
Telangana Boxer Hussamuddin: జాతీయ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ (57 కేజీలు) రజతం సాధించాడు. సర్వీసెస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హుసాముద్దీన్ ఫైనల్లో 0–5తో రోహిత్ మోర్ (ఢిల్లీ) చేతిలో ఓడిపోయాడు. దాంతో విజేతగా నిలిచిన రోహిత్ మోర్ సెర్బియా వేదికగా అక్టోబర్ 24 నుంచి నవంబర్ 6 వరకు జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్ భారత జట్టు తరఫున బరిలోకి దిగుతాడు.
కాగా నిజామాబాద్ జిల్లాకు చెందిన హుసాముద్దీన్ తండ్రి శంషామొద్దీన్ శిక్షణలో రాటుదేలాడు. బాక్సింగ్‌లో గుర్తింపు తెచ్చుకోవడానికి నిరంతరం సాధన చేసిన అతడు.. తనదైన శైలిలో పంచులు విసురుతూ ప్రత్యర్థులను చిత్తు చేస్తూ అంతర్జాతీయ పోటీల్లోనూ రాణిస్తున్నాడు. డిగ్రీ వరకు నిజామాబాద్‌లోనే చదివిన హుసాముద్దీన్.. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుండగా ఆర్మీకి ఎంపికయ్యాడు. ఓ వైపు సైనికుడిగా దేశానికి సేవలు అందిస్తూ.. బాక్సింగ్‌లోనూ రాణిస్తున్నాడు.
చదవండి: Pankaj Advani: వారెవ్వా పంకజ్.. పాక్ ఆటగాడిపై నెగ్గి.. 24వ టైటిల్