national boxing champion
-
సెమీ ఫైనల్లో నిఖత్ జరీన్
మహిళల జాతీయ బాక్సింగ్ (ఎలైట్) చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాక్సర్, వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. 50 కేజీల విభాగంలో క్వార్టర్ ఫైనల్ విభాగంలో నిఖత్ ‘ఆర్ఎస్సీ’ ద్వారా తనిష్క చావర్ (గోవా)ను చిత్తు చేసింది. నిఖత్ పంచ్‌ల ధాటికి తనిష్క తట్టుకోలేకపోవడంతో రిఫరీ బౌట్‌ను నిలిపివేసి ఆమెను విజేతగా ప్రకటించారు. సెమీస్‌లో శ్విందర్ కౌర్‌ను నిఖత్ ఎదుర్కొంటుంది. -
జాతీయ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌గా నిజామాబాద్ అమ్మాయి
సాక్షి, నిజామాబాద్: మహిళల సీనియర్ జాతీయ బెస్ట్ బాక్సర్ ఛాంపియన్షిప్ విజేతగా నిజామాబాద్‌కు చెందిన నిఖత్ జరీన్ నిలిచింది. హర్యానాలోని హిస్సార్‌లో ఈ నెల 21 నుంచి టోర్నమెంట్ నడుస్తోంది. బుధవారం టోర్నీ ఫైనల్ ముగిసింది. హర్యానాకు చెందిన మీనాక్షిని జరీన్ 4–1 తేడాతో ఓడించింది. మొదటి రౌండ్లో గోవాకు చెందిన దియా వాల్కేను నాకౌట్ చేసింది. క్వార్టర్ ఫైనల్లో ఒడిశాకు చెందిన సంధ్యారాణిని 5–0 తేడాతో ఓడించింది. సెమీఫైనల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన మంజును 5–0 తేడాతో ఓడించింది. ఫైనల్లో మీనాక్షిపై విజయం సాధించింది. వచ్చే డిసెంబర్ రెండోవారంలో టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరుగనున్న మహిళల బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్షిప్ టోర్నీకి జరీన్ ఎంపికైంది. 2014లో ఇస్తాంబుల్‌లో జరిగిన జూనియర్ బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్‌గా జరీన్ నిలిచింది. నిజామాబాద్‌కు చెందిన సమ్‌సమ్ జరీన్‌కు కోచ్‌గా ఉన్నారు. నిఖత్ జరీన్‌ను, ఆమె కోచ్ సమ్సమ్ను మాజీ 400, 800 మీటర్ల నేషనల్ మెడలిస్ట్ సయీద్ ఖైసర్ అభినందించారు. చదవండి: నీరజ్, మిథాలీకి ఖేల్‌రత్న.. ధవన్‌కు అర్జున అవార్డులు..! -
Mary Kom: ఎవ్వరికీ ఆ ఛాన్స్ లేదు.. కానీ ఆమెకు మాత్రం మినహాయింపు?!
Mary Kom And Lovlina Borgohain: హిస్సార్‌లో ఈనెల 21 నుంచి జరిగే జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనడం లేదని భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ తెలిపింది. జాతీయ చాంపియన్‌షిప్‌లో విజేతలుగా నిలిచిన వారిని మాత్రమే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టులోకి ఎంపిక చేస్తామని భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) ప్రకటించింది. అయితే మేరీకోమ్ పాల్గొనే 48–51 కేజీల విభాగానికి ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని బీఎఫ్ఐ భావిస్తోంది. కాగా 2012 లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత.. ఆరుసార్లు వరల్డ్ చాంపియన్ అయిన మేరీ కోమ్... ఇటీవలి టోక్యో ఒలిపింక్స్‌లో క్వార్టర్స్ చేరకుండానే రెండో రౌండ్లోనే తిరుగుముఖం పట్టిన విషయం తెలిసిందే. అయితే, మరో భారత మహిళా బాక్సర్ 23 ఏళ్ల లవ్లీనా బొర్గోహెయిన్.. కంచు పంచ్‌తో కాంస్యం సాధించి విశ్వవేదికపై సత్తా చాటింది. ఈ ప్రదర్శన ఆధారంగా ఆమె వరల్డ్ ఈవెంట్(69 కేజీల విభాగం)కు నేరుగా సెలక్ట్ అయింది. చదవండి: T20 WC: ఇంగ్లండ్‌పై కోహ్లి సేన విజయం; ఏయ్.. మైకేల్ ఆఫ్‌లైన్‌లో ఉన్నావ్ ఏంది?! -
National Boxing Championship: తెలంగాణ బాక్సర్‌కు రజతం
Telangana Boxer Hussamuddin: జాతీయ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ (57 కేజీలు) రజతం సాధించాడు. సర్వీసెస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హుసాముద్దీన్ ఫైనల్లో 0–5తో రోహిత్ మోర్ (ఢిల్లీ) చేతిలో ఓడిపోయాడు. దాంతో విజేతగా నిలిచిన రోహిత్ మోర్ సెర్బియా వేదికగా అక్టోబర్ 24 నుంచి నవంబర్ 6 వరకు జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్ భారత జట్టు తరఫున బరిలోకి దిగుతాడు. కాగా నిజామాబాద్ జిల్లాకు చెందిన హుసాముద్దీన్ తండ్రి శంషామొద్దీన్ శిక్షణలో రాటుదేలాడు. బాక్సింగ్‌లో గుర్తింపు తెచ్చుకోవడానికి నిరంతరం సాధన చేసిన అతడు.. తనదైన శైలిలో పంచులు విసురుతూ ప్రత్యర్థులను చిత్తు చేస్తూ అంతర్జాతీయ పోటీల్లోనూ రాణిస్తున్నాడు. డిగ్రీ వరకు నిజామాబాద్‌లోనే చదివిన హుసాముద్దీన్.. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుండగా ఆర్మీకి ఎంపికయ్యాడు. ఓ వైపు సైనికుడిగా దేశానికి సేవలు అందిస్తూ.. బాక్సింగ్‌లోనూ రాణిస్తున్నాడు. చదవండి: Pankaj Advani: వారెవ్వా పంకజ్.. పాక్ ఆటగాడిపై నెగ్గి.. 24వ టైటిల్ -
National Boxing Championships: క్వార్టర్స్‌లో తెలంగాణ బాక్సర్
జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్ టోర్నమెంట్లో తెలంగాణ బాక్సర్ సావియో డొమినిక్ మైకేల్ క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన 54 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్లో సావియో 4–1తో కృష్ణ జొరా (జార్ఖండ్)పై గెలుపొంది ముందంజ వేశాడు. అయితే 75 కేజీల విభాగంలో బరిలోకి దిగిన మరో తెలంగాణ బాక్సర్ వేణు మండల ప్రయాణం ప్రిక్వార్టర్స్‌లోనే ముగిసింది. మహారాష్ట్ర బాక్సర్ నిఖిల్ దూబే చేతిలో వేణు ఓడిపోయాడు. ప్రత్యర్థి పంచ్‌కు వేణు కిందపడిపోగా రిఫరీ మ్యాచ్‌ను ఆపి దూబేను విజేతగా ప్రకటించాడు. చదవండి: Leander Paes- Mahesh Bhupathi: విభేదాల్లోనూ విజయాలు! -
ఈ బాలుడి పంచ్ పడితే పసిడే!
రాజౌరి: జమ్ముకాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాకు చెందిన ఎనిమిదేళ్ల బాలుడు అబ్బు అమ్మాజ్ బాక్సింగ్‌లో అద్భుత ప్రతిభ కనబరిచాడు. రెండో తరగతి చదువుతున్న అబ్బు జాతీయ స్థాయిలో జరిగిన థాయ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని సాధించాడు. జాతీయ చాంపియన్‌గా నిలిచిన ఈ బాలుడిని రాజౌరి జిల్లా అధికారులు, నాయకులు, పోలీసులు సన్మానించారు. 'ఒలింపిక్స్‌లో పతకం సాధించడాన్ని అబ్బు లక్ష్యంగా పెట్టుకోవాలని ఆశిస్తున్నా. ఈ విజయం మా వాడ్ని సరైన దిశలో నడిపిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ కీర్తి ప్రతిష్టలు పెంచేందుకు దోహదం చేస్తుంది' అని అబ్బు తండ్రి అబ్బాస్ సద్వీఖీ అన్నారు. జాతీయ స్థాయిలో పోటీల్లో అబ్బు చాంపియన్‌గా నిలవడాన్ని స్థానికులు గర్విస్తున్నారు.