CWG 2022: Ghana Boxer Shakul Samed Suspended After Failing Drug Test - Sakshi
Sakshi News home page

CWG 2022: ఎక్కడికెళ్లినా దొరికిపోవడమే.. వీడేం బాక్సర్‌ రా బాబు!.. కామన్‌వెల్త్‌ నుంచి సస్పెండ్‌ 

Published Sat, Jul 30 2022 1:12 PM | Last Updated on Sat, Jul 30 2022 1:57 PM

CWG 2022: Ghana Boxer Shakul Samed Suspend Immediate Failing Drug Test - Sakshi

Common Wealth Games 2022.. డోపింగ్‌ టెస్టులో అడ్డంగా దొరికిన ఘనా బాక్సర్‌ షాకుల్‌ సమద్‌ను కామన్‌వెల్త్‌ గేమ్స్‌ నిర్వాహకులు సస్పెండ్‌ చేశారు. మ్యాచ్‌కు ముందు నిర్వహించిన యాంటీ డోపింగ్‌ టెస్టులో పాజిటివ్‌గా తేలాడు. షాకుల్‌ నిషేధిత డ్రగ్‌(ఫ్యూరోసిమైడ్‌) తీసుకున్నట్లు యాంటీ డోపింగ్‌ కమిటీ నివేదిక ఇచ్చింది. దీంతో బాక్సర్‌ షాకుల్‌ సమద్‌పై కామన్‌వెల్త్‌ సస్పెన్షన్‌ వేటు విధించింది.

కాగా ఇంతకముందు టోక్యో ఒలింపిక్స్‌లోనూ షాకుల్‌ సమద్‌ వెయిట్‌ విషయంలో ఒక్క మ్యాచ్‌ ఆడకుండానే బయటకు వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు వెయిట్‌ కేటగిరి విషయంలో తప్పుడు రిపోర్ట్స్‌ ఇవ్వడంతో నిర్వాహకులు మ్యాచ్‌ ఆడేందుకు అనుమతించలేదు. దీంతో తన ప్రత్యర్థి ఆటగాడికి వాకోవర్‌ లభించింది. తాజాగా కామన్‌వెల్త్‌లో పతకం సాధిస్తాడనుకుంటే ఈసారి ఏకంగా డోపింగ్‌ టెస్టులో దొరికిపోయి గేమ్స్‌ నుంచి సస్పెండ్‌ అయ్యాడు. దీంతో ఈ ఘనా బాక్సర్‌ ఎక్కడికెళ్లినా దొరికిపోవడమే పనిగా పెట్టుకున్నాడంటూ అభిమానులు కామెంట్స్‌ చేయడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: CWG 2022: ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత స్విమ్మర్‌.. తొలి పతకం దక్కేనా!

Common Wealth Games 2022: కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో 14 ఏళ్ల భారత క్రీడాకారిణి సంచలనం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement