
అలీతో సినిమా చేయాలనుకున్నాం: అమితాబ్
ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మొహ్మద్ అలీ మరణం పై బాలీవుడ్ ఇండస్ట్రీ స్పందించింది. పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఈ లెజెండరీ అథెలెట్ పై ప్రంశంసలు కురిపించగా మరికొంత మంది ఆయనతో ఉన్న అనుబందాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా నేషనల్ మీడియాతో మాట్లాడిన బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
1979లో బిగ్ బీ మొహ్మద్ అలీని స్వయంగా కలిసినట్టుగా తెలిపారు. 'ప్రముఖ దర్శకుడు ప్రకాష్ మెహ్రాతో కలిసి లాస్ ఏంజిల్స్ లోని ఆయన ఇంటికి వెళ్లాం. అలీ చాలా సింపుల్ గా ఉన్నారు. నవ్వుతూ పలకరించారు' అని తెలిపారు. అంతేకాదు అప్పట్లో ప్రకాష్ మెహ్రా అమితాబ్, మొహ్మద్ అలీల కాంబినేషన్ లోసినిమా తెరకెక్కించాలని భావించారట. ఆ విషయం పై చర్చలు జరిపేందుకే అలీ ఇంటికి వెళ్లినట్టు తెలిపారు అమితాబ్.