Muhammad Ali
-
ఆ మట్టి.. ఆ నీరు
శ్రీకృష్ణుడికి అటుకులు తీసుకొచ్చిన బాల్యమిత్రుడు కుచేలుడి కథ అందరికీ తెలిసిందే. అలాంటిదే డాక్టర్ మన్మోహన్సింగ్ (Manmohan Singh) జీవితంలోనూ జరిగింది. అవిభాజ్య భారత్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న గాహ్ (ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది) అనే గ్రామంలో సింగ్ జన్మించారు. పాఠశాల చదువు అక్కడే పూర్తి చేశారు. 1947 విభజన తరువాత కుటుంబం భారత్‌కు వచ్చింది. కానీ ఆయన బాల్యమంతా ఆ గ్రామంతోనే ముడిపడి ఉంది. స్నేహితులు అక్కడే ఉండిపోయారు. 2004లో ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆ వార్త స్వగ్రామానికి చేరకుండా ఉంటుందా? మిత్రులంతా ఆయనను గుర్తు చేసుకున్నారు. మన్మోహన్‌సింగ్‌కు ప్రాణమిత్రుడైన రాజా మహమ్మద్ అలీకి చిన్ననాటి స్నేహితుడు మన్మోహన్‌ను కలవాలనిపించింది. ఆయన చిన్నతనంలో మన్మోహన్సింగ్ను అలాగే పిలిచేవారు. తన సామర్థ్యం మేరకు కానుకలను పట్టుకుని 2008 మే నెలలో ప్రధాని నివాసానికి వచ్చారు. తనను కలవడానికి వచ్చిన చిరకాల మిత్రుడు అలీకి మన్మోహన్ మరిచిపోలేని ఆతిథ్యమిచ్చారు. అప్పుడు ఇద్దరిదీ డెబ్బై ఏళ్ల వయసు. కానీ బాల్య జ్ఞాపకాలతో ఇద్దరి కళ్లు మెరిసిపోయాయి. ఆ పూటంతా జ్ఞాపకాలతో గడిచిపోయింది. మిత్రుడికి తలపాగా, శాలువాతోపాటు టైటాన్ వాచ్‌ను తన గుర్తుగా ఇచ్చారు మన్మోహన్. ఇక అలీ తిరిగి వెళ్తూ.. మన్మోహన్కోసం తీసుకొచ్చిన ఊరి మట్టిని, నీటిని, గాహ్ ఫొటోను బహూకరించాడు. స్నేహంకోసం మట్టిని ఎల్లలు దాటించి ఒక మిత్రుడు తీసుకొస్తే.. సరిహద్దులు ఎన్నున్నా స్నేహం ఎల్లకాలం ఉంటుందనడానికి గుర్తుగా గడియారాలను పంపారు. అలా బాల్యమిత్రులు ఒకరిపై ఒకరి ప్రేమను చాటుకున్నారు. -
ఆ ముగ్గురు దిగ్గజాలు క్రికెట్‌ను ఏలేవారేమో!
ఆస్ట్రేలియా విధ్వంసక ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ పరిమిత ఓవర్ల క్రికెట్లో సత్తా చాటుతున్నాడు. ముఖ్యంగా టి20ల్లో విధ్వంసకర ఇన్నింగ్స్‌లకు పెట్టింది పేరైన స్టోయినిస్ ప్రస్తుతం ఐపీఎల్ 16వ సీజన్లో బిజీగా గడుపుతున్నాడు. ఐపీఎల్లో కేఎల్ రాహుల్ సారధ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కాగా ఇవాళ ఎస్ఆర్హెచ్తో లక్నో సూపర్ జెయింట్స్ అమితుమీ తేల్చుకోనుంది. కాగా ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌కు సన్నద్ధమవుతున్న స్టోయినిస్ ఐపీఎల్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. క్రీడారంగానికి సంబంధించి నీకిష్టమైన ముగ్గురు రిటైర్డ్ ఆటగాళ్ల పేర్లు చెప్పమని అడిగారు. దీనికి స్టోయినిస్.. మాజీ బాస్కెట్‌బాల్ దిగ్గజం మైకెల జోర్డాన్, గోల్ఫ్ దిగ్గజం టైగర్‌వుడ్స్, బాక్సింగ్ దిగ్గజం మహమూద్ అలీ పేర్లను ఏంచుకున్నాడు. ఒకవేళ ఈ ముగ్గురు ఆయా రంగాల్లో కాకుండా క్రికెట్లో ఆడుంటే ఈ ఆటను కూడా ఏలేవారేమో అని పేర్కొన్నాడు. ఇక తాను, ఆస్టన్ అగర్ యూఎఫ్సీకి పెద్ద అభిమానులమని.. ఎప్పుడు మ్యాచ్‌లు జరిగినా తప్పుకుండా చూస్తామన్నాడు. యూఏఈ వేదికగా జరిగిన 2021 టి20 ప్రపంచకప్ సందర్భంగా గోల్ప్ ఆడడానికి పొవెళ్లాం. అక్కడ యూఎఫ్‌సీ ఛాంపియన్స్‌గా ఫోజు ఇవ్వడం ఇప్పటికి మరిచిపోలేదని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం స్టోయినిస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇప్పటివరకు లక్నో సూపర్ జెయింట్స్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒక దాంట్లో గెలిచి మరొక దాంట్లో ఓడింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో 50 పరుగుల తేడాతో గెలిచిన లక్నో.. సీఎస్కే చేతిలో 12 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. The Christian Bale connection to his social-media post 🤔 3⃣ sportspersons he wished would have played cricket 👌 Who is on his speed dial 📱@MStoinis 𝙐𝙉𝙋𝙇𝙐𝙂𝙂𝙀𝘿 ahead of @LucknowIPL's home game against #SRH tonight 😎 - By @ameyatilak #TATAIPL | #LSGvSRH pic.twitter.com/6lLOpFbkb8 — IndianPremierLeague (@IPL) April 7, 2023 చదవండి: IPL 2023: 'టైమూ పాడూ లేదు.. చూసేవాళ్లకు చిరాకు తెప్పిస్తోంది' -
3 నెలల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ అందుబాటులోకి
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పనులు తుది దశకు చేరుకున్నాయని, మరో మూడు నెలల్లో దీనిని ప్రారంభిస్తామని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్ రోడ్ నెం.12 లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులను డీజీపీ మహేందర్‌రెడ్డి, సీపీ సీవీ ఆనంద్‌తో కలిసి ఆయన పరిశీలించారు. రూ.585 కోట్లతో నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులు 95 శాతం పూర్తయ్యాయని చెప్పారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా దీనిని నిర్మిస్తున్నామన్నారు. విదేశీ సాంకేతికతతో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని ఇది అందుబాటులోకి వచ్చాక పోలీస్‌వ్యవస్థ మరింత బలోపేతమవుతుందన్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 9.21 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ఈ కెమెరాలన్నింటిని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా మానిటరింగ్ చేస్తామన్నారు. ఇక్కడ ఒకేసారి లక్ష సీసీ కెమెరాలను చూసే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్ విభాగాలను మానిటర్ చేయడానికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఇక్కడే ప్రారంభిస్తున్నామన్నారు. -
ముఖం మీద పిడిగుద్దులు పడుతున్నా.. చిరునవ్వుతో!
ముహమ్మద్ ఆలీ.. బాక్సింగ్ దిగ్గజం. 20వ శతాబ్దంలో ‘ది గ్రేటెస్ట్’ గుర్తింపు ఉన్న ఆటగాడు. ఇవన్నీ కాదు.. ఛాంపియన్‌కి పర్యాయ పదం ఈ లెజెండ్. రింగ్‌లో ప్రత్యర్థిని పిడిగుద్దులతో అగ్రెస్సివ్‌గా మట్టికరిపించే ఆలీ.. ప్చ్.. తన వీక్నెస్కు లొంగిపోయి అతని చేతిలో ఓటమి పాలయ్యాడు. పిల్లలు దేవుళ్లు.. ఒక్కటే అంటారు. అందుకే బోసి నవ్వుల దేవుళ్లంటూ పిల్లల్ని అభివర్ణిస్తుంటారు. అప్పుడప్పుడు వాళ్లు చేసే పనులు చూడముచ్చటగా ఉంటాయి కూడా. అందుకే పిల్లలంటే ఆలీకి బాగా ఇష్టం. వాళ్ల అల్లరిని భరించడంలో ఆయన దిట్ట. అలా ఓ చిన్నారి చేష్టలకు మురిసిపోయే.. ఆలీ పిడిగుద్దులు తిన్నాడు. బాక్సింగ్ గ్లౌజ్‌లు వేసుకున్న ఆ బుడ్డోడు.. ఆలీ యాక్టింగ్‌ను ఎంజాయ్ చేశాడు. ఆలీ నాలిక బయటపెట్టి రెచ్చగొడుతుంటే.. ఎగబడి మరీ గుద్దేశాడు. చివరికి ఆలీ ఓడిపోయినట్లు రెఫరీ ఆ బుడ్డోడి చేతిని పైకి ఎత్తి అభినందించడంతో.. చేతుల్ని ప్రొఫెషనల్ బాక్సర్‌లాగా కొట్టుకుంటూ బిల్డప్ ప్రదర్శించాడు. అది చూసి.. ఓ ముద్దు పెట్టమంటూ ఆలీ కోరగా.. ‘ఎలాగూ ఓడిపోయాడు కదా! ఓ ముద్దిస్తే ఏమవుతుంది పోనీలే.. అనుకుంటూ ఆలీ ముచ్చటను తీర్చేశాడు ఆ బుడ్డోడు. The best boxing match I have witnessed #MuhammadAli pic.twitter.com/etQXR7qVJ1 — Harsh Goenka (@hvgoenka) February 24, 2022 పారిశ్రామికవేత్త హార్ష్ గోయెంకా ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్లో పోస్ట్ చేశాడు. ‘నేను చూసిన బెస్ట్ బాక్సింగ్ మ్యాచ్ ఇదే’ అంటూ క్యాప్షన్ ఉంచారు. గోయెంకా పోస్ట్‌కి విపరీతంగా లైకులు, కామెంట్లు వచ్చిపడుతున్నాయి. అయితే తరచూ ఇది సోషల్ మీడియాలో కనిపించే వీడియోనే అనుకోండి. -
అడ్మిషన్ల కోసం పోటీపడేలా..
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం పోటీపడే స్థాయికి తీసుకొస్తామని పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న అనేక సమస్యలను రాబోయే రెండేళ్లలో పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. శనివారం పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో ‘మన బస్తీ– మన బడి’పై హోం మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. తలసాని మాట్లాడుతూ, పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరుస్తామని, పేద, మధ్య తరగతి కుటుంబాలకు మంచి విద్యను అందించాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని పేర్కొన్నారు. పాఠశాలల్లో సౌకర్యాలకు నిధులను సీఎం కేటాయించారని, త్వరగా సమస్యలను పరిష్కరించాలని, ఇంగ్లిష్ మీడియంపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు ఆయా పాఠశాలలను సందర్శిస్తూ సమస్యలను తెలుసుకోవాలన్నారు. ఫీజులపై ప్రైవేటు స్కూళ్లలో ఒత్తిడి చేస్తున్నారని విలేకరులు ప్రశ్నించగా, ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీసుకువస్తామని, అప్పుడు ప్రైవేటుకు వెళ్లేవారు తగ్గుతారని తలసాని పేర్కొన్నారు. -
వారి విమర్శలు అర్థం లేనివి: హోంమంత్రి
సాక్షి, హైదరాబాద్: సచివాలయం కూల్చివేతలో భాగంగా ప్రార్థనాలయాలకు జరిగిన నష్టంపై విపక్షాలు చేస్తున్న విమర్శల్లో అర్థం లేదని హోంమంత్రి మహమూద్ అలీ వ్యాఖ్యానించారు. నల్లపోచమ్మ ఆలయం, మసీదులను కొత్తగా నిర్మిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన తరువాత కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేయడం తగదని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
మహిళల రక్షణ కోసం ‘స్త్రీ’
గోల్కొండ: మహిళా సాధికారత, భద్రత కోసం ఓ వేదిక కల్పించడం ఎంతో గర్వంగా ఉందని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. హైదరాబాద్ సిటీ పోలీస్, హైదరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తంగా రూపొందించిన స్త్రీ పథకాన్ని శనివారం హైదరాబాద్‌లోని తారామతి బారాదరి ఆడిటోరియంలో ప్రారంభించారు. మహిళలకు సమున్నత గౌరవం, సమానత్వం, సాధికారత కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మాట్లాడుతూ.. సమాజంలో వివిధ వర్గాల మహిళలను ఓ వేదికపైకి తేవడం స్త్రీ పథకం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. మహిళలు, పోలీసులను ఒకే వేదికపైకి తెచ్చి మహిళలు, బాలికల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు మహిళా హక్కులు, చట్టంలో వారికున్న హక్కులను ఈ వేదిక ద్వారా తెలియజేస్తామని పేర్కొన్నారు. మహిళల పట్ల జరుగుతున్న హింసను నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరిగి మహిళల సలహాలు తీసుకుంటామని వివరించారు. స్థానికంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, రక్షణ, సమానత్వం, గౌరవం తదితర విషయాలపై ఈ వేదికపై చర్చ జరుగుతుందని తెలి పారు. మహిళా సా«ధికారత, నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తామని పేర్కొన్నారు. ఈ వేదిక ద్వారా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నెట్వర్క్ తయారు చేస్తామని, పోలీస్ స్టేషన్ పరిధిలో ‘స్త్రీ’గ్రూప్ ఏర్పాటు చేసి సబల మహిళా వలంటీర్లను ఏర్పాటు చేసి సబల శక్తి వలంటీర్ల గ్రూపులను తయారు చేస్తామని చెప్పారు. మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో హైదరాబాద్ అదనపు కమిషనర్లు షికా గోయెల్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మైనారిటీలకు 100% సబ్సిడీ రుణాలు
సాక్షి, హైదరాబాద్: మైనారిటీలకు బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా 100 శాతం సబ్సిడీపై రుణాలు అందించే ప్రతిపాదనను త్వరలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు నివేదిస్తానని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. సోమవారం సచివాలయంలోని తన చాంబర్లో మైనారిటీ సంక్షేమం, అభివృద్ధి పథకాలపై అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వం ఆయా పథకాల కింద పెద్ద ఎత్తున సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తున్నా బ్యాంకర్లు తిరస్కరిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం 80 సబ్సిడీ మంజూరు చేస్తున్నా కేవలం 20 శాతం రుణం కోసం బ్యాంకర్లు నిరాకరించటమేమిటని ప్రశ్నించారు. భవిష్యత్‌లో బ్యాంకర్లతో ప్రమేయం లేకుండా ప్రభుత్వమే 100 శాతం సబ్సిడీపై నేరుగా రుణాలు అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న రుణాల మంజూరు ప్రక్రియ నెల రోజుల్లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మైనారిటీ ఓవర్సీస్ ఉపకార వేతనాల గడువును ఈ నెల 31 వరకు పొడిగించాలని సూచించారు. మైనారిటీ కుట్టు శిక్షణ, కంప్యూటర్ సెంటర్ల నిర్వహణ సరిగ్గా లేదని, వాటి స్థానంలో జిల్లాకు ఒకటి చొప్పున మైనారిటీ అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్లో ఉన్న ఖాళీ పోస్టులను ప్రభుత్వం త్వరలో భర్తీ చేస్తుందని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. సమావేశంలో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, మైనారిటీ వ్యవహారాల సలహాదారు ఏకే ఖాన్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అక్బర్, మేనేజింగ్ డైరెక్టర్ షఫీ ఉల్లా తదితరులు పాల్గొన్నారు. -
మొహమ్మద్ అలీకి మూడు పతకాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో మొహమ్మద్ అలీ, వరుణి జైశ్వాల్ సత్తా చాటారు. బండ్లగూడలోని మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వేదికగా జరిగిన ఈ టోర్నీలో అలీ 3, వరుణి రెండు టైటిళ్లను కైవసం చేసుకున్నారు. వీరిద్దరూ జూనియర్, యూత్ బాలబాలికల విభాగాల్లో విజేతలుగా నిలిచారు. ఆదివారం జరిగిన జూనియర్ బాలుర ఫైనల్లో మొహమ్మద్ అలీ (ఎల్బీ స్టేడియం) 11–9, 11–9, 11–6, 11–6తో వరుణ్ శంకర్ (జీటీటీఏ)పై గెలుపొందాడు. యూత్ బాలుర ఫైనల్లోనూ మొహమ్మద్ అలీ 11–8, 11–5, 11–6, 11–8తో అమాన్ ఉల్ రెహమాన్ (స్టాగ్ అకాడమీ)ని ఓడించి విజేతగా నిలిచాడు. పురుషుల టైటిల్ పోరులో అలీ 11–2, 13–11, 11–9, 11–9తో మనోహర్ కుమార్‌పై గెలుపొందాడు. మరోవైపు జూనియర్ బాలికల ఫైనల్లో వరుణి జైశ్వాల్ (జీఎస్ఎం) 5–11, 13–11, 11–8, 11–2, 6–11, 6–11, 11–9తో జి. ప్రణీత (హెచ్‌వీఎస్)పై, యూత్ బాలికల ఫైనల్లోనూ ఆమె 13–11, 11–7, 13–11, 11–6తో జి. ప్రణీతపైనే గెలుపొందింది. మహిళల ఫైనల్లో నైనా జైశ్వాల్ (ఎల్బీ స్టేడియం) 11–7, 11–5, 10–12, 9–11, 11–5, 11–8తో ప్రణీత (హెచ్‌వీఎస్)ను ఓడించింది. సబ్ జూనియర్ బాలికల విభాగంలో అంజలి (ఎంఎల్ఆర్) 11–6, 12–10, 5–11, 11–9, 3–11, 11–7తో భవిత (జీఎస్ఎం)పై గెలుపొందగా, బాలుర విభాగంలో వరుణ్ శంకర్ 14–12, 11–9, 11–8, 11–9తో అద్వైత్ (ఏడబ్ల్యూఏ)ను ఓడించాడు. -
బాక్సింగ్ గ్రేట్ కుమారుడికి అమెరికాలో అవమానం
బాక్సింగ్‌కు మారుపేరైన మహ్మద్ అలీ కుమారుడికి అమెరికాలోని ఒక విమానాశ్రయంలో తీవ్ర అవమానం ఎదురైంది. జమైకా పర్యటనకు వెళ్లి అక్కడి నుంచి తిరిగి వచ్చిన ఆయనను ఫ్లోరిడా విమానాశ్రయంలో అధికారులు రెండు గంటల పాటు ప్రశ్నించారు. కేవలం ఆయనది ముస్లిం పేరు కావడమే అందుకు కారణమని అమెరికా మీడియా తెలిపింది. మహ్మద్ అలీ జూనియర్ (44) ఫిలడెల్ఫియాలో పుట్టారు. ఆయనకు అమెరికా పాస్‌పోర్టు ఉంది. తన తల్లి, మహ్మద్ అలీ రెండో భార్య అయిన ఖైలాష్ కమాచో అలీతో కలిసి అలీ జూనియర్ జమైకా వెళ్లి వచ్చారు. ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడెర్డేల్ విమానాశ్రయంలో వాళ్లిద్దరినీ రెండు గంటల పాటు ప్రశ్నించారని వాళ్ల తరఫు న్యాయవాది చెప్పారు. తన భర్తతో కలిసి ఉన్న తన ఫొటోను అధికారులకు చూపించిన తర్వాత అలీ భార్యను వదిలిపెట్టారు. అలీ జూనియర్ వద్ద మాత్రం అప్పటికి సిద్ధంగా అలాంటి ఫొటో ఏమీ లేదు. దాంతో 'నువ్వు ముస్లింవా.. ఈ పేరు నీకు ఎలా వచ్చింది'' అటూ ప్రశ్నలు వెల్లువెత్తించారు. తన తండ్రి నుంచే తనకు ముస్లిం మతం వచ్యచిందని చెప్పినప్పుడు మరిన్ని ప్రశ్నలు వేశారు. దీన్ని బట్టి చూస్తే ట్రంప్ అధికార యంత్రాంగం ముస్లింలను అమెరికా నుంచి పంపేయాలని గట్టిగా నిర్ణయించినట్లు తెలుస్తోందని అలీ జూనియర్ న్యాయవాది మాన్సిని తెలిపారు. 20వ శతాబ్దపు క్రీడా హీరోలలో ఒకరైన మహ్మద్ అలీ (74).. సుదీర్ఘ కాలం పాటు పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడి గత జూన్ 3వ తేదీన మరణించారు. ఆయనకు మూడు ప్రపంచ హెవీవెయిట్ టైటిళ్లున్నాయి. ఇక రింగ్ బయట ఆయన పౌర హక్కుల కోసం కూడా పోరాడారు. అలాంటి దిగ్గజం కుమారుడికే ఇప్పుడు పౌర హక్కుల సమస్య ఎదురు కావడం గమనార్హం. -
ఆలీ ద గ్రేట్
-
ఈ టైటిల్ ఆ దిగ్గజానికి అంకితం
న్యూఢిల్లీ: ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారిన భారత బాక్సర్ విజేందర్ సింగ్ వరుస బౌట్లలో ప్రత్యర్థులను మట్టికరిస్తూ ముందుకు సాగుతున్నాడు. ప్రొఫెషనల్‌గా మారిన ఈ స్టార్ ఆటగాడు తన కెరీర్లోనే అతి పెద్ద విజయాన్ని సాధించాడు. శనివారం త్యాగరాజన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో కెర్రీ హోప్ (ఆస్ట్రేలియా)తో జరిగిన బౌట్లో విజయం సాధించి ‘డబ్ల్యూబీఓ ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్’ టైటిల్ సాధించిన విషయం తెలిసిందే. ఈ టైటిల్ ను గతనెల మూడో తేదీన కన్నుమూసిన బాక్సింగ్ లెజెండ్ మొహమ్మద్ అలీ కి అంకితమిస్తున్నట్లు విజేందర్ ప్రకటించాడు. ఈ తాజా బౌట్లో 98-92, 98-92, 100-90 తేడాతో కెర్రీపై నెగ్గడంతో ప్రపంచ ప్రొఫెషనల్ ర్యాంకింగ్స్‌లో 15వ స్థానానికి చేరి మరిన్ని పెద్ద బౌట్లకు రంగం సిద్ధం చేసుకున్నాడు. మూడు రౌండ్ల వరకూ బౌట్ హోరాహోరీగా సాగింది. అయితే నాలుగో రౌండ్లో విజేందర్ విసిరిన రైట్ హుక్ ప్రత్యర్థి కెర్రీ హోప్ ఎడమ కన్నుపై బలంగా తాకింది. అక్కడి నుంచి విజేందర్ బౌట్ లో చురుగ్గా కదులుతూ, డిఫెన్స్ కు ప్రాధాన్యమిస్తూ ప్రత్యర్థిపై సంచలన విజయాన్ని నమోదుచేశాడు. కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, క్రికెటర్లు యువరాజ్, రైనా, సెహ్వాగ్, బాక్సర్ మేరీకామ్, నటి నేహా ధూపియా, ఇతర ప్రముఖులు ఈ బౌట్‌ను తిలకించారు. -
గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం కృషి
♦ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ♦ మహేశ్వరంలో ‘జాగో బంజారా’బహిరంగ సభ ♦ హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ తండాలను పంచాయతీలుగా మారుస్తాం గిరిజనుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోంది. తండాలకు రోడ్ల నిర్మాణం చేపట్టి ఆర్టీసీ బస్సులు నడుపుతాం. 500 జనాభా కలిగిన ప్రతి తండాను గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతాం. రూ.20 కోట్లతో బంజారాహిల్స్‌లో బంజారా భవన్ నిర్మిస్తాం. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు కోసం గిరిజనులు తీవ్రంగా పోరాడారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. - ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఐదు జిల్లాలుగా రంగారెడ్డి, హైదరాబాద్ పరిపాలనా సౌలభ్యం కోసమే జిల్లాల పునర్విభజన. తెలంగాణ రాష్ర్టంలో కొత్తగా 14 లేదా 15 జిల్లాలు ఏర్పాటు కాబోతున్నారుు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు ఐదు జిల్లాలుగా ఏర్పడనున్నారుు. కొత్త జిల్లాల ఏర్పాటుతో అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది. ఈ ఏడాది 46 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రస్తుతమున్న 24 శాతం అటవీ విస్తీర్ణాన్ని మూడేళ్లలో 33 శాతానికి పెంచుతాం. - ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మహేశ్వరం : గిరిజనుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తండాలకు రోడ్డు నిర్మాణం, ఆర్టీసీ బస్సు సౌకర్యాలతో పాటు కృష్ణా నీటిని అందిస్తామని తెలిపారు. జాగో బంజార సేవా సంఘం ఆధ్వర్యాన మహేశ్వరంలోని పోతర్ల బాబయ్య ఫంక్షన్ హాల్లో మంగళవారం ‘జాగో బంజారా’ బహిరంగ సభను నిర్వహించారు. దీనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం... తెలంగాణలో గిరిజనులకు ఉన్న 6శాతం రిజర్వేషన్లను 12 శాతానికి పెంచుతామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఆజ్మీరా చందూలాల్ అన్నారు. గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం రూ.460 కోట్లు వెచ్చిందని తెలిపారు. ప్రతీ మండల కేంద్రంలో బంజారా భవన్ , గిరిజన కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు. 10 శాతం డబుల్ బెడ్ రూం ఇళ్లను తండావాసులకు ఇస్తామని స్పష్టంచేశారు. పంచాయతీలుగా గుర్తిస్తాం... 500 జనాభా కలిగిన గిరిజన తండాలను పంచాయతీలుగా గుర్తిస్తామని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. గత ఎన్నికల్లో గిరిజనులకు ఇచ్చిన ప్రతీ హామీని సీఎం కేసీఆర్ నెరవేరుస్తారని చెప్పారు. బంజారాహిల్స్‌లో 20 కోట్లతో బంజారాభవన్ నిర్మిస్తున్నట్లు వివరించారు. ఎమ్మెల్యే తీగల, ఎమ్మెల్సీ రాములు నాయక్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు గిరిజనులను ఓటు బ్యాంకుగానే ఉపయోగించుకున్నాయని, వారి సంక్షేమాన్ని పట్టించుకోలేదని మండిపడ్డారు. అర్హులైన గిరిజనులకు సంక్షేమ పథకాలు అందేలా చూస్తామన్నారు. ఈ సందర్భంగా గిరిజన కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నారుు. సంఘం జాతీయ కార్యదర్శి దీప్లాల్ చౌహన్ , ఎంపీపీ పెంటమల్ల స్నేహ, జెడ్పీటీసీ సభ్యుడు నేనావత్ ఈశ్వర్ నాయక్, వైస్ ఎంపీపీ స్వప్న, సర్పంచ్ ఆనందం, ఎంపీటీసీ సభ్యుడు బద్రు బుజ్జినాయక్, మాజీ ఎంపీపీ పాండు నాయక్, బంజారా సంఘం మండల అధ్యక్షుడు, అంగోత్ క్ృష్ణా నాయక్, ప్రధాన కార్యదర్శి మోతిలాల్ నాయక్, జిల్లా నాయకులు అంగోత్ రాజు నాయక్, దేవులనాయక్, లక్ష్మణ్, రాములు, పాండు, జాంప్లా నాయక్ గిరిజనులు పాల్గొన్నారు. -
అశ్రునయనాల మధ్య అలీ అంత్యక్రియలు
లూయిస్విల్లే: వేలాది మంది అశ్రునయనాల మధ్య విశ్వవిఖ్యాత బాక్సర్ మొహమ్మద్ అలీ(74) అంత్యక్రియలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. సొంత నగరం లూయిస్విల్లే వీధుల గుండా సాగిన ఆయన అంతిమయాత్రను చివరిసారిగా తిలకించేందుకు అభిమానులు పోటెత్తారు. ‘అలీ వియ్ లవ్ యూ..’ అనే ప్లకార్డులతో మహాయోధుడికి చివరిసారిగా వీడ్కోలు పలికారు. సీతాకోక చిలుకలా విహరించు.. అనే తన నినాదానికి అనుగుణంగా కాన్వాయ్‌లోని వాహనాలకు బట్టర్‌ఫ్లయ్ గుర్తులను ఉంచారు. 1960లో ఒలింపిక్ స్వర్ణం సాధించిన అనంతరం అలీని ఘనంగా ఊరేగించిన మార్గంలోనే ఆయన చివరి యాత్రను కూడా సాగించారు. కేవ్ హిల్ శ్మశానవాటికలో ముస్లిం సంప్రదాయ పద్దతిలో ఆయన అంత్యక్రియలు పూర్తిచేశారు. ఈ కార్యక్రమంలో పలువురు క్రీడా, రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొనున్నారు. మాజీ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్, హాలీవుడ్ యాక్షన్ హీరో విల్ స్మిత్‌లు అలీ అంత్యక్రియలకు హాజరై స్వయంగా అలీ భౌతిక దేహాన్ని తమ భుజాలపై మోశారు. సెలబ్రిటీలతో పాటు సామాన్య అభిమానులు కూడా భారీ ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తన కెరీర్లో ఎందరో యోధులను మట్టికరిపించిన అలీ శ్వాసకోస సంబంధిత సమస్యతో ఫినిక్స్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భారత కాలమానం ప్రకారం గత శనివారం ఉదయం మరణించిన విషయం తెలిసిందే. -
అలీ అంత్యక్రియలకు హాలీవుడ్ హీరో
ఇటీవల మరణించిన బాక్సింగ్ దిగ్గజం మహ్మద్ అలీ అంత్యక్రియలు, ఈ నెల 10న ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు క్రీడా, రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొనున్నారు. ఇప్పటికే హాలీవుడ్ యాక్షన్ హీరో విల్ స్మిత్ అలీ అంత్యక్రియలు హాజరవుతున్నట్టుగా ప్రకటించారు. అంతేకాదు ఆయన స్వయంగా అలీ భౌతిక దేహాన్ని తన భుజాలపై మోయనున్నారు. సెలబ్రిటీలతో పాటు సామాన్య అభిమానులు కూడ ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వీలుగా 30 వేల పాసులు ఇస్తున్నారు. మహ్మద్ అలీ జీవిత కథ ఆదారంగా తెరకెక్కిన అలీ సినిమాలో విల్ స్మిత్ టైటిల్ రోల్ లో నటించాడు. ఈ పాత్రకు గాను స్మిత్ ఆస్కార్ అవార్డుకి నామినేట్ అయ్యారు. అలీ మరణంతో తాను ఒ మంచి స్నేహితుణ్ని గురువును కొల్పోయానని తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు స్మిత్. -
‘‘ సీతాకోకచిలుక ఆత్మ’’
జీవన కాలమ్ ఒక జీవితకాలం తను నమ్మిన నిజాల కోసం పోరాడిన ఓ ప్రపంచ యోధుడు కాలం పుటల్లో చిరస్థాయిగా నిలుస్తాడు. మానవత్వం జీవితాన్ని కుదిస్తుందేమో కానీ ‘కీర్తి’ని కాదని నిరూపించిన వీరుడు మహమ్మద్ ఆలీ. ఇది చింతా దీక్షితులు, తిలక్ కవిత్వంలో వాక్యం కాదు. ప్రపంచంలో అనితర సాధ్య మైన ముష్టి యుద్ధ వీరుడిగా మూడుసార్లు టైటిల్‌ని గెలుచు కున్న చరిత్రకారుడు మహ మ్మద్ ఆలీ రచనకు శీర్షిక (""Soul of a butterfly''). కొన్ని వందలసార్లు మృత్యు వుకి దగ్గరగా వెళ్లి, కొన్ని వేలసార్లు ప్రత్యర్థులను మృత్యువుకి దగ్గరగా తీసుకెళ్లిన ప్రసిద్ధుడయిన వీరుడు చెప్పిన మాటలు ఇవి: ‘‘జీవితం చాలా కురుచ. మనం చాలా త్వరగా వృద్ధాప్యంలో పడతాం. ‘ద్వేషం’ పెంచు కొని జీవితాన్ని వృథా చేసుకోవడంలో అర్థం లేదు’’ మరొక్కసారి - ఈ మాటలు చెప్పింది మహాత్మాగాంధీ కాదు. థోరో కాదు. రామకృష్ణ పరమహంస కాదు. ఒక బాక్సింగ్ చాంపియన్. అమెరికా పౌరుడిగా ఆయన్ని వియత్నాం యుద్ధంలో సైనికుడిగా వెళ్లమని అమెరికా ప్రభుత్వం ఆర్డరు ఇచ్చింది. ఆయన సమాధానం: ‘‘నాకు ఆ ప్రజ లతో తగాదా లేదు. బలిసిన అమెరికా కోసం నా సోదరు డిమీద, ఓ నల్లవాడిమీద, బురదలో తమ జీవితాన్ని గడుపుకుంటున్న పేద ఆకలిగొన్న ప్రజలమీద యుద్ధా నికి వెళ్లను. వాళ్లని ఎందుకు కాల్చాలి? వాళ్లు నన్ను వెక్కిరించలేదు. నన్ను హింసించలేదు. నామీద కుక్కల్ని ఉసిగొల్పలేదు. నా తల్లిని మానభంగం చేయలేదు. నా తండ్రిని చంపలేదు. పేదవాళ్లని కాల్చను. కావాలంటే నన్ను జైలుకి పంపండి’’ అన్నాడు. అమెరికా ప్రభుత్వం అతని టైటిల్‌ని రద్దు చేసింది. పాస్‌పోర్టుని స్వాధీనం చేసుకుంది. పోటీలలో పాల్గొనే లెసైన్సుని రద్దుచేసింది. 22వ యేట ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన మహమ్మద్ ఆలీ, కేవలం తన ఆత్మగౌరవం, మానవీయమైన దృక్పథం కారణంగా - మంచి వయస్సులో ఉన్నా - పోటీలకు దూరమయ్యాడు. అయితే మూడేళ్ల తర్వాత సుప్రీంకోర్టు అమెరికా చర్యని కొట్టివేసింది. అతని అసలు పేరు కేసియస్ క్లే. కానీ మానవీయ మైన దృక్పథానికి, అహింసాయుతమైన సిద్ధాంతాలకూ ఆకర్షితుడై ఇస్లాం మతాన్ని స్వీకరించి ‘మహమ్మద్ ఆలీ’గా మారాడు. ఆయన తన స్వీయకథలో-తాను ముష్టి యుద్ధంలో దిగడానికి కారణాలు చెప్తూ-నా మానాన తెల్లవారు నన్ను బతకనిస్తే నేను ఈ రంగంలోకి రాకపోయేవాడిని- అంటూ కేవలం ఆత్మరక్షణకీ, తెల్ల వారినుంచి తన ఉనికిని కాపాడుకోడానికీ ఈ నైపు ణ్యాన్ని పెంచుకోవలసి వచ్చిందన్నాడు. ఆయన పన్నెండో యేట ఎవరో అతని సైకిల్ని ఎత్తుకు పోయారు. ‘‘వాడిని చావగొడతాను’’ అన్నాడు పోలీసు ఆఫీసరుతో. ఆఫీసరు నవ్వి ‘‘ముందు కొట్టడం ఎలాగో నేర్చుకో’’ అన్నాడు. అంతేకాదు. ఆ ఆఫీసరు ముష్టి యుద్ధాన్ని (బాక్సింగ్) నేర్పే టీచరు. ఎలాగో ఇతనికి నేర్పాడు. అదీ ప్రారంభం. రోజూ అలిసిపోయేదాకా పరుగుతీసి - ఇక కాలు కదపలేని స్థితికి వచ్చినప్పుడు - గుర్తు పెట్టుకుని - ఆ తర్వాత తీయగల పరుగు - తనకి ప్రత్యర్థితో చేసే ముష్టి యుద్ధంలో ‘అదనపు’ దమ్ము (ట్ట్చఝజ్చీ)ని ఇస్తుందని గుర్తు పెట్టుకునేవాడట. అదీ ప్రాక్టీసు. ఈ విషయాన్ని ‘ది గ్రేటెస్ట్ : మై ఓన్ స్టోరీ’’ అనే తన ఆత్మకథలో రాసు కున్నాడు. అతని జీవితంలో మరిచిపోలేని పెద్ద పోటీ - జో ఫ్రేజర్ అనే వస్తాదుతో. తేదీ 1971 మార్చి 8. ఆ పోటీకి ‘‘ఈ శతాబ్దపు పోటీ’’ అని పేరు పెట్టారు. 35 దేశాలు ఆ పోటీని ప్రత్యక్ష ప్రసారం చేశాయి. ఆయన కీలకమైన దెబ్బ - ప్రపంచంలో చాలా ప్రసిద్ధమైనది. పోటీలో - రింగు చుట్టూ ఉన్న రబ్బరు తాడుమీద నుంచి ఊపును తీసుకుని అతను కొట్టే దెబ్బ వెయ్యి పౌనులు శక్తి ఉంటుందట. ఈ చాకచక్యాన్ని - నా అదృష్టవశాత్తూ నేను స్వయంగా చూశాను. 1980లో మహమ్మద్ ఆలీ చెన్నై వచ్చినప్పుడు మూర్ మార్కెట్ ప్రాంతంలో ఒక ప్రదర్శనని ఏర్పాటు చేశారు. ఆ ప్రదర్శనకి ముఖ్య అతిథి అప్పటి ముఖ్యమంత్రి ఎంజీఆర్. నేను ప్రేక్ష కులలో ఉన్నాను. ఆలీ అతి సరళంగా తన ఆటను ప్రద ర్శించారు. ‘‘ఆయన సీతాకోకచిలుకలాగా విహరిస్తాడు. తేనెటీగలాగా కాటు వేస్తాడు’’ (He floats like a butterfly but stings like a bee) అన్న నానుడి ఎందుకు వచ్చిందో ఆనాడు అర్థమయింది. జీవితమంతా అతి కఠోరమైన వృత్తిని చేస్తూ - హింసని, మృత్యువుని ఎల్లప్పుడూ ఒరుసుకు ప్రయా ణం సాగించే ఓ ప్రపంచ చాంపియన్ హృదయం అతి ఆర్ద్రమైనది. కేవలం ఆ కారణంగానే తన దేశాన్నీ, తన మతాన్నీ ఎదిరించి నిలిచాడు. అయితే ఒకే ఒక్క రుగ్మత ఆయన్ని లొంగదీసుకుంది. దాదాపు ముప్ఫై ఏళ్ల కిందట ఆల్మైర్స్ వ్యాధి. మూడు దశాబ్దాలు పోరాటం సాగించి - మొన్న జూన్ 4న అలసిపోయాడు. ప్రతిభకీ, మానవత్వానికీ దగ్గర తోవని రచించి - ఒక జీవితకాలం తను నమ్మిన నిజాల కోసం పోరాడిన ఓ ప్రపంచ యోధుడు కాలం పుటల్లో చిరస్థాయిగా నిలుస్తాడు. మానవత్వం జీవితాన్ని కుదిస్తుందేమో కానీ ‘కీర్తి’ని కాదని నిరూపించిన వీరుడు మహమ్మద్ ఆలీ. - గొల్లపూడి మారుతీరావు -
కూతురు కాలేజీవల్ల ఒబామా గైర్హాజరు
వాషింగ్టన్: ప్రముఖ బాక్సర్, ఇటీవల కన్నుమూసిన మహ్మద్ అలీ అంత్యక్రియలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హాజరుకాలేకపోతున్నారు. ఇదే రోజు కూతురు కాలేజీ పనులు ఉండటంతో ఆయన అలీ అంత్యక్రియలకు హాజరుకావడం లేదని అమెరికా వైట్ హౌస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. వాషింగ్టన్‌లోని హైస్కూల్ గ్రాడ్యుయేషన్‌లో కూతురు మలియా చేరుతున్న కార్యక్రమం ఇదే రోజు కావడంతో ఒబామా అక్కడికి వెళుతున్నట్లు ఆ ప్రకటనలో వెల్లడించారు. అలీ సంతాప సందేశాన్ని ఒబామా తరుపున ఓ అధికారిక ప్రతినిధి చదవనున్నారు. కాగా, అలీ అంత్యక్రియలను 'అలీ ఫెస్టివల్' పేరిట ఆయన అభిమానులు జరపనున్నారు. -
వజ్రసమానుడు!
నిజమైన వీరులు నిత్యం ప్రకాశిస్తూనే ఉంటారు. మరణానంతరమూ జనానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు. శనివారంనాడు కన్నుమూసిన ప్రపంచ హెవీ వెయిట్ బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ అలాంటి వీరుల్లో అగ్రభాగాన ఉంటాడు. సర్వకాలాల్లోనూ తానే మొనగాడినని సగర్వంగా ప్రకటించుకోవడమే కాదు... బతికినన్నాళ్లూ అందుకు తగ్గట్టుగా జీవించాడు. అందులోని సందేశాన్ని అందుకోమని ప్రపంచానికి సవాల్ విసిరాడు. రెండు దశాబ్దాల సుదీర్ఘకాలం బాక్సింగ్ రింగ్‌ను ఏలినప్పుడైనా... గత మూడున్నర దశాబ్దాలుగా దానికి దూరంగా ఉంటున్నా జనహృదయాల్లో అలీకి శాశ్వతమైన స్థానం దక్కడంలోని రహస్యం అదే. దృఢమైన దీక్ష, అంకితభావం ఉంటే...మెలకువలను గ్రహించే నేర్పు పట్టుబడితే... వాటికి సృజనాత్మకత తోడైతే అశేష ప్రజానీకాన్నీ అబ్బురపరచడం, విస్మయానికి గురిచేయడం, మోహావేశంలో ముంచెత్తడం ఏ రంగంలోని వారికైనా సాధ్యమయ్యే పనే. కానీ అలీని చిరస్థాయిగా నిలిపినవి ఇవి మాత్రమే కాదు... అంతకుమించి ఆయనలో అశేష మానవాళిపై ఉన్న ప్రేమ, అందుకోసం దేన్నయినా ఎదిరించే తెగువ, ఆ క్రమంలో పొంచి ఉండే ప్రమా దాలను లెక్కచేయని ధీరోదాత్తత అలీని విశిష్ట వ్యక్తిగా నిలిపాయి. పన్నెండేళ్ల వయసులో తనకెంతో ఇష్టమైన సైకిల్‌ను పోగొట్టుకున్నప్పుడు కలిగిన ఆగ్రహం అప్పటికి కాసియస్ మార్సెలస్ క్లే గా ఉన్న అలీని యాదృ చ్ఛికంగా రింగ్‌లోకి నడిపిస్తే ఆ తర్వాత ప్రత్యర్థులను హడలెత్తించే గర్జనలు, కుంభవృష్టిని తలపించే ముష్టిఘాతాలు, మెరుపులా కదిలే నేర్పు బాక్సింగ్ క్రీడలో ఆయనను అంచెలంచెలుగా ఎదిగేలా చేశాయి. 22 ఏళ్ల వయసుకే ఆయనను ప్రపంచ హెవీ వెయిట్ చాంపియన్‌గా నిలిపాయి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే సూక్తిని అలీ ఏనాడూ విశ్వసించలేదు. ఆయన వ్యక్తిత్వానికది అతికే విషయం కాదు. కనుకే ‘నేను గొప్పవాడిని మాత్రమే కాదు...అంతకంటే ఎక్కువే’ అని ప్రకటించుకోగలిగాడు. ‘నన్ను ఓడించినట్టు కలగన్నా సరే... వెంటనే లేచొచ్చి నాకు క్షమాపణ చెప్పడం మంచిది’ అనగలిగాడు. అలీయే ఒదిగి ఉంటే పీడిత ప్రజానీకం ఆయనలో ఒక మానవహక్కుల చాంపియన్‌ను.. వివక్షను ప్రశ్నించే సాహసిని...తమ కోసం కడదాకా పోరాడే యోధుణ్ణి గుర్తించగలిగేది కాదు. నిరసనకూ, తిరుగుబాటుకూ, ధిక్కారానికీ మొహమ్మద్ అలీ ప్రతీక. ప్రతి జవాబునూ ప్రశ్నించడం ఆయన తత్వం. చిన్న వయసులోనే ప్రపంచ హెవీ వెయిట్ చాంపియన్‌షిప్ టైటిల్ గెల్చుకుని ప్రపంచమంతా తన పేరు మార్మో గుతున్న దశలోనే ఇస్లాం మతాన్ని స్వీకరిస్తున్నట్టు ప్రకటించుకుని, ఇకపై తన పేరు మొహమ్మద్ అలీ అని చాటడం ఈ నైజం పర్యవసానమే.బానిసత్వాన్ని పారదోలామని చెప్పుకుంటున్నా ఆచరణలో అడుగడుగునా నల్లజాతీయులను హీనంగా చూస్తున్న అమెరికా సమాజానికి అదొక షాక్ ట్రీట్మెంట్. ‘బండరాతిని హత్య చేశాను. కొండను గాయపరిచాను. ఔషధానికే రోగం తెప్పించాను...’ అంటూ ఒక మ్యాచ్ గురించి చెప్పినట్టుగానే ఎంతో బలిష్టమైన రాజ్యవ్యవస్థను ఆయన ఒంటిచేత్తో ఎదుర్కొన్నాడు. దాని అధికార మదాన్ని తుత్తినియలు చేశాడు. వేల మైళ్ల దూరంలోని చిరు దేశం వియత్నాంపై అమెరికా బాంబుల వర్షం కురిపిస్తున్న వేళ సైన్యంలోకి రావాలని పిలుపొచ్చినప్పుడు దాన్ని తిరస్కరించడం ఒక్క అలీకే చెల్లింది. వియత్నాం పౌరులెవరూ ఏనాడూ తనను ‘నిగ్గర్’గా పిలవలేదని, అలా పిలిచే తెల్లదొరల కోసం వారిపై బాంబులెందుకు వేయాలని నిలదీశాడు. యుద్ధం సాగుతున్న సమయంలో దేశభక్తి ఉన్మాద స్థాయికి ముదురుతుందని తెలిసినా,... అది తన కెరీర్‌కు ముప్పు తేవచ్చునని, లక్షల డాలర్లు కోల్పోవాల్సి రావచ్చునని అర్ధమైనా... తిరస్కరించడం శిక్షార్హమైన నేరమవుతుందని రూఢీ అయినా అతడు వెరవలేదు. ‘ఏం చేసుకుంటారో చేసుకోండ’న్నాడు. తన తపనంతా బాక్సింగ్ క్రీడలో అమెరికాను శిఖరాగ్రాన నిలబెట్టడమేనని ప్రకటించి ఉన్న అలీని రాజ్యం వేటకుక్కలా వెంటాడింది. ఆయనకు అప్పటికే వచ్చిన ప్రపంచ టైటిల్‌ను రద్దు చేయించింది. అంతటితో ఆగక బాక్సింగ్ లెసైన్స్నే ఎగరగొట్టింది. సైన్యంలో చేరడానికి తిరస్కరించిన నేరానికి జైలు శిక్ష కూడా పడింది. ఇదంతా దారుణం, దుర్మార్గమని ప్రకటించి న్యాయస్థానాల్లో అలుపెరగని పోరాటం చేసి ప్రభుత్వం మెడలు వంచాడు. సుప్రీంకోర్టు 8-0 మెజారిటీ తీర్పుతో మొహమ్మద్ అలీపై తీసుకున్న చర్యలన్నీ చెల్లవని ప్రకటించింది. ఈ క్రమంలో మూడేళ్లపాటు సరైన ప్రాక్టీస్ లేకపోయినా పడి లేచిన తరంగంలా రింగ్‌లో మళ్లీ విజృంభించి తనకెదురులేదని నిరూపించుకున్నాడు అలీ. తన కెరీర్లో ఎదుర్కొన్న 29,000 పంచ్‌ల పర్యవసానంగా సంప్రాప్తించిన పార్కిన్సన్ వ్యాధితో అలుపెరగని పోరాటం చేస్తూనే సమకాలీన సమాజంలోని దురన్యాయాలను నిలదీశాడు. దేశం నుంచి ముస్లింలను వెళ్లగొట్టాలన్న అమెరికా అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ వ్యాఖ్యలను ఖండించాడు. ఇస్లాం మౌలిక సూత్రాలకు భిన్నంగా ప్రవర్తిస్తూ మతానికి చెడ్డపేరు తెస్తున్న ఉగ్రవాద ధోరణులపై అందరూ పోరాడాలని పిలుపునిచ్చాడు. చరిత్ర పుటలు తిరగేస్తే ప్రపంచ దేశాల్లో ప్రజల పక్షాన దృఢంగా నిలబడిన, అన్యాయాన్ని ప్రశ్నించిన, పోరాడిన మేధావులు, రచయితలు, కళాకారులు 60, 70 దశకాల్లో ఎక్కువగా తారసపడతారు. మొహమ్మద్ అలీ ఆ కోవలోని వాడు. కాలం మారింది. ఇప్పుడా వారసత్వం క్రమేపీ కొడిగడుతోంది. కాస్త పేరొస్తే ఏదో ఉత్పత్తికి ప్రచారకర్తగా మారి లక్షలు గడించాలనుకునే సెలబ్రిటీల కాలమిది. అవసరాన్నిబట్టి అభిప్రాయాలను మార్చుకోవడం, వీలైతే దాచుకోవడం అల వాటైన కాలమిది. ఇలాంటి పాడుకాలంలో అలీ వంటి ఆదర్శప్రాయుల, ధీశాలుర తలబోతలు సమాజానికి ఎంతగానో తోడ్పడతాయి. -
బాక్సర్ అలీని పట్టించుకోని కొడుకు!
లాస్ ఏంజెల్స్: బాక్సింగ్ దిగ్గజం మహ్మద్ అలీని ప్రపంచ మొత్తం అభిమానించినా, అతని విలువేమిటో సొంత కొడుకు జూనియర్ అలీ గుర్తించలేకపోయాడు. దాదాపు రెండు సంవత్సరాలుగా తండ్రిగా దూరంగా ఉంటున్న జూనియర్ ఆలీ.. ఒకానొక సందర్భంలో తండ్రిపై తన అసహనాన్ని వెల్లగక్కాడు. తండ్రి సరిగా పట్టించుకోలేకపోవడం వల్లే తాను పేదరికంలో మగ్గాల్సి వస్తుందన్నాడు. రెండేళ్ల క్రితం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తాను తండ్రి గురించి ఆలోచించడం మానేశానని, ఆయనకు ఏం జరిగినా తనకు అనవసరమని గట్టిగా చెప్పేశాడు. ప్రస్తుతం చికాగాలో తల్లి తరపు తాతయ్య దగ్గర భార్యతో కలిసి జూనియర్ అలీ జీవిస్తున్నాడు. అతనికి భార్య షకీరా, పిల్లలు అమీరా(8), షకీరా(7)లు ఉన్నారు. కాగా, ఒక స్వచ్ఛంద సంస్థ అందించే సహకారంతోనే భార్యను తన ఇద్దరు పిల్లల్ని పోషించడం జూనియర్ అలీ దుర్భర పరిస్థితికి అద్దం పడుతోంది. మొహమ్మద్ అలీకి నలుగురు భార్యలు కాగా, మొత్తం తొమ్మిది మంది పిల్లలు. అందులో మొదటి భార్య కొడుకే జూనియర్ అలీ. సోన్జీ రాయ్, బెలిండా బాయ్డ్, వెరొనియా పోర్ష్లకు విడాకులు ఇచ్చిన తర్వాత 1986లో లోనీ విలియమ్స్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పటివరకు ఆమెతోనే కలిసి ఉంటున్నాడు. మూడోభార్య పిల్లలైన లైలా అలీ, హనా అలీతోనే తండ్రికి అనుబంధం ఎక్కువ. లైలా బాక్సర్‌గా సత్తా చాటగా... హనా రచయిత్రిగా పేరు తెచ్చుకుంది. అయితే లైలా, హనాలను తరచు జూనియర్ అలీ కలిసినా, తండ్రి గురించి మాత్రం కనీసం తెలుసుకునే ప్రయత్నంకూడా చేయకపోవడం బాధాకరమే. ప్రపంచానికి ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన మొహ్మద్ అలీ కుమారుడు ఒక అనామకుడిలా మిగిలిపోవడం విచారకరం. -
టీవీ చరిత్రలో భారీ ఈవెంట్.. అలీ అంతిమయాత్ర
లాస్ ఏంజిలెస్: బాక్సింగ్ గ్రేట్ మొహమ్మద్ అలీ అంతిమయాత్ర, అంత్యక్రియల దృశ్యాలను ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది వీక్షించనున్నారు. అలీ అభిమానుల కోసం ఆయన అంతిమయాత్ర దృశ్యాలను టీవీల్లో ప్రసారం చేయనున్నారు. టీవీ చరిత్రలో ఇదో అదిపెద్ద ఈవెంట్ అవుతుందని భావిస్తున్నారు. అలీ (74) శ్వాసకోసం సంబంధిత సమస్యతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భారత కాలమానం ప్రకారం శనివారం మరణించిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలను సొంతూరు కెంటకీలోని లూయిస్విల్లేలో నిర్వహించనున్నారు. పలువురు ప్రముఖులు అలీ అంతిమయాత్రలో పాల్గొని నివాళి అర్పించనున్నారు. 1960ల్లో బాక్సింగ్ ప్రపంచాన్ని శాసించిన అలీ మృతి పట్ల ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖులు, కోట్లాదిమంది అభిమానులు సంతాపం తెలియజేశారు. -
క్రికెటర్ చేతిపై బాక్సర్ అలీ టాటూ!
లండన్:మూడు దశాబ్దాలుగా పార్కిన్సన్ వ్యాధితో పోరాడి శనివారం శాశ్వత నిద్రలోకి జారుకున్న బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ కి అనేక మంది క్రీడాకారులు ఘనమైన నివాళులు అర్పించారు. అయితే ఇంగ్లండ్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ మాత్రం అలీకి నివాళిగా చేతిపై టాటూ వేయించుకుని తనకున్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నాడు. మొహ్మద్ అలీ బాక్సింగ్ రింగ్‌లో తలపడుతున్నట్లు ఉన్న ఫోటోను పీటర్సన్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. ఇదిలా ఉంచితే ఈ క్రీడాకారులిద్దరూ తమ తమ ప్రభుత్వ విధానాలను తప్పుబట్టి వార్తల్లో నిలిచినవారే. తన ఆచరించిన ధర్మ కోసం వియత్నాంపై అమెరికా యుద్ధం చేయడాన్ని అలీ వ్యతిరేకించాడు. ఇక ఇంగ్లండ్ క్రికెటర్ గా గుర్తింపు పొందిన కెవిన్ పీటర్సన్ దక్షిణాఫ్రికాలో జన్మించి ఇంగ్లండ్ క్రికెటర్ గా ఎదిగాడు. దక్షిణాఫ్రికాలో జాతి సంబంధిత పద్దతిలో క్రికెటర్లను ఎంపికచేయడాన్ని పీటర్సన్ తీవ్రంగా వ్యతిరేకించాడు. దీంతో అక్కడ నుంచి ఇంగ్లండ్‌కు వచ్చి క్రికెటర్ గా ప్రత్యేక గుర్తింపు పొందాడు. -
అలీతో సినిమా చేయాలనుకున్నాం: అమితాబ్
ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మొహ్మద్ అలీ మరణం పై బాలీవుడ్ ఇండస్ట్రీ స్పందించింది. పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఈ లెజెండరీ అథెలెట్ పై ప్రంశంసలు కురిపించగా మరికొంత మంది ఆయనతో ఉన్న అనుబందాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా నేషనల్ మీడియాతో మాట్లాడిన బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. 1979లో బిగ్ బీ మొహ్మద్ అలీని స్వయంగా కలిసినట్టుగా తెలిపారు. 'ప్రముఖ దర్శకుడు ప్రకాష్ మెహ్రాతో కలిసి లాస్ ఏంజిల్స్ లోని ఆయన ఇంటికి వెళ్లాం. అలీ చాలా సింపుల్ గా ఉన్నారు. నవ్వుతూ పలకరించారు' అని తెలిపారు. అంతేకాదు అప్పట్లో ప్రకాష్ మెహ్రా అమితాబ్, మొహ్మద్ అలీల కాంబినేషన్ లోసినిమా తెరకెక్కించాలని భావించారట. ఆ విషయం పై చర్చలు జరిపేందుకే అలీ ఇంటికి వెళ్లినట్టు తెలిపారు అమితాబ్. -
అలీ... ఫ్యామిలీ...
నివాళి ‘‘నాన్నా... నేనూ నీలాగే బాక్సర్‌ను అవుదామనుకుంటున్నా’’నని తన కూతురు అడిగిన క్షణాన ఆ తండ్రి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ‘ఛాతీపై దెబ్బలు తినేందుకు కాదు అమ్మాయిల శరీరం ఉన్నది...’ అంటూ ఇరవై ఏళ్లుగా ఆయన బాక్సింగ్‌లో ప్రమాదాల గురించి చెబుతూ వచ్చారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా తన సొంత కూతురే ఎదురుగా నిలబడి పంచ్‌లు కొట్టేందుకు సిద్ధం అంటోంది. తేరుకోవడానికి కాస్త ఆలస్యమైనా మనసు కష్టపెట్టడం ఇష్టం లేక ఒప్పుకున్నాడు. అయితే మొహమ్మద్ అలీ కూతురు లైలా అలీ తండ్రిని నిరాశకు గురి చేయలేదు. మహిళల బాక్సింగ్‌లో జగజ్జేతగా నిలిచి తండ్రి గర్వపడేలా చేసింది. 24 బౌట్లు ఆడితే 21 నాకౌట్లు సహా అన్నీ విజయాలే. అలీ సంతానంలో ఎక్కువగా పాపులర్ అయింది లైలానే. సాధారణంగా తండ్రి వారసత్వాన్ని కుమారులు కొనసాగించడం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం ఆడబిడ్డ తన తండ్రి గర్వపడేలా చేసింది. తొమ్మిది మంది పిల్లలు మొహమ్మద్ అలీకి నలుగురు భార్యలు. మొత్తం తొమ్మిది మంది పిల్లలు. సోన్జీ రాయ్, బెలిండా బాయ్డ్, వెరొనియా పోర్ష్లకు విడాకులు ఇచ్చిన తర్వాత 1986లో లోనీ విలియమ్స్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పటివరకు ఆమెతోనే కలిసి ఉంటున్నాడు. మూడోభార్య పిల్లలైన లైలా అలీ, హనా అలీతోనే తండ్రికి అనుబంధం ఎక్కువ. లైలా బాక్సర్‌గా సత్తా చాటగా... హనా రచయిత్రిగా పేరు తెచ్చుకుంది. తరచు తండ్రిని కలుస్తూ, అతని గురించి ట్వీట్లు చేస్తూ హనా మాత్రమే తండ్రిని ప్రస్తావిస్తూ వస్తోంది. అలీ మరణం అనంతరం మా నాన్న శిఖర సమానుడు. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్లిపోయాడు. నా జీవితంలో అత్యంత ప్రియమైన వ్యక్తి నీవు అంటూ హనా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో పోస్ట్ పెట్టింది. లైనా, హనా మాత్రమే గత జనవరిలో తండ్రి పుట్టిన రోజున కలిసి స్వయంగా శుభాకాంక్షలు తెలిపారు. మిగతా ఐదుగురు అమ్మాయిలు ఖలియా, రాషెదా, జమీయుల్లా, మియా, మరియం పెద్దగా ఎక్కడా కనిపించరు. వాస్తవానికి నాలుగో భార్య విలియమ్స్ వ్యవహార శైలి కారణంగానే వారంతా తమ తండ్రితో ఎక్కువగా కలవలేకపోయారని అలీ తమ్ముడు చెబుతుంటాడు. అయితే పార్కిన్సన్ బారిన పడిన తర్వాత అలీ ఈ మాత్రమైనా జీవితాన్ని కొనసాగించగలిగాలంటే ఆమె చలవే అని మరికొందరు అంటారు. అలీ, విలియమ్స్‌కు అసద్ అమీన్ అనే దత్త పుత్రుడు ఉన్నాడు. కొరగాని కొడుకు ప్రపంచం మొత్తం అభిమానించినా, నాన్న బాక్సింగ్ పంచ్ పవర్ విలువేమిటో, అందులో పదును ఏమిటో సొంత కొడుకు మాత్రం గుర్తించలేకపోయాడు. అలీ అసలు కొడుకు జూనియర్ అలీ మాత్రం గత రెండేళ్లుగా తండ్రికి దూరంగా ఉంటున్నాడు. నాన్న తనను సరిగా పట్టించుకోలేదని, ఫలితంగా సరైన దిశ లేకుండా పేదరికానికే పరిమితమయ్యానని అతను తన ఆక్రోశం వెళ్లగక్కాడు. రెండేళ్ల క్రితం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తాను తండ్రి గురించి ఆలోచించడం మానేశానని, ఆయనకు ఏం జరిగినా తనకు అనవసరమని గట్టిగా చెప్పేశాడు. బాక్సింగ్ దిగ్గజానికి వారసుడుగా ఉండాల్సిన కుమారుడు అనామకుడిగా మిగిలిపోయాడు. మరోవైపు అలీ ఇన్నేళ్ల పాపులర్ కెరీర్లో మరో ఇద్దరు మహిళలు కూడా తమను పెళ్లి చేసుకున్నాడని, తమతో సంబంధం కొనసాగించాడని ముందుకు రాగా, మరో ఇద్దరు తామూ అలీ సంతానమేనని ప్రకటించుకున్నా అవి నిర్ధారణ కాలేదు. - మొహమ్మద్ అబ్దుల్ హాదీ -
మహ్మద్ అలీ మృతిపట్ల మోదీ సంతాపం
హెరాత్: బాక్సింగ్ యోధుడు మహ్మద్ అలీ మృతిపట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అమెరికా ప్రొఫెషనల్ బాక్సింగ్ ప్లేయర్ అలీ మరణం తీరని లోటని ట్విట్టర్లో సంతాపం తెలిపారు. ఆదర్శప్రాయమైన క్రీడాకారుడిగా పేరు తెచ్చుకున్న అలీ ఆత్మకు శాంతి చేకూరాలని మోదీ తెలిపారు. సకల మానవాళికి అతని జీవితం స్ఫూర్తిగా నిలిచిందని మోదీ కొనియాడారు. ప్రస్తుతం ఐదు దేశాల పర్యటనలో భాగంగా అప్ఘాన్ లో ఉన్న మోదీ.. మహ్మద్ అలీ మృతివార్త తెలుసుకుని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన కెరీర్లో ఎందరో యోధులను మట్టికరిపించిన అలీ మృత్యువుతో పోరాడుతూ శనివారం ఉదయం తుది శ్వాస విడిచారు. శ్వాసకోస సంబంధిత సమస్యతో ఫినిక్స్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అలీ కన్నుమూశారు. -
బుడ్డోడి చేతిలో అలీ మట్టికరిచిన వేళ!
లెజండరీ బాక్సింగ్ దిగ్గజం మహమ్మద్ అలీ తిరిగిరాని లోకాలకు వెళ్లడం క్రీడా ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. 74 ఏళ్ల వయస్సులో తుదిశ్వాస వదిలిన ఆ అలుపులేని యోధుడికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు కన్నీటి నివాళులర్పిస్తున్నారు. ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదురొడ్డి ప్రపంచంలోనే అత్యుత్తమ బాక్సర్‌గా పేరు తెచ్చుకున్న మహమ్మద్ అలీ తన వ్యక్తిత్వంతో అభిమానుల మనస్సులనూ దోచుకున్నాడు. ఆయన అంటే పెద్దవారే కాదు పిల్లలు పడిచచ్చేవారు. అందుకు ఉదాహరణ ఈ వీడియో! అంతటి మహాయోధుడిని ఓ బుడ్డుడో బాక్సింగ్ రింగులో మట్టికరింపించాడు. బుడ్డోడి బాక్సింగ్ పంచులు తట్టుకోలేక అలీ చేతులెత్తేశాడు. దీంతో రిఫరీ వచ్చి ఆ చిన్నారి విజయం సాధించినట్టు ప్రకటించాడు. మూడుసార్లు ప్రపంచ హెవీవెయిట్ చాంపియన్‌గా నిలిచిన అలీ కోరి మరీ బుడ్డోడి చేతిలో పంచులు తింటుంటే చూసేవారంతా నవ్వుల్లో మునిగిపోయారు. ఓ మ్యాచ్ సందర్భంగా సరదా కోసం జరిగిన ఫైట్ ఇది.. మహమ్మద్ అలీకి పిల్లలపై ఉన్న ప్రేమను ఇది చాటుతోంది. -
'అలీ కోసం టైటిల్ గెలవాలనుకున్నా'
బీజింగ్: తనకు ఎంతో స్ఫూర్తిదాయకమైన బాక్సింగ్ యోధుడు మహ్మద్ అలీ కోసం ప్రొఫెషనల్ బాక్సింగ్ టైటిల్‌ను గెలుస్తానని చైనా బాక్సర్, రెండు సార్లు ఒలింపిక్ చాంపియన్ జో షిమింగ్ స్పష్టం చేశాడు. తాను ప్రొఫెషనల్ బౌట్లో గెలిచిన తరువాత మహ్మద్ అలీని కలవాలని ముందుగా అనుకున్నానని, అయితే విధి వక్రించడంతో తన కోరిక తీరకుండానే మహ్మద్ అలీ లోకాన్ని విడిచివెళ్లిపోయాడని ఆవేదన వ్యక్తం చేశాడు. మహ్మద్ అలీ కోసం టైటిల్ గెలుస్తానన్న తన ముందస్తు సంకల్ప ఏదైతే ఉందో, దానిని సాధించి ఆ యోధుడికి ఘనమైన నివాళి అర్పిస్తానని షిమింగ్ పేర్కొన్నాడు. ఈ మేరకు తన ట్విట్టర్ అకౌంట్లో మహ్మద్ అలీ మృతిపట్ల షిమింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. 'నా బాక్సింగ్ కెరీర్‌కు మహ్మద్ అలీనే ఆదర్శం. అతను సాధించిన విజయాలు నాలో స్ఫూర్తిని రగిలించాయి. అలీ కోసం ప్రొఫెషనల్ టైటిల్ గెలవాలనుకున్నా. అయితే అతను ఇక లేడు. మనల్ని విడిచి అనంతలోకాలకు వెళ్లిపోయిన అలీ అత్మకు శాంతి చేకూరాలని మాత్రమే కోరుగలను. అతని కోసం టైటిల్ గెలిచి ఘనమైన నివాళి అర్పించడమే నా ముందున్న లక్ష్యం' అని షిమింగ్ తెలిపాడు. తన కెరీర్లో ఎందరో యోధులను మట్టికరిపించిన అలీ మృత్యువుతో పోరాడుతూ శనివారం ఉదయం తుది శ్వాస విడిచారు. శ్వాసకోస సంబంధిత సమస్యతో ఫినిక్స్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అలీ కన్నుమూశారు. 20వ శతాబ్దంలో టాప్ స్పోర్ట్స్ మన్‌గా అలీ గుర్తింపు తెచ్చుకున్నారు. బాక్సింగ్ ప్రపంచాన్ని ఎదురులేకుండా ఏలారు. అభిమానులు 'ది గ్రేటెస్ట్'గా పిలుచుకునే అలీ 1981లో రిటైరయ్యారు. రికార్డు స్థాయిలో 56 విజయాలు, కేవలం ఐదు పరాజయాలతో కెరీర్ ముగించారు. మూడుసార్లు హెవీవెయిట్ టైటిల్‌ను మూడుసార్లు సాధించారు. అలీ నాలుగు వివాహాలు చేసుకున్నారు. మొత్తం తొమ్మిదిమంది సంతానం. అలీ కూతురు లైలా తండ్రి అడుగుజాడల్లో నడిచి బాక్సింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. 1942 జనవరి 17న కెంటకీలోని లూయిస్విల్లేలో అలీ జన్మించారు. 12 ఏళ్లకే బాక్సింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్న ఆయన 22 ఏళ్లకే ప్రపంచ హెవీ వెయిట్ బాక్సింగ్ చాంపియన్ అయ్యారు. 1960ల్లో ఆయన బాక్సింగ్ ప్రపంచాన్ని శాసించారు. కాగా వియత్నాంపై అమెరికా యుద్ధానికి నిరసనగా ఇస్లాం మతం స్వీకరించారు. అలీ మూడు దశాబ్దాలుగా పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్నారు. కెంటకీలోని లూయిస్విల్లేలో అలీ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
బాక్సింగ్ దిగ్గజం అలీ ఇకలేడు
-
బాక్సింగ్ గ్రేట్ ఇకలేడు
లాస్ ఏంజిలెస్: బాక్సింగ్ గ్రేట్ మహ్మద్ అలీ (74) ఇకలేరు. తన కెరీర్లో ఎందరో యోధులను మట్టికరిపించిన అలీ మృత్యువుతో పోరాడుతూ తుది శ్వాస విడిచారు. శ్వాసకోస సంబంధిత సమస్యతో ఫినిక్స్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం మరణించారు. అంతకు కొన్ని గంటల ముందు అలీ బతికే అవకాశాలు చాలా తక్కువని కుటుంబ సన్నిహితులు చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 20వ శతాబ్దంలో టాప్ స్పోర్ట్స్ మన్‌గా అలీ గుర్తింపు తెచ్చుకున్నారు. బాక్సింగ్ ప్రపంచాన్ని ఎదురులేకుండా ఏలారు. అభిమానులు 'ది గ్రేటెస్ట్'గా పిలుచుకునే అలీ 1981లో రిటైరయ్యారు. రికార్డు స్థాయిలో 56 విజయాలు, కేవలం ఐదు పరాజయాలతో కెరీర్ ముగించారు. మూడుసార్లు హెవీవెయిట్ టైటిల్‌ను మూడుసార్లు సాధించారు. అలీ నాలుగు వివాహాలు చేసుకున్నారు. మొత్తం తొమ్మిదిమంది సంతానం. అలీ కూతురు లైలా తండ్రి అడుగుజాడల్లో నడిచి బాక్సింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. 1942 జనవరి 17న కెంటకీలోని లూయిస్విల్లేలో అలీ జన్మించారు. 12 ఏళ్లకే బాక్సింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్న ఆయన 22 ఏళ్లకే ప్రపంచ హెవీ వెయిట్ బాక్సింగ్ చాంపియన్ అయ్యారు. 1960ల్లో ఆయన బాక్సింగ్ ప్రపంచాన్ని శాసించారు. కాగా వియత్నాంపై అమెరికా యుద్ధానికి నిరసనగా ఇస్లాం మతం స్వీకరించారు. అలీ మూడు దశాబ్దాలుగా పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్నారు. కెంటకీలోని లూయిస్విల్లేలో అలీ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. We lost the #GreatestOfAllTime #MohammedAli #RIP https://t.co/NHURd1f0GQ — Rana Daggubati (@RanaDaggubati) 4 June 2016 I pray for #MohammedAli .. a true hero , a true inspiration — Huma Qureshi (@humasqureshi) 4 June 2016 Rest in peace legend @MuhammadAli #FloatLikeAButterfly #StingLikeABee #GOAT — Abhishek Bachchan (@juniorbachchan) 4 June 2016 -
మృత్యువుతో బాక్సింగ్ గ్రేట్ పోరాటం
లాస్ ఏంజిలెస్: బాక్సింగ్ గ్రేట్ మహ్మద్ అలీ (74) మృత్యువుతో పోరాడుతున్నాడు. శ్వాసకోస సంబంధిత సమస్యతో ఏరిజోనా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అలీ పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు కుటుంబ సన్నిహితులు చెప్పారు. ఈ ప్రపంచ హెవీ వెయిట్ మాజీ చాంపియన్ జీవితం చరమాంకంలో ఉన్నట్టు తెలిపారు. అలీ బతికే అవకాశాలు తక్కువగా ఉన్నాయని కుటుంబ సన్నిహితులు చెప్పారు. మరికొన్ని గంటలు బతకడం కూడా కష్టమని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. 20వ శతాబ్దంలో టాప్ స్పోర్ట్స్ మెన్లో ఒకడిగా అలీ గుర్తింపు తెచ్చుకున్నాడు. బాక్సింగ్ ప్రపంచాన్ని ఎదురులేకుండా ఏలాడు. అభిమానులు 'ది గ్రేటెస్ట్'గా పిలుచుకునే అలీ 1981లో రిటైరయ్యాడు. రికార్డు స్థాయిలో 56 విజయాలు, కేవలం ఐదు పరాజయాలతో కెరీర్ ముగించాడు. మూడుసార్లు హెవీవెయిట్ టైటిల్‌ను మూడుసార్లు సాధించాడు. అలీ నాలుగు వివాహాలు చేసుకున్నాడు. మొత్తం తొమ్మిదిమంది సంతానం. అలీ కూతురు లైలా తండ్రి అడుగుజాడల్లో నడిచి బాక్సింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. -
ఆస్పత్రి పాలైన బాక్సింగ్ యోధుడు
ప్రపంచ హెవీవెయిట్ బాక్సింగ్ మాజీ ఛాంపియన్ మహ్మద్ అలీ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు శ్వాస సంబంధిత సమస్య వచ్చినట్లు కుటుంబ ప్రతినిధి బాబ్ గన్నెల్ తెలిపారు. 74 ఏళ్ల మహ్మద్ అలీ.. దాదాపు మూడు దశాబ్దాలుగా పార్కిన్సన్స్ వ్యాధితో బాదపడుతున్నారు. బయటి ప్రపంచానికి పెద్దగా తన ఉనికిని తెలియనివ్వడం లేదు. ఇటీవల ఏప్రిల్ నెలలో మహ్మద్ అలీ పార్కిన్సన్ సెంటర్ అనే సంస్థకు విరాళాల కోసం అరిజోనాలో జరిగిన సెలబ్రిటీ ఫైట్ నైట్‌లో మాత్రం పాల్గొన్నారు. కెరీర్లో అగ్రస్థానానికి ఎదిగిన మహ్మద్ అలీ.. బాక్సింగ్ రింగ్‌లో డాన్స్ చేస్తున్నట్లు కదులుతూ వేగంగా ముష్టిఘాతాలు కురిపించేవారు. సీతాకోకచిలుకలా ఎగిరి తేనెటీగ కుట్టినట్లు కొడతారని బాక్సింగ్ నిపుణులు చెబుతుంటారు. అరిజోనాలోని ఫోనిక్స్‌లో నివసించే అలీకి ఇటీవలి కాలంలో ఆరోగ్య సమస్యలు ఎక్కువయ్యాయి. 2014 డిసెంబర్లో ఆయనకు న్యుమోనియా రావడంతో ఆస్పత్రిలో చేర్చారు. తర్వాత ఆయనకు తీవ్రంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు వైద్యులు గుర్తించి, దానికి 2015 జనవరిలో చికిత్స చేయించారు. 1981లో రిటైర్ అయ్యే సమయానికి ఆయన విజయాల రికార్డు 56-5గా ఉంది. రిటైరైన మూడేళ్ల తర్వాత ఆయనకు పార్కిన్సన్స్ వ్యాధి బయటపడింది. మహ్మద్ అలీ అసలు పేరు కాసియస్ మార్సెల్లస్ క్లే జూనియర్. 1964లో ఇస్లాం మతం పుచ్చుకున్న తర్వాత పేరు మార్చుకున్నారు. -
ఐదు రూట్లు.. 83 కి.మీ.
మెట్రో రెండోదశ ప్రణాళికపై మంత్రి కేటీఆర్ ♦ వచ్చే ఏడాది ప్రథమార్థంలో తొలిదశ మార్గం ప్రారంభం ♦ ప్రారంభ ముహూర్తాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయిస్తారని వెల్లడి ♦ సుల్తాన్‌బజార్ మధ్య నుంచే మెట్రో వెళుతుందని స్పష్టీకరణ ♦ బాధితులకు మెరుగైన పరిహారం అందజేస్తామని హామీ ♦ మెట్రో స్టేషన్ల నుంచి సమీప కాలనీలకు మినీ ఎలక్ట్రికల్ బస్సులు ♦ మెట్టుగూడా-ఉప్పల్ మార్గంలో మెట్రోలో ప్రయాణించిన మంత్రులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మూడు కారిడార్లలో చేపడుతున్న 72 కి.మీ. మెట్రో తొలి దశతోపాటు సమీప భవిష్యత్‌లో మెట్రో రెండోదశ ప్రాజెక్టును ఐదు రూట్లలో 83 కి.మీ. మార్గంలో నిర్మించనున్నట్టు ఐటీ,పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు వెల్లడించారు. ఇందుకోసం సాధ్యాసాధ్యాలను పరిశీలించి ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. మెట్రో తొలిదశ ప్రారంభ ముహూర్తాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయిస్తారని.. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రారంభోత్సవం ఉండే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. నగరవాసులు మెట్రో రైళ్లలో ప్రయాణించేందుకు కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ నుంచి అనుమతులు రావాల్సి ఉందన్నారు. శుక్రవారం మెట్టుగూడా మెట్రో రైలుస్టేషన్ నుంచి ఉప్పల్ మెట్రో స్టేషన్ వరకు 8 కి.మీ. మార్గంలో నిర్వహించిన ట్రయల్న్‌ల్రో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావుతో కలసి కేసీఆర్ మెట్రో రైలులో ప్రయాణించారు. అనంతరం ఉప్పల్ మెట్రో డిపో లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మెట్రో ప్రాజెక్టులో ఆస్తుల సేకరణ, పలు మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3 వేల కోట్లు ఖర్చు చేస్తోందని కేటీఆర్ వెల్లడించారు. అసెంబ్లీ ముందు నుంచే మెట్రో.. అసెంబ్లీ వెనుకవైపు నుంచి మెట్రో మార్గం వెళితే చారిత్రక జూబ్లీహాల్ భవనం దెబ్బతింటున్నందునే ముందుగా నిర్ణయించిన ప్రకారం అసెంబ్లీ ముందు నుంచి మెట్రో మార్గాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. చారిత్రక సుల్తాన్‌బజార్ ప్రాంతంలో ఆరు ప్రత్యామ్నాయాలను పరిశీలించిన తర్వాత పాత మార్గాన్నే ఖరారు చేశామని, ఆస్తులు కోల్పోతున్న వ్యాపారులకు మెరుగైన పరిహారం అందజేస్తామని, ఈ ప్రాంతం హాకర్స్ హబ్‌గా మారనుందన్నారు. సుల్తాన్‌బజార్ ప్రధాన రహదారి మధ్య నుంచి 65 అడుగుల విస్తీర్ణంలో మాత్రమే స్థలాన్ని సేకరిస్తామన్నారు. పాతనగరానికి సైతం అనుకున్న గడువు ప్రకారం 2017 జూన్ నాటికి మెట్రో రైళ్లు పరుగులు తీస్తాయని స్పష్టం చేశారు. ఓల్డ్‌సిటీలో అలైన్మెంట్ మార్పులపై అధ్యయనం జరుగుతోందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలున్న నగర మెట్రో ప్రాజెక్టులో అవసరమైన మేర స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తారన్నారు. మెట్రో నిర్మాణ పనుల్లో 18 వేల మంది, హెచ్ఎంఆర్ సంస్థ తరఫున మరో 3 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. మన మెట్రోనే అత్యుత్తమం ప్రపంచవ్యాప్తంగా 16దేశాల్లో మెట్రో ప్రాజెక్టులను తాను చూశానని.. అయితే నగర మెట్రో ప్రాజెక్టు వాటన్నింటికంటే అత్యుత్తమంగా ఉందని కేటీఆర్ కితాబిచ్చారు. మెట్రోస్టేషన్ల నుంచి సమీప కాలనీలకు వెళ్లేందుకు మినీ ఎలక్ట్రికల్ బస్సులు నడపనున్నట్లు చెప్పారు. మెట్రో ప్రాజెక్టులో భాగంగా 100 సైకిల్ స్టేషన్లను ఏర్పాటు చేయడం ద్వారా పర్యావరణానికి హాని లేకుండా చేయాలని నిర్ణయించామన్నారు. ఈ ప్రాజెక్టుతో నగర బ్రాండ్ ఇమేజ్ బాగా పెరుగుతుందని హోంమంత్రి నాయిని చెప్పారు. మెట్రో రైలులో ఎలాంటి కుదుపులు లేకుండా సౌకర్యవంతంగా ప్రయాణించామని, పనులు శరవేగంగా సాగుతున్నాయని ఉపముఖ్యమంత్రి మహముద్ అలీ చెప్పారు. మెట్రో ప్రాజెక్టు ప్రజలకు బాగా ఉపయోగపడుతుందన్నారు. -
'ఈ నెల 12వ తేదీకి ఇఫ్తార్ విందు వాయిదా'
హైదరాబాద్: రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదల్చిన ఇఫ్తార్ విందును ఈనెల12 వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ సీఎం మహమద్ అలీ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ముందు ఖరారు చేసిన తేదీ ప్రకారం ఇఫ్తార్ విందును ఈనెల 8వ తేదీన ఇవ్వాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఇఫ్తార్ విందును వాయిదా వేస్తున్నట్లు మహమద్ అలీ పేర్కొన్నారు. మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఓర్వలేకే తమపై విమర్శలకు దిగుతుందన్నారు. -
తెలంగాణ చిత్ర పరిశ్రమకు ఉజ్వల భవిష్యత్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో చిత్ర పరిశ్రమకు ఉజ్వల భవిష్యత్ ఉందని, అందుకు ప్రభుత్వం పూర్తి సహాయ, సహకారాలు అందిస్తుందని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ స్పష్టం హామీ ఇచ్చారు. ఆజంపురాలో ఆదివారం నిర్వహించిన ‘ఇంకెన్నాళ్లు’ చిత్ర దర్శకుడు సయ్యద్ రఫీ సన్మాన సభకు ముఖ్యవక్తగా ఆయన విచ్చేసి ప్రసంగించారు. దర్శకుడు సయ్యద్ రఫీ ఎవరూ చేయలేని విధంగా పదహారు విభాగాల్లో పనిచేసి ఉత్తమ ప్రతిభ కనబరిచి ప్రపంచ ఖ్యాతినందుకున్నారని అన్నారు. రఫీ నిర్మించే సినిమాల రూపకల్పనలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా అందుకు ముందుంటామని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, పలువురు సినీరంగ ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఆదివారాల్లోనూ రిజిస్ట్రేషన్
* డిమాండ్ ఉన్న చోట కార్యాలయాలు తెరచి ఉంచుతాం * రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు ఆలోచనలేదు: మహమూద్ అలీ సాక్షి, హైదరాబాద్: ఆదివారాల్లోనూ రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. భూమి రిజిస్ట్రేషన్ల డిమాండ్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలను తెరచి ఉంచాలని భావిస్తోంది. రంగారెడ్డి, హైదరాబాద్ సహా మరికొన్ని పట్టణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలను ఆదివారాల్లోనూ తెరచి ఉంచేందుకు కసరత్తు చేస్తున్నామని డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి మహమూద్ అలీ తెలిపారు. గురువారం సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని 4,300 పోస్టాఫీసుల్లో రిజిస్ట్రేషన్ స్టాంపులను అందుబాటులో ఉంచుతామని చెప్పారు. రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచే ఆలోచన లేదని మంత్రి స్పష్టం చేశారు. రెండు షిప్టుల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పనిచేసే విధానం ప్రవేశపెట్టాలని భావిస్తున్నామని, క్రమబద్ధీకరణ గడువును అవసరాన్ని బట్టి పొడిగిస్తామని తెలిపారు. నిజాంపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదన్నారు. -
ఆసుపత్రిలో చేరిన మహ్మద్ అలీ
లూయిస్విల్లే (కెంటకీ): న్యూమోనియా కారణంగా బాక్సింగ్ దిగ్గజం మహ్మద్ అలీ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని బాక్సర్ అధికార ప్రతినిధి బాబ్ గునెల్ తెలిపారు. ఇప్పటికే పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న 72 ఏళ్ల అలీకి డాక్టర్ల బృందం చికిత్స అందిస్తోందన్నారు. ‘శనివారం ఉదయం అలీ ఆసుపత్రిలో చేరారు. స్వల్ప స్థాయిలో న్యూమోనియా సోకినట్లు పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు’ అని గునెల్ పేర్కొన్నారు. అయితే అలీ కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు బాక్సర్‌కు చికిత్స అందిస్తున్న ఆసుపత్రి వివరాలను వెల్లడించలేదు. లూయిస్విల్లేలో సెప్టెంబర్‌లో జరిగిన ‘మహ్మద్ అలీ హుమానిటేరియన్’ అవార్డుల కార్యక్రమంలో చివరిసారి కనిపించిన బాక్సర్... ఆ తర్వాత బయట ఎక్కడా కనిపించలేదు. అప్పట్లో అలీ ఈ కార్యక్రమానికి హాజరైనా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. 1981లో బాక్సింగ్ కెరీర్‌కు వీడ్కోలు చెప్పిన అలీ... 2005లో అప్పటి అధ్యక్షుడు జార్జి బుష్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక ‘ప్రెసిడెన్షియల్ మెడల్’ను స్వీకరించారు. -
ప్రముఖ బాక్సర్ మహ్మద్ అలీకి అస్వస్థత
లూయీస్ విల్లే (అమెరికా): ప్రముఖ బాక్సర్, మూడు సార్లు హెవీవెయిట్ బాక్సింగ్ చాంపియన్ మహ్మద్ అలీ అస్వస్థతకు గురయ్యాడు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న అలీని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం మహ్మద్ అలీ పరిస్థితి నిలకడగా ఉందని అలీ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. ఊపిరితిత్తుల సమస్య అధికం కావడంతో ఈ రోజు ఉదయం ఆస్పత్రిలో చేర్చామన్నాడు. త్వరలో అలీ కోలుకుని తొందర్లోనే ఇంటికి వస్తాడని తెలిపాడు. అయితే అలీ కుటుంబ సభ్యుల కోరిక మేరకు మిగతా వివరాలను వెల్లడించడాని కి మాత్రం నిరాకరించాడు. గత కొంతకాలంగా అలీ అవయవాల వణుకు సంబంధిత రోగంతో కూడా బాధపడుతున్న సంగతి తెలిసిందే. -
‘బాక్సింగ్ గ్రేట్’ మహ్మద్ అలీ పరిస్థితి విషమం!
న్యూఢిల్లీ: చాలా కాలంగా పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న ప్రపంచ ‘బాక్సింగ్ దిగ్గజం’ మహ్మద్ అలీ పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రమైన అనారోగ్యంతో రోజులు లెక్కబెడుతున్నాడని బాక్సర్ కుటుంబ సన్నిహిత వర్గాలు తెలిపాయి. గత వారం తన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘ఐయామ్ అలీ’ అనే హాలీవుడ్ కొత్త చిత్రం ప్రీమియర్‌కు 72 ఏళ్ల అలీ హాజరు కాకపోవడంతో బాక్సర్ ఆరోగ్యంపై ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే తన తండ్రి కచ్చితంగా కోలుకుని సంపూర్ణంగా జీవిస్తాడని కూతురు హన్నా ఆశాభావం వ్యక్తం చేసింది. అలీకి పార్కిన్సన్ వ్యాధి సోకినట్లు 42 ఏళ్ల వయసులో (1984) గుర్తించారు. బౌట్లలో తల మీద బలమైన పంచ్‌లు తగలడం ఈ వ్యాధికి కారణం కావొచ్చని తేల్చారు. -
జగ్గారెడ్డి.. చంద్రబాబు ఏజెంట్
సిద్దిపేట టౌన్: మెదక్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న జగ్గారెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏజెంట్, బీజేపీ మైనార్టీల వ్యతిరేకమని ఉప ముఖ్యమంత్రి మహ్మద్ అలీ ధ్వజమెత్తారు. సిద్దిపేట శివమ్స్ గార్డెన్లో ఆదివారం నియోజకవర్గ మైనార్టీల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన మహమూద్ మాట్లాడుతూ, దశాబ్దాల నుంచీ తెలంగాణలో ముస్లింలు అణచివేతకు గురయ్యారన్నారు. బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి కాంగ్రెస్ పాలకులకు చెంచాగిరి చేసిన పైరవీకారుడన్నారు. సిద్దిపేట నీళ్లు తాగితే గుండెల్లో ఉద్యమ స్ఫూర్తి రగులుతుందన్నారు. ఇందుకు కేసీఆర్, హరీష్‌రావులే నిదర్శనమన్నారు. ఇప్పుడు తెలంగాణలో మైనార్టీలు తలెత్తుకుని తిరిగే ఆత్మవిశ్వాసాన్ని అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న మైనార్టీ సంక్షేమ పథకాల పట్ల ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలు ఆసక్తి కనబరుస్తున్నాయన్నారు. బంగారు తెలంగాణలో మైనార్టీలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, టీడీపీ సంక్షేమ పథకాలు దళారులకు ఎక్కువగా చెందాయని, తమ ప్రభుత్వ ఫలాలు మాత్రం నేరుగా ప్రజలకు చేరుతాయన్నారు. ముస్లింలంటే నవాబులు కాదు: మంత్రి ఈటెల ముస్లింలంటే నవాబులు మాత్రమే కాదని, ఇరానీ హోటళ్లలో టేబుళ్లు తుడిచేవారు, పంక్చర్ దుకాణాల్లో పనిచేసేవారు, పొట్ట చేత పట్టుకొని గల్ఫ్ దేశాలకు పోయేవారు కూడా ముస్లింలలో ఉన్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. అట్టడుగున ఉన్న ముస్లింలను ఉన్నత స్థాయికి తీసుకురావడం తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అన్ని రంగాల్లో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఎంత మెజార్టీ వస్తే అంత బలం: మంత్రి హరీష్ మెదక్ పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఎంత మెజార్టీ వస్తే ప్రభుత్వానికి, పేద ప్రజల సంక్షేమ పథకాలకు అంత బలం చేకూరుతుందని మంత్రి హరీష్‌రావు అన్నారు. మైనార్టీలంతా టీఆర్ఎస్కు మద్దతు తెలిపి కేసీఆర్‌ను మరింత శక్తివంతున్ని చేయాలన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే మోరీలో పడ్డట్టే, బీజేపీకి ఓటేస్తే చంద్రబాబుకు మద్దతు పలికినట్లేనన్నారు. దేశంలో కేసీఆర్ పాలన మోడల్‌గా మారుతుందన్నారు. గత ప్రభుత్వాలు ముస్లింలను ఓటు బ్యాంక్‌గా వాడుకున్నాయని ఆరోపించారు. సమావేశంలో టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి, మైనార్టీ నేతలు ఖాదర్, మిస్కిన్, గౌస్మొహినొద్దీన్, అసీఫ్, వాజీద్, సర్వర్, షమీ, అలీం, ఆరీఫ్, సుల్తాన్, అబ్దుల్ రజాక్, తంజుముల్ ముసాజిత్ సంఘ్ సార థి ఎజాజ్ హఫీజ్, కరీంనగర్ టీఆర్ఎస్ నేతలు ముజాఫరొద్దీన్, అఫ్జల్, అక్బర్, టీఆర్ఎస్ మహిళ నాయకురాలు షకీరా మాట్లాడారు. టీఆర్ఎస్ నేతలు నరేంద్రనాథ్, రాజనర్సు పాల్గొన్నారు. -
లక్ష్యం: తన జీవితానికి తనే స్కిప్టు రాసుకున్నాడు
కొంతమందికి జీవితంలో ఒకటే లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యాన్ని చేరుకొనే వరకూ వారు విశ్రమించరు. ఎన్ని దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్నా వారు తమ లక్ష్యసాధన విషయంలో వెనక్కుతగ్గరు. అలా వెనక్కు తగ్గని వ్యక్తే... ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు, రచయిత, దర్శకుడు సిల్వెస్టర్ స్టాలోన్. అవి 1970ల నాటి రోజులు... వర్షంలో లాస్ఏంజెలెస్ నగరం మెరిసిపోతోంది. హాలీవుడ్‌కు వేదిక అయిన ఆ నగరానికి చాలా రోజుల తర్వాత వచ్చాడు ఆ యువకుడు. అతడి పేరు స్టాలోన్. చిన్న చిన్న తుంపర్లు పడుతున్న ఉదయం పూట రోడ్డుపై తన పెంపుడు కుక్కతో కలిసి నడుచుకొంటూ వెళుతున్న తనను పట్టించుకోని జనాలను చూస్తుంటే అతడికి నవ్వు ముంచుకొస్తోంది. తను ఎప్పటికైనా పెద్దస్టార్ను అవుతానని, అంతర్జాతీయ స్థాయిలో గొప్ప పేరు ప్రఖ్యాతులను సంపాదించుకొంటానని అతడికి తెలుసు. ఆ ఆత్మవిశ్వాసంలోంచి వచ్చినది ఆ నవ్వు. ఉన్న ఫలంగా అతడు హాలీవుడ్‌కి రావడానికి కారణం మహ్మద్ అలీ! అంతకు కొన్ని రోజుల క్రితమే అమెరికన్ బాక్సింగ్ చరిత్రలో కొత్త సూర్యుడిలా ఉదయించాడు మహ్మద్ అలీ. అండర్‌డాగ్‌గా బరిలోకి దిగి డిఫెండింగ్ ఛాంపియన్ అయిన వెపనర్ను ఓడించాడు అలీ. ఆ మ్యాచ్‌ను లైవ్‌లో చూసిన లక్షలాది మందిలో స్టాలోన్ ఒకడు. అందరూ అలీని చూసి అబ్బురపడుతుంటే, అతడి విజయం స్ఫూర్తిగా ఒక సినిమా స్క్రిప్ట్‌ను రెడీ చేశాడు స్టాలోన్. అది ప్రపంచ సినీ చరిత్రపై గొప్ప ప్రభావం చూపగల స్క్రిప్ట్ అని స్టాలోన్‌కు అవగాహన ఉంది. అందుకే ఆ సినిమాకు తనే దర్శకత్వం వహించాలి, తనే హీరోగా ఉండాలనేది అతడి ఉద్దేశం. ఒకే దెబ్బకు రెండు పిట్టలు. హాలీవుడ్లో తన పేరు వ కాబోయే హీరోగారి ఆలోచనలు ఇలా ఉంటే... అతడి స్టోరీ లైన్‌ను విన్న నిర్మాతలు మాత్రం పెదవి విరచసాగారు. ఒకటి కాదు రెండు కాదు.. అనేక ప్రొడక్షన్ హౌస్‌ల దగ్గరకు వెళ్లి కథను వినిపించిన ఎవ్వరూ మెచ్చలేదు. సినిమాగా రూపొందించడానికి పెట్టుబడి పెడతామని అనలేదు. అనాథలా పెరిగి, సొంత కష్టంతో సంపాదించుకొన్న సొమ్మంతా ఖర్చయిపోయింది. లాస్ఏంజెలెస్ వచ్చిన కొన్ని వారాల తర్వాత ఒక లిక్కర్ హౌస్ ముందు వచ్చి నిలబడ్డాడు. లోపలకు వె ళదామంటే డబ్బుల్లేవు. అటుగా వెళుతున్న ఒక సీనియర్ సిటిజన్ చూపు స్టాలోన్ దగ్గరున్న పెంపుడి కుక్కపై పడింది. ‘అమ్ముతావా?’ అని అడిగాడు! 50 డాలర్లు ఇస్తాననాన్నడు. అమెరికన్లకు పెట్ అంటే ఎంతో ప్రేమ. స్టాలోన్ కూడా మనస్తత్వం విషయంలో సగటు అమెరికన్. ఆ శునకాన్ని అమ్ముకోవడం అంటే అంతకన్నా పతనస్థితి లేదని భావించాడు. అయితే తను అదే స్థితిలో ఉన్నానని గ్రహించాడు. శునకాన్ని అమ్మేశాడు! మళ్లీ ప్రొడ క్షన్ హౌస్ చుట్టూ చక్కర్లు. ఈ సారి పరిస్థితి కొంచెం సానుకూలంగా కనిపించింది. మీరు రాసిన స్క్రిప్ట్ఇస్తే లక్ష డాలర్లు ఇస్తానని ఆఫర్ చేశాడు ఒక నిర్మాత! పెట్‌ను 50 డాలర్లకు అమ్ముకొన్న మనిషికి ఒక్కసారిగా లక్ష డాలర్ల ఆఫర్వస్తే... హాలీవుడ్‌కి రచయితగా పరిచయం చేస్తాను అని హామీ ఇస్తే... ఒక్కసారిగా ఎగిరి గంతేయాలి. అయితే స్టాలోన్ అలా చేయలేదు. తన స్క్రిప్ట్‌కు తనే హీరో, అది సినిమాగా రూపొందితే స్క్రీన్‌పై తనే కనపడాలి. ఇదే విషయాన్ని ఆ నిర్మాతకు చెప్పాడు! అతడు నవ్వుకొన్నాడు..! స్టాలోన్ కోరికను చూసి అలా వికటాట్ట హాసం చేసిన నిర్మాతల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. నాలుగు లక్షల డాలర్లు ఇస్తాం.. స్క్రిప్ట్మాకు అప్పజెప్పు అని కోరిన వాళ్లూ ఉన్నారు. అయినా స్టాలోన్ లొంగలేదు! తన స్క్రిప్ట్‌కు తనే హీరో. తినడానికి తిండిలేని దశలో కూడా లక్ష్యం విషయంలో అతడి మొండితనానికి మొదట ఆశ్చర్యపోయిన ఒక నిర్మాతకు తర్వాత ముచ్చటేసింది. నిన్నే హీరోగా పెడతాను. మరి ఇచ్చే డబ్బు నాలుగు లక్షల డాలర్లు కాదు పాతికవేల డాలర్లే అన్నాడు. ఆనందంగా ఆ ప్రతిపాదనకు ఓకే చెప్పి, అడ్వాన్స్ తీసుకొని రోడ్డు మీదకు వచ్చాడు. తన శునకాన్ని కొన్న సీనియర్ సిటిజన్ అడ్రస్ అతడి మనసులో ఉంది. స్టాలోన్‌కు ఆ పెట్‌పై ఉన్న ప్రేమను తన అవకాశంగా తీసుకొన్నాడు ఆ సీనియర్ సిటిజన్. ఫలితంగా 50 డాలర్లకు అమ్మిన కుక్కపిల్లను 15,000 డాలర్లు చెల్లించి దాన్ని వెనక్కు తెచ్చుకొన్నాడు స్టాలోన్. స్టాలోన్, ఆ కుక్కపిల్ల ఇద్దరూ అనందంగా బయటకు వచ్చారు. ఇద్దరూ కలిసి ఒక సినిమాలో కూడా కనిపించారు. ఆ సినిమానే ‘రాఖీ’. బాక్సర్ అలీ స్ఫూర్తితో సిల్వస్టర్ స్టాలోన్ తయారు చేసుకొని, హీరోగా తెరకెక్కించిన స్క్రిప్ట్. అంత వరకూ హాలీవుడ్ చరిత్రలోని ఎన్నో రికార్డులను తుడిచిపెట్టింది ఆ సినిమా. స్టాలోన్‌ను స్టార్‌ను చేసింది. ఉత్తమ చిత్రంగా అకాడమీ అవార్డును అందుకొంది. ఎంతకష్టంలోనైనా రాజీ పడక పోరాడితే ఫలితం ఉంటుందనడానికి స్టాలోన్ జీవితానికి మించిన ఉదాహరణ ఉండదేమో! - జీవన్ రెడ్డి.బి -
ఎప్పటికీ గ్రేట్!
సంక్షిప్తంగా... మహమ్మద్ అలీ మహమ్మద్ అలీ మనవాడిలా అనిపిస్తాడు. కానీ అమెరికన్. అలీ అలియాస్ కాస్సియెస్ మార్సెలస్ క్లే తన 22వ యేట 1964 ఫిబ్రవరిలో సోనీ లిస్టన్తో తలపడి ప్రపంచ బాక్సింగ్ యోధుడిగా టైటిల్ గెలిచిన ఏడాదే.. తన ఆధ్యాత్మిక గురువు ఇచ్చిన ‘మహమ్మద్ అలీ’ అనే టైటిల్‌నీ ఎంతో గర్వంగా ధరించాడు. బాక్సింగ్ టైటిల్ అతడిని జగదేకవీరుడిని చేస్తే, భక్తితో స్వీకరించిన ‘అలీ’ అన్న టైటిల్ అతడిని జగద్విదితం చేసింది. అయితే ఇస్లాం మతాన్ని స్వీకరించినందుకు క్రైస్తవ మూలాలు ఉన్న ఈ ‘త్రీ-టైమ్’ వరల్డ్ హెవీ వెయిట్ చాంపియన్... సంప్రదాయవాదుల ఆధ్యాత్మిక ముష్టి ఘాతాలను ఏళ్లపాటు ఎదుర్కొనవలసి వచ్చింది. నిజానికి వివక్ష అన్నది అతడితో పాటు దెయ్యపు నీడలా ఎదిగింది. పద్దెనిమిదేళ్ల వయసులో రోమ్ ఒలింపిక్స్‌లో పాల్గొని లైట్ హెవీ వెయిట్ చాంపియన్‌గా బంగారు పతకంతో సంతోషంగా తిరిగి వచ్చిన క్లే కి అమెరికాలో వివక్ష మాత్రమే స్వాగతం పలికింది. విజేతను ప్రశంసించాల్సింది పోయి, పట్టనట్టు ఉండిపోవడం అతడినేమీ కలచివేయలేదు కానీ, ఆ తర్వాత కొన్నాళ్లకు జరిగిన ఒక పరిణామం అతడికి విపరీతమైన ఆగ్రహాన్ని తెప్పించింది. క్లే హాజరైన ఓ విందు వేడుకలో అతడికి వడ్డించేందుకు అక్కడివారు నిరాకరించడంతో క్లే బయటికి వచ్చి ఎప్పుడూ తన వెంట ఉంచుకునే ఒలింపిక్ పతకాన్ని తీసి ఓహియో నదిలోకి విసిరికొట్టాడు. తనను గౌరవించని దేశంలో ఆ దేశం తరఫున సాధించిన పతకాన్ని గౌరవించడం తనకు అవమానకరం అని అతడు భావించాడు కనుకే అలా చేశాడు. అలీ దేవుడికి తప్ప మరెవరికీ కట్టుబడి లేడు. అదే ఆయన్ని అనేకసార్లు చిక్కుల్లో పడేసింది. వియత్నాం యుద్ధ సమయంలో యు.ఎస్. ఆర్మీ నుంచి అలీకి ‘కన్స్క్రిప్షన్’ నోటీసు వచ్చింది... వెంటనే వచ్చి యుద్ధంలో చేరమని. అలీ తిరస్కరించాడు. జాతి గర్వించే ఒక క్రీడాకారుడిగా కన్స్క్రిప్షన్ను తిరస్కరించే హక్కు అతడికి ఎలాగూ ఉంటుంది. అయితే తన మత నిబంధనలు ఏ విధమైన హింసనూ అనుమతించవన్న కారణం చూపి సైన్యంలో చేరడానికి అతడు నిరాకరించడంతో అమెరికా ఆగ్రహించింది. అతడికి పది వేల డాలర్ల జరిమానా, ఐదేళ్ల కారాగార శిక్ష విధించింది. తర్వాత అలీ తరఫున వచ్చిన అభ్యర్థనలను మన్నించి కారాగారవాసాన్ని రద్దు చేసినప్పటికీ అతడి బాక్సింగ్ టైటిల్‌ను వెనక్కు తీసేసుకుంది. బాక్సింగ్ లెసైన్స్నీ (తాత్కాలికంగా) లాగేసుకుంది. అలీ తన నలభయ్యవ యేట 1981లో బాక్సింగ్ నుంచి తప్పుకున్నారు. తర్వాత మూడేళ్లకు వైద్యులు అతడిలో పార్కిన్సన్ వ్యాధిని గుర్తించారు. బాక్సింగ్‌లో తలకు అయిన గాయాల కారణంగా వచ్చిన వ్యాధి అది. అలీ వైవాహిక జీవితం కూడా నాలుగు పెళ్లిళ్లతో నలతకు గురయినట్లే ఉంది. ఏడుగురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులకు తండ్రి అయిన అలీ ప్రస్తుతం యు.ఎస్. కెంటకీలో విశ్రాంత జీవితం గడుపుతున్నారు. 2012లో లండన్‌లో జరిగిన ఒలింపిక్ గేమ్స్‌కి క్రీడాజ్యోతిని చేత పట్టుకోవలసింది అలీనే అయినా అరోగ్య కారణాల వల్ల ఆయన జ్యోతి పక్కన కేవలం అలా కొద్దిసేపు నిలబడగలిగారు. గత నెల 22న అట్లాంటాలో జరిగిన ‘హెరిటేజ్ ఆక్షన్’ వేలంలో మహమ్మద్ అలీ 1964 ఫిబ్రవరి 25న తొలిసారి ఛాంపియన్షిప్ గెలిచినప్పటి గ్లవుజులు 8,36,500 డాలర్ల విలువను దక్కించుకున్నాయి. యాభై ఏళ్ల క్రితం ఆరోజున బాక్సింగ్‌లో గెలవగానే అలీ తన ఉద్వేగాన్ని ఏమాత్రం దాచుకునే ప్రయత్నం చేయకుండా ‘‘ఐయామ్ ది గ్రేటెస్ట్. ఐ షుక్ అప్ ది వరల్డ్’’ అని అరిచారు. ఆనాటి అలీ గ్లవుజులు ఇప్పుడు 5 కోట్ల 18 లక్షల రూపాయలను మించి పలకడం చూస్తే ఇవాళ్టికీ బాక్సింగ్‌లో ఆయనే గ్రేట్ అనిపించడంలో వింతేముంది?! -
మహ్మద్ అలీ గ్లౌవ్స్‌కు రూ.5 కోట్లు
న్యూయార్క్: సరిగ్గా ఐదు దశాబ్దాల క్రితం బాక్సింగ్ ప్రపంచంలో ఓ కొత్త చాంపియన్ ఉద్భవించాడు. డిఫెండింగ్ చాంప్ సన్నీ లిస్టన్‌ను 22 ఏళ్ల మహ్మద్ అలీ మట్టికరిపించి తొలిసారిగా ప్రపంచ హెవీ వెయిట్ చాంపియన్‌గా అవతరించాడు. ఆ చరిత్రాత్మక పోరులో అలీ వాడిన గ్లౌవ్స్‌కు శనివారం వేలం జరిగింది. ఇందులో వాటికి రికార్డు స్థాయిలో రూ.5 కోట్ల 19 లక్షల ధర పలికింది. అయితే వీటిని కొనుగోలు చేసిన వ్యక్తి వివరాలను నిర్వాహకులు వెల్లడించలేదు. -
ఆ నాణాలే అమూల్యం
ముంబై: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు అన్నింటికంటే ఇష్టమైన జ్ఞాపిక ఏమిటి... బ్రాడ్‌మన్ స్వయంగా ఇచ్చిన బ్యాటో, మొహమ్మద్ అలీ బాక్సింగ్ గ్లవ్స్‌లో కాదు. చిన్ననాడు తన ఆటను తీర్చి దిద్దే క్రమంలో గురువు అచ్రేకర్నుంచి గెలుచుకున్న రూపాయి నాణాలు! శివాజీ పార్క్‌లో ప్రాక్టీస్ చేసేటప్పుడు స్టంప్‌పై అచ్రేచర్ ఒక రూపాయి నాణం ఉంచడం... సచిన్‌ను అవుట్ చేస్తే ఆ బౌలర్‌కు, చేయలేకపోతే సచిన్‌కు ఆ నాణెం ఇవ్వడం అందరికీ తెలిసిన విషయాలే. ‘నా కోచ్‌నుంచి అందుకున్న ఆ నాణాలే నా దృష్టిలో అమూల్యమైన జ్ఞాపికలు. వాటికెంతో ప్రాధాన్యత ఉంది’ అని సచిన్ వ్యాఖ్యానించాడు. ప్రముఖులకు సంబంధించిన అరుదైన వస్తువులను ఆన్లైన్లో కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పిస్తున్న ‘కలెక్టబిలియా’ వెబ్‌సైట్‌ను సచిన్ మంగళవారం లాంఛనంగా ప్రారంభించాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ...తన దగ్గర ఉన్న అరుదైన వస్తువుల గురించి చెప్పాడు. బ్రాడ్‌మన్ సంతకం చేసి ఇచ్చిన బ్యాట్, ఫొటోతో పాటు మొహమ్మద్ అలీ ఆటోగ్రాఫ్‌తో కూడిన గ్లవ్స్ ఎంతో ప్రత్యేకమని వెల్లడించాడు. -
ద్విచక్ర వాహనాల దొంగ అరెస్టు
పట్నంబజారు (గుంటూరు), న్యూస్‌లైన్: ఇంటి ముందు నిలిపి ఉంచే ద్విచక్ర వాహనాలను అపహరించే దొంగను పాతగుంటూరు పోలీసులు మంగళవారం అరెస్టు చేసి మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు కేంద్రంగా చేసుకుని ఆర్టీసీ బస్టాండ్, ఆనందపేట, సుద్దపల్లిడొంక తదితర ప్రాంతాల్లో ద్వి చక్రవాహనాలను అపహరించాడు. పాతగుంటూరు ఎస్‌హెచ్‌వో సయ్యద్ ముస్తాఫా వెల్లడించిన వివరాల ప్రకారం.. వినుకొండకు చెందిన మహ్మద్ ఆలీ కొంతకాలం నుంచి పాతగుంటూరు పరిధిలోని ఆనందపేటలో నివాసం ఉంటున్నాడు. జులాయిగా తిరిగే ఆలీ తన వ్యవసనాల కోసం బైక్‌లను అపహరిస్తున్నాడు. రెండు నెలల పరిధిలో మూడు వాహనాలు చోరీకి గురవ్వడంతో ఎస్ఐ ఆర్వి శంకరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలో మాయాబజారులో రెండు రోజుల క్రితం ద్విచక్ర వాహనాన్ని విక్రయిస్తున్న ఆలీని అదుపులోకి తీసుకుని విచారించారు. చోరీకి పాల్పడినట్లు వెల్లడవడంతో అతని వద్ద నుంచి మూడు ద్వి చక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడ్ని మంగళవారం కోర్టుకు హాజరుపర్చారు. బైక్‌లను స్వాధీనం చేసుకున్న సిబ్బందిని ఎస్‌హెచ్‌వో ముస్తాఫా, ఎస్ఐ శంకర్రావులు అభినందించారు. స్టేషన్ సిబ్బంది కోటేశ్వరరావు, దుర్గప్రసాద్, వెంకటేశ్వరరావు ఉన్నారు.