చాలా విచిత్రమైన ఉద్యోగాలు గురించి విన్నాం. వాటి జీతభత్యాలు కూడా అంతే స్థాయిలో విచిత్రంగా ఉంటాయి. కానీ ఇలాంటి వెరైటీ జాబ్ రిక్రూట్‌మెంట్ చూసి ఉండరు. ఆ జాబ్ క్వాలిఫికేషన్ చూస్తే..వామ్మో ఇవేం అర్హత పరీక్షలని నోరెళ్లబెడతారు. ఏంటా ఉద్యోగం అంటే..
చైనాలో ఒక శ్మశానవాటికకి సంబంధించిన రుషన్ మునిసిపల్ బ్యూరో ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ సోషల్ సెక్యూరిటీ ఒక ఉద్యోగ ప్రకటన ఇచ్చింది. ఇది శ్మశానవాటికలోని మృతదేహాల నిర్వహణకు సంబంధించిన మేనేజర్ పోస్ట్. అందుకు సంబంధించిన క్యాలిఫికేషన్ గురించి చాలా వివరంగా పేర్కొంది.
శ్మశానంలో ఉద్యోగం ఏంటి అనుకోకండి. చైనా వంటి దేశాల్లో అంత్యక్రియల నిర్వహణకు సంబంధించిన సిబ్బంది, ఉన్నతాధికారులు ఉంటారు. అక్కడ మృతదేహాలను మార్చురీలో భద్రపరచడం లేదా దహన సంస్కారాలు చేయడం వంటి కార్యకలాపాలు ఉంటాయి. ఈ జాబ్‌లో పనిచేసే పురుషులకు కనీస వయసు 45 ఏళ్లు. అలాగే జూనియర్ సెకండరీ స్కూల్ విద్యను పూర్తి చేసి ఉండాలి. ఇక అందుకోసం రూ.850లు పరీక్ష రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఇంటర్వ్యూ వివరాలు వింటే..మాటలు రావు. సుమారు పది నిమిషాల పాటు గడ్డకట్టే శీతల శవాగారంలో గడపాల్సి ఉంటుందట.
ఈ పరీక్ష ఎందుకంటే ఇలాంటి చోట పనిచేస్తే వ్యక్తులో భయాన్ని, ఆందోళనల్ని నియంత్రణలో ఉంచుకోవాల్సి ఉంటుంది. అందుకోసమని ఈ అర్హత పరీక్ష అని సదరు అంత్యక్రియల డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. అలాగే అభ్యర్థి మానసిక పరిస్థితికి అనుగుణంగా ఇంటర్న్‌షిప్ వ్యవధి ఉంటుందని వెల్లడించింది. అంతేగాదు చైనాలో ఈ శ్మశానవాటిక సేవల మార్కెట్ 2015లో రూ.18 వేల కోట్ల ఉండగా, అది 2022 నాటికి రూ. 3 లక్షల కోట్లకు విస్తరించింది.
వాస్తవానికి సాధారణ సిబ్బంది కంటే ఈ శ్మశాన వాటికలో పనిచేసే వారి జీత భత్యాలే ఎక్కువగా ఉంటాయి. కానీ చైనా శ్మశాన వాటిక మేనేజర్ ఉద్యోగానికి ఇచ్చే వేతనం చాలా తక్కువ. ఈ పోస్ట్ గురించి నెట్టింట తెగ వైరల్ అయ్యింది. అక్కడ అలాంటి ప్రదేశంలో ఉద్యోగం చేసేందుకు ముందుకు రాకుండా చేసేది భయం కాదు ఇచ్చే వేతనమేనని నెటిజన్లు మండిపడుతూ పోస్ట్‌లు పెట్టారు. అందుకోసం పెట్టే పరీక్ష కూడా అమానుషమైనదని తింటిపోస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: డెంటిస్ట్ కాస్త ఐఏఎస్ అధికారిగా..! కానీ ఏడేళ్ల తర్వాత..)
Comments
Please login to add a commentAdd a comment