విజేందర్ రెండో బౌట్ వాయిదా | Vijender Singh's Second Pro-Boxing Bout Postponed to November 7 | Sakshi
Sakshi News home page

విజేందర్ రెండో బౌట్ వాయిదా

Published Tue, Oct 27 2015 8:21 PM | Last Updated on Sun, Sep 3 2017 11:34 AM

విజేందర్ రెండో బౌట్ వాయిదా

విజేందర్ రెండో బౌట్ వాయిదా

లండన్: ప్రొఫెషనల్ బాక్సింగ్ లో భాగంగా భారత బాక్సర్ విజేందర్ సింగ్ పాల్గొనబోయే రెండో బౌట్ వాయిదా పడింది. ముందు నిర్ణయించిన తేదీ ప్రకారం అక్టోబర్ 30న బ్రిటన్‌కు చెందిన డీన్ జిలెన్‌ - విజేందర్ సింగ్ ల మధ్య బాక్సింగ్ పోరు జరగాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ బౌట్  నవంబర్ 7 వ తేదీకి వాయిదా వేశారు. ఈ విషయాన్ని  విజేందర్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించాడు.

అంతకుముందు జరిగిన బాక్సింగ్ పోరులో బ్రిటన్ బాక్సర్ సన్నీ వైటింగ్‌ పై వి జేందర్ టెక్నికల్ నాకౌట్ లో విజయం సాధించి మంచి ఉత్సాహంతో ఉన్నాడు.  ఆ ఫైట్ లో విజేందర్ తిరుగులేని గెలుపుని సొంతం చేసుకుని తాను ప్రొఫెషనల్ బాక్సర్ గా మారడం సరైందేనని నిరూపించాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement