గ్రోత్‌ను నానాటికీ పెంచుకుంటూ పోతోంది. గ్లామర్ హీరోయిన్ స్టేజ్‌ను దాటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాల స్థాయికి చేరుకుంది. అలా నటించిన నాయకి చిత్రం ఫ్లాప్ అయినా, ఆ తరహా అవకాశాలు మాత్రం త్రిషను వరిస్తూనే ఉన్నాయి.
అరవిందస్వామికి జంటగా నటించిన చదురంగవేట్టై– 2 చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. విజయ్‌సేతుపతితో నటిస్తున్న 96 చిత్రం నిర్మాణంలో ఉంది. ఇక 1818 చిత్రంతో పాటు, హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు మోహిని, గర్జన చిత్రాల్లో నటిస్తున్న త్రిష ఈ స్థాయికి రావడానికి తన నిరంతర శ్రమ, పాత్రలపై అంకిత భావం లాంటివి కారణంగా భావించాలి. 3 పదుల వయసు మీద పడినా పాత్రలో పరకాయ ప్రవేశం చేయడానికి చేసే కృషిలోమాత్రం మార్చు లేదన్నది తాజాగా తను విడుదల చేసిన ఒక వీడియోను చూస్తే అర్థం అవుతుంది.
ఆ వీడియోలో త్రిష తన శిక్షకుడితో బాక్సింగ్ క్రీడలో తర్ఫీదు పొందుతున్న దృశ్యాలు అందర్నీ అచ్చరువు చెందేలా చేస్తున్నాయి. అందులో త్రిష శిక్షణ పొందుతున్నట్లు కనిపించడం లేదు. గెలుపు కోసం పోరాడుతున్నట్లు కనిపిస్తోంది. ప్రత్యర్థిపై పైచెయ్యి సాధించేలా చెయ్యి చూశావా ఎంత రఫ్‌గా ఉందో, నాతో పెట్టుకుంటే మడతైపోద్ది అన్నట్లు ఉంది. ఈ అందాల తార తన కొత్త చిత్రం కోసం కిక్ బాక్సింగ్‌లో తీవ్రంగా శిక్షణ పొందుతున్నట్లు సమాచారం. ఈ చిన్నది బాక్సింగ్ చేస్తున్న వీడియో దృశ్యాలిప్పుడు సోషల్ మాద్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి.వీటిని ఆమె అభిమానులు యమాగా ఎంజాయ్ చేస్తున్నారు. త్రిషానా మజాకా!
Comments
Please login to add a commentAdd a comment