
ఆ నాణాలే అమూల్యం
ముంబై: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు అన్నింటికంటే ఇష్టమైన జ్ఞాపిక ఏమిటి... బ్రాడ్‌మన్ స్వయంగా ఇచ్చిన బ్యాటో, మొహమ్మద్ అలీ బాక్సింగ్ గ్లవ్స్‌లో కాదు. చిన్ననాడు తన ఆటను తీర్చి దిద్దే క్రమంలో గురువు అచ్రేకర్‌నుంచి గెలుచుకున్న రూపాయి నాణాలు! శివాజీ పార్క్‌లో ప్రాక్టీస్ చేసేటప్పుడు స్టంప్‌పై అచ్రేచర్ ఒక రూపాయి నాణం ఉంచడం... సచిన్‌ను అవుట్ చేస్తే ఆ బౌలర్‌కు, చేయలేకపోతే సచిన్‌కు ఆ నాణెం ఇవ్వడం అందరికీ తెలిసిన విషయాలే. ‘నా కోచ్‌నుంచి అందుకున్న ఆ నాణాలే నా దృష్టిలో అమూల్యమైన జ్ఞాపికలు.
వాటికెంతో ప్రాధాన్యత ఉంది’ అని సచిన్ వ్యాఖ్యానించాడు. ప్రముఖులకు సంబంధించిన అరుదైన వస్తువులను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పిస్తున్న ‘కలెక్టబిలియా’ వెబ్‌సైట్‌ను సచిన్ మంగళవారం లాంఛనంగా ప్రారంభించాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ...తన దగ్గర ఉన్న అరుదైన వస్తువుల గురించి చెప్పాడు. బ్రాడ్‌మన్ సంతకం చేసి ఇచ్చిన బ్యాట్, ఫొటోతో పాటు మొహమ్మద్ అలీ ఆటోగ్రాఫ్‌తో కూడిన గ్లవ్స్ ఎంతో ప్రత్యేకమని వెల్లడించాడు.