ప్రముఖ బాక్సర్, ఇటీవల కన్నుమూసిన మహ్మద్ అలీ అంత్యక్రియలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హాజరుకాలేకపోతున్నారు.
వాషింగ్టన్: ప్రముఖ బాక్సర్, ఇటీవల కన్నుమూసిన మహ్మద్ అలీ అంత్యక్రియలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హాజరుకాలేకపోతున్నారు. ఇదే రోజు కూతురు కాలేజీ పనులు ఉండటంతో ఆయన అలీ అంత్యక్రియలకు హాజరుకావడం లేదని అమెరికా వైట్ హౌస్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
వాషింగ్టన్లోని హైస్కూల్ గ్రాడ్యుయేషన్లో కూతురు మలియా చేరుతున్న కార్యక్రమం ఇదే రోజు కావడంతో ఒబామా అక్కడికి వెళుతున్నట్లు ఆ ప్రకటనలో వెల్లడించారు. అలీ సంతాప సందేశాన్ని ఒబామా తరుపున ఓ అధికారిక ప్రతినిధి చదవనున్నారు. కాగా, అలీ అంత్యక్రియలను 'అలీ ఫెస్టివల్' పేరిట ఆయన అభిమానులు జరపనున్నారు.