
టీవీ చరిత్రలో భారీ ఈవెంట్.. అలీ అంతిమయాత్ర
లాస్ ఏంజిలెస్: బాక్సింగ్ గ్రేట్ మొహమ్మద్ అలీ అంతిమయాత్ర, అంత్యక్రియల దృశ్యాలను ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది వీక్షించనున్నారు. అలీ అభిమానుల కోసం ఆయన అంతిమయాత్ర దృశ్యాలను టీవీల్లో ప్రసారం చేయనున్నారు. టీవీ చరిత్రలో ఇదో అదిపెద్ద ఈవెంట్ అవుతుందని భావిస్తున్నారు.
అలీ (74) శ్వాసకోసం సంబంధిత సమస్యతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భారత కాలమానం ప్రకారం శనివారం మరణించిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలను సొంతూరు కెంటకీలోని లూయిస్విల్లేలో నిర్వహించనున్నారు. పలువురు ప్రముఖులు అలీ అంతిమయాత్రలో పాల్గొని నివాళి అర్పించనున్నారు. 1960ల్లో బాక్సింగ్ ప్రపంచాన్ని శాసించిన అలీ మృతి పట్ల ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖులు, కోట్లాదిమంది అభిమానులు సంతాపం తెలియజేశారు.