ద్విచక్ర వాహనాల దొంగ అరెస్టు
Published Wed, Oct 2 2013 1:08 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
పట్నంబజారు (గుంటూరు), న్యూస్‌లైన్: ఇంటి ముందు నిలిపి ఉంచే ద్విచక్ర వాహనాలను అపహరించే దొంగను పాతగుంటూరు పోలీసులు మంగళవారం అరెస్టు చేసి మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు కేంద్రంగా చేసుకుని ఆర్టీసీ బస్టాండ్, ఆనందపేట, సుద్దపల్లిడొంక తదితర ప్రాంతాల్లో ద్వి చక్రవాహనాలను అపహరించాడు. పాతగుంటూరు ఎస్‌హెచ్‌వో సయ్యద్ ముస్తాఫా వెల్లడించిన వివరాల ప్రకారం.. వినుకొండకు చెందిన మహ్మద్ ఆలీ కొంతకాలం నుంచి పాతగుంటూరు పరిధిలోని ఆనందపేటలో నివాసం ఉంటున్నాడు.
జులాయిగా తిరిగే ఆలీ తన వ్యవసనాల కోసం బైక్‌లను అపహరిస్తున్నాడు. రెండు నెలల పరిధిలో మూడు వాహనాలు చోరీకి గురవ్వడంతో ఎస్‌ఐ ఆర్‌వి శంకరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలో మాయాబజారులో రెండు రోజుల క్రితం ద్విచక్ర వాహనాన్ని విక్రయిస్తున్న ఆలీని అదుపులోకి తీసుకుని విచారించారు.
చోరీకి పాల్పడినట్లు వెల్లడవడంతో అతని వద్ద నుంచి మూడు ద్వి చక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడ్ని మంగళవారం కోర్టుకు హాజరుపర్చారు. బైక్‌లను స్వాధీనం చేసుకున్న సిబ్బందిని ఎస్‌హెచ్‌వో ముస్తాఫా, ఎస్‌ఐ శంకర్‌రావులు అభినందించారు. స్టేషన్ సిబ్బంది కోటేశ్వరరావు, దుర్గప్రసాద్, వెంకటేశ్వరరావు ఉన్నారు.
Advertisement
Advertisement