పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో కొత్త అవతారంలో కనిపిస్తున్నాడు. ఫుట్‌బాలర్‌గా వెలుగొందుతున్న రొనాల్డో బాక్సర్‌గా దర్శనమిచ్చాడు. కండలు తిరిగిన దేహంతో బాక్సింగ్ రింగ్‌లో ఒక యోధుడిలా కనిపిస్తున్నాడు. ప్రత్యర్థితో తలపడేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా రొనాల్డో లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దీంతో ఫుట్‌బాలర్ కంటే బాక్సర్‌గానే రొనాల్డో బాగున్నాడంటూ అభిమానులు తెగ సంతోషపడిపోయారు. కానీ వారి ఆనందం కాసేపు మాత్రమే మిగిలింది. ఇదంతా ఒక యాడ్ కోసమని తెలియగానే ఫ్యాన్స్ నాలుక కరుచుకున్నారు.
అవునండీ రొనాల్డో.. అండర్‌వేర్ దుస్తులకు సంబంధించిన ఒక యాడ్‌లో పాల్గొన్నాడు. సీఆర్ 7 బ్రాండ్ కలిగిన అండర్‌వేర్ యాడ్‌కు రొనాల్డో ప్రమోషన్ చేశాడు. ''బద్దకానికి వ్యతిరేకంగా నా పోరాటం ప్రారంభమైంది'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఇక రొనాల్డో ఫిట్‌నెస్‌కు పెట్టింది పేరు. మైదానంలో పాదరసంలా కదిలే రొనాల్డొ ఎనర్జీ వెనుక అతని ఫిట్‌నెస్ ప్రధాన కారణం అని చెప్పొచ్చు.
ప్రపంచంలో అత్యంత పాపులారిటీ కలిగిన ఆటగాడిగా పేరున్న రొనాల్డో ఇటీవలే ఆటకు తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ప్రతిష్టాత్మక ఫిఫా ర్యాంకింగ్స్‌లోనూ తొలిసారి టాప్-5లో చోటు దక్కించుకోలేకపోయాడు. అయినప్పటికి రొనాల్డోకు క్రేజ్ మాత్రం ఏం తగ్గలేదని తాజా వీడియో నిరూపించింది. ఇక రొనాల్డో మాంచెస్టర్ యునైటెడ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక ఫుట్‌బాల్ తర్వాత రొనాల్డోకు అత్యంత ఇష్టమైన క్రీడ ఎంఎంఏ(MMA-మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్). ఫుట్‌బాల్ కెరీర్ నుంచి తప్పుకున్న తర్వాత ఎంఎంఏ క్రీడలో పెట్టుబడులు పెడతానని రొనాల్డొ ఇదివరకే పేర్కొన్నాడు. కాగా తాను ఫుట్‌బాలర్ కాకపోయుంటే కచ్చితంగా మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం పొందేవాడినని రొనాల్డో ఒక సందర్భంలో తెలిపాడు.
చదవండి: సరికొత్త ప్రపంచ రికార్డు.. 24 గంటల్లో 319 కిలో మీటర్లు
Comments
Please login to add a commentAdd a comment