ఈ బాలుడి పంచ్ పడితే పసిడే! | 8 year old jammu kashmir boy becomes national boxing champion | Sakshi
Sakshi News home page

ఈ బాలుడి పంచ్ పడితే పసిడే!

Published Mon, Jan 9 2017 7:08 PM | Last Updated on Tue, Sep 5 2017 12:49 AM

ఈ బాలుడి పంచ్ పడితే పసిడే!

ఈ బాలుడి పంచ్ పడితే పసిడే!

రాజౌరి: జమ్ముకాశ్మీర్లోని రాజౌరి జిల్లాకు చెందిన ఎనిమిదేళ్ల బాలుడు అబ్బు అమ్మాజ్‌ బాక్సింగ్లో అద్భుత ప్రతిభ కనబరిచాడు. రెండో తరగతి చదువుతున్న అబ్బు జాతీయ స్థాయిలో జరిగిన థాయ్‌ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని సాధించాడు. జాతీయ చాంపియన్‌గా నిలిచిన ఈ బాలుడిని రాజౌరి జిల్లా అధికారులు, నాయకులు, పోలీసులు సన్మానించారు. 
 
'ఒలింపిక్స్లో పతకం సాధించడాన్ని అబ్బు లక్ష్యంగా పెట్టుకోవాలని ఆశిస్తున్నా. ఈ విజయం మా వాడ్ని సరైన దిశలో నడిపిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ కీర్తి ప్రతిష్టలు పెంచేందుకు దోహదం చేస్తుంది' అని అబ్బు తండ్రి అబ్బాస్ సద్వీఖీ అన్నారు. జాతీయ స్థాయిలో పోటీల్లో అబ్బు చాంపియన్‌గా నిలవడాన్ని స్థానికులు గర్విస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement