
ప్రముఖ బాక్సర్ మహ్మద్ అలీకి అస్వస్థత
లూయీస్ విల్లే (అమెరికా): ప్రముఖ బాక్సర్, మూడు సార్లు హెవీవెయిట్ బాక్సింగ్ చాంపియన్ మహ్మద్ అలీ అస్వస్థతకు గురయ్యాడు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న అలీని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం మహ్మద్ అలీ పరిస్థితి నిలకడగా ఉందని అలీ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. ఊపిరితిత్తుల సమస్య అధికం కావడంతో ఈ రోజు ఉదయం ఆస్పత్రిలో చేర్చామన్నాడు.
త్వరలో అలీ కోలుకుని తొందర్లోనే ఇంటికి వస్తాడని తెలిపాడు. అయితే అలీ కుటుంబ సభ్యుల కోరిక మేరకు మిగతా వివరాలను వెల్లడించడాని కి మాత్రం నిరాకరించాడు. గత కొంతకాలంగా అలీ అవయవాల వణుకు సంబంధిత రోగంతో కూడా బాధపడుతున్న సంగతి తెలిసిందే.