tree collapse
-
300 ఏళ్ల నాటి మహావృక్షం..హఠాత్తుగా..
కొన్ని వృక్షాలకు ఎంతో చరిత్ర, నేపథ్యం జ్ఞాపకాలు ముడివేసి ఉంటాయి. అవి కొన్ని గాథాలకు నిలువెత్తు సాక్ష్యంగా ఉంటాయి. అలాంటివి కనుమరుగైతే ఎవ్వరికైనా బాధగానే ఉంటుంది. అంతా నేపథ్యం కలిగిన వాటిని మనం ఏవిధంగానూ రీ క్రియేట్ చేయలేం. అలాంటి చారిత్రక నేపథ్యం ఉన్న ఈ చెట్టు హఠాత్తుగా కనుమరుగైపోయింది. యూకేలోని నార్తంబర్ ల్యాండ్‌లో ఈ ప్రసిద్ధ చెట్టు ఉంది. ఏమైందో ఏమో సెప్టెంబర్ 28న తెల్లవారుజామున ఎవరో నరికేశారు. ఏం బుద్ది పుట్టి ఇలా చేశారో గానీ ఒక్కసారిగా ఈ విషయం యూకే అంతటా దావానంలా వ్యాపించింది. ఈ విషయం తెలుసుకున్న యూకే అధికారులు 16 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత దర్వాప్తులో 60 ఏళ్ల వ్యక్తి ప్రమేయం ఉందని తేలడంతో అతడిని అరెస్టు చేశారు. ఈ ఘటన జరిగిన వెంటనే ఫోరెన్సిక్ అధికారులు ఆ చెట్టు అవశేషాలు, కొలతలు, నమునాలు తీసుకున్నారు. ఆ విచారణలో ఈ చెట్టు 300 ఏళ్ల నాటిదని తేలింది. ప్రకృతిలో చాలా సహజంగా పెరిగిందని చెబుతున్నారు అధికారులు. హాలివుడ్లో కెవిన్ కాస్ట్నర్, ప్రిన్స్ ఆప్ థీవ్స్ నటించిన 1991నాటి ప్రముఖ చిత్రం రాబిన్ హుడ్‌లో ఈ చెట్టు అందర్నీ ఆకర్షించింది. ఈ చెట్టు ఎంతోమంది కళాకారులకు, రచయితలకు, ఫోటోగ్రాఫర్లకు గొప్ప ప్రేరణ ఇచ్చిన మొక్కగా పేరుగాంచింది. ఈ చెట్టుతో చాలామందికి ఎన్నో గొప్ప జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ మేరకు వుడ్‌ల్యాండ్ ట్రస్ట్‌లోని ఎస్టేట్ మేనేజర్ మార్క్ ఫెదర్ మాట్లాడుతూ..మిగిలిన కాండం నుంచి ఒక చిన్న చెట్టుగా అభివృద్ధి చెందడానికి కొన్ని ఏళ్లు పడుతుంది. అంటే.. మనం కోల్పోయిన చెట్టులా అవ్వడానికి దాదాపు 150 నుంచి 200 ఏళ్లు పడుతుంది. ఈ చెట్టుని సైకామోర్ గ్యాప్ ట్రీ లేదా రాబిన్ హుడ్ ట్రీగా పిలుస్తారు. ఇది ఇంగ్లండ్‌లోని నార్తంబర్‌ల్యాండ్‌లోని క్రాగ్ లాఫ్ సమీపంలో హాడ్రియన్ వద్ద ఉంది. అంతేగాదు ఈ చెట్టు 2016 ఇంగ్లండ్ ట్రీ ఆఫ్ ది ఇయర్ అవార్డును సైతం గెలుచుకుంది. ఇది యూకే ఐకానిక్ చెట్టుగా కూడా ప్రసిద్ది. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లి..ఏకంగా రూ. 914 కోట్లు!ముఖేశ్అంబానీ కూతురు మాత్రం కాదు!) -
వరల్డ్ స్ట్రాంగెస్ట్ గర్ల్: దెబ్బ పడితే ఖతమే!
12-year-old girl has been dubbed the 'world's strongest girl: కొంతమంది చిన్నారులు బాల్యం నుంచి మంచి ప్రతిభ కనబరుస్తారు. పైగా వేగవంతంగా నేర్చుకోవడమే కాక మంచి జ్ఞాపక శక్తి వారి సొంతం. అయితే ఇక్కడొక అమ్మాయి చాలా చిన్న వయసులోనే మంచి బాక్సర్‌గా రాణించడమే కాక ప్రపంచంలోనే బలమైన అమ్మాయిగా పేరు తెచ్చుకుంది. అసలు విషయంలోకెళ్లితే...రష్యాకి చెందిన రుస్త్రమ్ సాద్వాకాస్ అనే బాక్సర్‌కి 12 ఏళ్ల ఇవింక సావకస్ అనే కుమార్తె ఉంది. ఆమె చిన్నతనం నుంచి తన తండ్రి రుస్త్రమ్ వద్దే బాక్సింగ్ శిక్షణ తీసుకుంది. అయితే ఆయన తన కుమార్తె ప్రతిభను నాలగేళ్ల ప్రాయంలోనే గుర్తించారు. పైగా ఇవింకా తన కంటే పెద్ద విద్యార్థులు తీసుకునే శిక్షణను తీసుకునేదని తెలిపారు. అంతేకాదు కేవలం ఒక్క నిమిషంలోనే సుమారు 100 పంచ్‌లు విసిరేదని చెప్పారు. ఈ మేరకు ఆ బాలిక చెట్లను, ఐరన్ తలుపులను తన పంచ్‌లతో చాలా సునాయాసంగా పడగొడుతుంది. దీంతో ఆ అమ్మాయి ప్రపంచంలోనే అత్యంత బలమైన బాలికగా పేరు సంపాదించుకుంది. అంతేకాదు తన బాక్సింగ్ ప్రావిణ్యంతో చెట్లను, ఐరన్ తలుపులను పడుగొడుతన్న వీడియోలను ట్విట్టర్లోనూ, ఇన్‌స్టాగ్రామ్‌లోనూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. Watch Little Evnika Saadvakass also known as the 'World's Strongest Girl' punching down a tree using her Amazing boxing skills. Shes has been training hard since she was three and dreams of becoming a professional boxer one day. pic.twitter.com/A4ERWjB57b — Quarantine Traders (@QuarantineTrad1) January 8, 2022 View this post on Instagram A post shared by SAADVAKASS Family (@saadvakass) -
ఈదురుగాలులకు నేలకొరిగిన చెట్లు
-
విరిగిపడిన చెట్టు: 40 మందికి గాయాలు
జి.మాడుగుల : విశాఖపట్టణం జిల్లా జి.మాడుగులలో పాఠశాల భవనంపై మంగళవారం మధ్యాహ్నం ఒక చెట్టు విరిగిపడింది. ఈ ఘటనలో సుమారు 40 మంది ఉపాధ్యాయులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని జి. మాడుగుల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భవనంలో ఉపాధ్యాయులందరూ సమావేశమై ఉన్నప్పుడు భవనం పక్కనున్న చెట్టు ఒక్కసారిగా భవనంపై కుప్పకూలింది. దాంతో సమావేశంలో పాల్గొన్న ఉపాధ్యాయుల్లో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. -
కూలిన భారీ వృక్షం..నలుగురికి గాయాలు
హైదారాబాద్: బంజారాహిల్స్‌లోని రోడ్డు నంబర్ 13లో ఓ భారీ వృక్షం నెలకొరిగింది. సోమవారం తెల్లవారుజామున స్థానిక ఎన్బీటీ నగర్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలు అయ్యాయి. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. చెట్టు కూలడంతో ఈ రహదారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అధికారులు విరిగిని చెట్టును తొలగించేందుకు చర్యలు చేపట్టారు. -
సచివాలయంలో సీఎం ఆఫీస్ వద్ద కూలిన భారీవక్షం