
మహిళల జాతీయ బాక్సింగ్ (ఎలైట్) చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాక్సర్, వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. 50 కేజీల విభాగంలో క్వార్టర్ ఫైనల్ విభాగంలో నిఖత్ ‘ఆర్‌ఎస్‌సీ’ ద్వారా తనిష్క చావర్ (గోవా)ను చిత్తు చేసింది. నిఖత్ పంచ్‌ల ధాటికి తనిష్క తట్టుకోలేకపోవడంతో రిఫరీ బౌట్‌ను నిలిపివేసి ఆమెను విజేతగా ప్రకటించారు. సెమీస్‌లో శ్విందర్ కౌర్‌ను నిఖత్ ఎదుర్కొంటుంది.
Comments
Please login to add a commentAdd a comment