అలీ అంత్యక్రియలకు హాలీవుడ్ హీరో | Will Smith Will Serve as a Pallbearer at Muhammad Alis Funeral | Sakshi
Sakshi News home page

అలీ అంత్యక్రియలకు హాలీవుడ్ హీరో

Published Thu, Jun 9 2016 1:04 PM | Last Updated on Mon, Sep 4 2017 2:05 AM

అలీ అంత్యక్రియలకు హాలీవుడ్ హీరో

అలీ అంత్యక్రియలకు హాలీవుడ్ హీరో

ఇటీవల మరణించిన బాక్సింగ్ దిగ్గజం మహ్మద్ అలీ అంత్యక్రియలు, ఈ నెల 10న ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు క్రీడా, రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొనున్నారు. ఇప్పటికే హాలీవుడ్ యాక్షన్ హీరో విల్ స్మిత్ అలీ అంత్యక్రియలు హాజరవుతున్నట్టుగా ప్రకటించారు. అంతేకాదు ఆయన స్వయంగా అలీ భౌతిక దేహాన్ని తన భుజాలపై మోయనున్నారు.

సెలబ్రిటీలతో పాటు సామాన్య అభిమానులు కూడ ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వీలుగా 30 వేల పాసులు ఇస్తున్నారు. మహ్మద్ అలీ జీవిత కథ ఆదారంగా తెరకెక్కిన  అలీ సినిమాలో విల్ స్మిత్ టైటిల్ రోల్ లో నటించాడు. ఈ పాత్రకు గాను స్మిత్ ఆస్కార్ అవార్డుకి నామినేట్ అయ్యారు. అలీ మరణంతో తాను ఒ మంచి స్నేహితుణ్ని గురువును కొల్పోయానని తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు స్మిత్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement