బాక్సింగ్ యోధుడు మహ్మద్ అలీ మృతిపట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
హెరాత్: బాక్సింగ్ యోధుడు మహ్మద్ అలీ మృతిపట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అమెరికా ప్రొఫెషనల్ బాక్సింగ్ ప్లేయర్ అలీ మరణం తీరని లోటని ట్విట్టర్లో సంతాపం తెలిపారు. ఆదర్శప్రాయమైన క్రీడాకారుడిగా పేరు తెచ్చుకున్న అలీ ఆత్మకు శాంతి చేకూరాలని మోదీ తెలిపారు. సకల మానవాళికి అతని జీవితం స్ఫూర్తిగా నిలిచిందని మోదీ కొనియాడారు. ప్రస్తుతం ఐదు దేశాల పర్యటనలో భాగంగా అప్ఘాన్ లో ఉన్న మోదీ.. మహ్మద్ అలీ మృతివార్త తెలుసుకుని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తన కెరీర్లో ఎందరో యోధులను మట్టికరిపించిన అలీ మృత్యువుతో పోరాడుతూ శనివారం ఉదయం తుది శ్వాస విడిచారు. శ్వాసకోస సంబంధిత సమస్యతో ఫినిక్స్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అలీ కన్నుమూశారు.