హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో చిత్ర పరిశ్రమకు ఉజ్వల భవిష్యత్ ఉందని, అందుకు ప్రభుత్వం పూర్తి సహాయ, సహకారాలు అందిస్తుందని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ స్పష్టం హామీ ఇచ్చారు. ఆజంపురాలో ఆదివారం నిర్వహించిన ‘ఇంకెన్నాళ్లు’ చిత్ర దర్శకుడు సయ్యద్ రఫీ సన్మాన సభకు ముఖ్యవక్తగా ఆయన విచ్చేసి ప్రసంగించారు. దర్శకుడు సయ్యద్ రఫీ ఎవరూ చేయలేని విధంగా పదహారు విభాగాల్లో పనిచేసి ఉత్తమ ప్రతిభ కనబరిచి ప్రపంచ ఖ్యాతినందుకున్నారని అన్నారు. రఫీ నిర్మించే సినిమాల రూపకల్పనలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా అందుకు ముందుంటామని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు, పలువురు సినీరంగ ప్రతినిధులు పాల్గొన్నారు.