గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం కృషి | jago banjara programme in maheswaram | Sakshi
Sakshi News home page

గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం కృషి

Published Wed, Jul 13 2016 2:00 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం కృషి - Sakshi

గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం కృషి

ఆర్థిక మంత్రి  ఈటల రాజేందర్ 
మహేశ్వరంలో ‘జాగో బంజారా’బహిరంగ సభ
హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ  

తండాలను పంచాయతీలుగా మారుస్తాం
గిరిజనుల సంక్షేమం కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోంది. తండాలకు రోడ్ల నిర్మాణం చేపట్టి ఆర్టీసీ బస్సులు నడుపుతాం. 500 జనాభా కలిగిన ప్రతి తండాను గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతాం. రూ.20 కోట్లతో బంజారాహిల్స్‌లో బంజారా భవన్  నిర్మిస్తాం. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు కోసం గిరిజనులు తీవ్రంగా పోరాడారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. 
- ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్

ఐదు జిల్లాలుగా రంగారెడ్డి, హైదరాబాద్
పరిపాలనా సౌలభ్యం కోసమే జిల్లాల పునర్విభజన. తెలంగాణ రాష్ర్టంలో కొత్తగా 14 లేదా 15 జిల్లాలు ఏర్పాటు కాబోతున్నారుు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు ఐదు జిల్లాలుగా ఏర్పడనున్నారుు. కొత్త జిల్లాల ఏర్పాటుతో అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది. ఈ ఏడాది 46 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రస్తుతమున్న 24 శాతం అటవీ విస్తీర్ణాన్ని మూడేళ్లలో 33 శాతానికి పెంచుతాం. 
- ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ  

మహేశ్వరం : గిరిజనుల సంక్షేమం కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తండాలకు రోడ్డు నిర్మాణం, ఆర్టీసీ బస్సు సౌకర్యాలతో పాటు కృష్ణా నీటిని అందిస్తామని తెలిపారు. జాగో బంజార సేవా సంఘం ఆధ్వర్యాన మహేశ్వరంలోని  పోతర్ల బాబయ్య ఫంక్షన్  హాల్లో మంగళవారం ‘జాగో బంజారా’ బహిరంగ సభను నిర్వహించారు. దీనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.   

 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం...
తెలంగాణలో గిరిజనులకు ఉన్న 6శాతం రిజర్వేషన్లను 12 శాతానికి పెంచుతామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఆజ్మీరా చందూలాల్ అన్నారు. గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం రూ.460 కోట్లు వెచ్చిందని తెలిపారు. ప్రతీ  మండల కేంద్రంలో బంజారా భవన్ , గిరిజన కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు. 10 శాతం డబుల్ బెడ్ రూం ఇళ్లను తండావాసులకు ఇస్తామని స్పష్టంచేశారు.  

 పంచాయతీలుగా గుర్తిస్తాం...
500 జనాభా కలిగిన గిరిజన తండాలను పంచాయతీలుగా గుర్తిస్తామని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. గత ఎన్నికల్లో గిరిజనులకు ఇచ్చిన ప్రతీ హామీని సీఎం కేసీఆర్ నెరవేరుస్తారని చెప్పారు. బంజారాహిల్స్‌లో 20 కోట్లతో బంజారాభవన్  నిర్మిస్తున్నట్లు వివరించారు. ఎమ్మెల్యే తీగల, ఎమ్మెల్సీ రాములు నాయక్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు గిరిజనులను ఓటు బ్యాంకుగానే ఉపయోగించుకున్నాయని, వారి సంక్షేమాన్ని పట్టించుకోలేదని మండిపడ్డారు.

అర్హులైన గిరిజనులకు సంక్షేమ పథకాలు అందేలా చూస్తామన్నారు. ఈ సందర్భంగా గిరిజన కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నారుు.   సంఘం జాతీయ కార్యదర్శి దీప్‌లాల్ చౌహన్ , ఎంపీపీ పెంటమల్ల స్నేహ, జెడ్పీటీసీ సభ్యుడు నేనావత్ ఈశ్వర్ నాయక్, వైస్ ఎంపీపీ  స్వప్న, సర్పంచ్ ఆనందం, ఎంపీటీసీ సభ్యుడు బద్రు బుజ్జినాయక్, మాజీ ఎంపీపీ పాండు నాయక్, బంజారా సంఘం మండల అధ్యక్షుడు, అంగోత్ క్‌ృష్ణా నాయక్, ప్రధాన కార్యదర్శి మోతిలాల్ నాయక్, జిల్లా నాయకులు అంగోత్ రాజు నాయక్, దేవులనాయక్, లక్ష్మణ్, రాములు, పాండు, జాంప్లా నాయక్   గిరిజనులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement