World Strongest Girl: Ivinka Savakas Chops Down Tree Dents Steel Door With Fists - Sakshi
Sakshi News home page

వరల్డ్‌ స్ట్రాంగెస్ట్‌ గర్ల్‌: దెబ్బ పడితే ఖతమే!

Published Mon, Jan 10 2022 9:57 AM | Last Updated on Mon, Jan 10 2022 11:07 AM

World Strongest Girl Chops Down Tree Dents Steel Door With Fists - Sakshi

12-year-old girl has been dubbed the 'world's strongest girl: కొంతమంది చిన్నారులు బాల్యం నుంచి మంచి ప్రతిభ కనబరుస్తారు. పైగా వేగవంతంగా నేర్చుకోవడమే కాక మంచి జ్ఞాపక శక్తి వారి సొంతం. అయితే ఇక్కడొక అమ్మాయి చాలా చిన్న వయసులోనే మంచి బాక్సర్‌గా రాణించడమే కాక ప్రపంచంలోనే బలమైన అమ్మాయిగా పేరు తెచ్చుకుంది.

అసలు విషయంలోకెళ్లితే...రష్యాకి చెందిన రుస్త్రమ్ సాద్వాకాస్‌ అనే బాక్సర్‌కి 12 ఏళ్ల ఇవింక సావకస్‌ అనే కుమార్తె ఉంది. ఆమె చిన్నతనం నుంచి తన తండ్రి రుస్త్రమ్‌ వద్దే బాక్సింగ్‌ శిక్షణ తీసుకుంది. అయితే ఆయన తన కుమార్తె ప్రతిభను నాలగేళ్ల ప్రాయంలోనే గుర్తించారు. పైగా ఇవింకా తన కంటే పెద్ద విద్యార్థులు తీసుకునే శిక్షణను తీసుకునేదని తెలిపారు. అంతేకాదు కేవలం ఒక్క నిమిషంలోనే సుమారు 100 పంచ్‌లు విసిరేదని చెప్పారు.

ఈ మేరకు ఆ బాలిక చెట్లను, ఐరన్‌ తలుపులను  తన పంచ్‌లతో చాలా సునాయాసంగా పడగొడుతుంది. దీంతో ఆ అమ్మాయి ప్రపంచంలోనే అత్యంత బలమైన బాలికగా పేరు సంపాదించుకుంది. అంతేకాదు తన బాక్సింగ్‌ ప్రావిణ్యంతో చెట్లను, ఐరన్‌ తలుపులను పడుగొడుతన్న వీడియోలను ట్విట్టర్‌లోనూ, ఇన్‌స్టాగ్రామ్‌లోనూ పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement