హైదరాబాద్: రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదల్చిన ఇఫ్తార్ విందును ఈనెల12 వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ సీఎం మహమద్ అలీ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ముందు ఖరారు చేసిన తేదీ ప్రకారం ఇఫ్తార్ విందును ఈనెల 8వ తేదీన ఇవ్వాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఇఫ్తార్ విందును వాయిదా వేస్తున్నట్లు మహమద్ అలీ పేర్కొన్నారు.
మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఓర్వలేకే తమపై విమర్శలకు దిగుతుందన్నారు.