
జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్ టోర్నమెంట్‌లో తెలంగాణ బాక్సర్ సావియో డొమినిక్ మైకేల్ క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన 54 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్లో సావియో 4–1తో కృష్ణ జొరా (జార్ఖండ్)పై గెలుపొంది ముందంజ వేశాడు. అయితే 75 కేజీల విభాగంలో బరిలోకి దిగిన మరో తెలంగాణ బాక్సర్ వేణు మండల ప్రయాణం ప్రిక్వార్టర్స్‌లోనే ముగిసింది. మహారాష్ట్ర బాక్సర్ నిఖిల్ దూబే చేతిలో వేణు ఓడిపోయాడు. ప్రత్యర్థి పంచ్‌కు వేణు కిందపడిపోగా రిఫరీ మ్యాచ్‌ను ఆపి దూబేను విజేతగా ప్రకటించాడు.
చదవండి: Leander Paes- Mahesh Bhupathi: విభేదాల్లోనూ విజయాలు!
Comments
Please login to add a commentAdd a comment