
ఈ టైటిల్ ఆ దిగ్గజానికి అంకితం
న్యూఢిల్లీ: ప్రొఫెషనల్ బాక్సర్గా మారిన భారత బాక్సర్ విజేందర్ సింగ్ వరుస బౌట్లలో ప్రత్యర్థులను మట్టికరిస్తూ ముందుకు సాగుతున్నాడు. ప్రొఫెషనల్‌గా మారిన ఈ స్టార్ ఆటగాడు తన కెరీర్‌లోనే అతి పెద్ద విజయాన్ని సాధించాడు. శనివారం త్యాగరాజన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో కెర్రీ హోప్ (ఆస్ట్రేలియా)తో జరిగిన బౌట్‌లో విజయం సాధించి ‘డబ్ల్యూబీఓ ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్’ టైటిల్ సాధించిన విషయం తెలిసిందే. ఈ టైటిల్ ను గతనెల మూడో తేదీన కన్నుమూసిన బాక్సింగ్ లెజెండ్ మొహమ్మద్ అలీ కి అంకితమిస్తున్నట్లు విజేందర్ ప్రకటించాడు.
ఈ తాజా బౌట్‌లో 98-92, 98-92, 100-90 తేడాతో కెర్రీపై నెగ్గడంతో ప్రపంచ ప్రొఫెషనల్ ర్యాంకింగ్స్‌లో 15వ స్థానానికి చేరి మరిన్ని పెద్ద బౌట్‌లకు రంగం సిద్ధం చేసుకున్నాడు. మూడు రౌండ్ల వరకూ బౌట్ హోరాహోరీగా సాగింది. అయితే నాలుగో రౌండ్లో విజేందర్ విసిరిన రైట్ హుక్ ప్రత్యర్థి కెర్రీ హోప్ ఎడమ కన్నుపై బలంగా తాకింది. అక్కడి నుంచి విజేందర్ బౌట్ లో చురుగ్గా కదులుతూ, డిఫెన్స్ కు ప్రాధాన్యమిస్తూ ప్రత్యర్థిపై సంచలన విజయాన్ని నమోదుచేశాడు. కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, క్రికెటర్లు యువరాజ్, రైనా, సెహ్వాగ్, బాక్సర్ మేరీకామ్, నటి నేహా ధూపియా, ఇతర ప్రముఖులు ఈ బౌట్‌ను తిలకించారు.