సచివాలయంలోని సమతా బ్లాక్ వద్ద ఉన్న భారీ వృక్షం శనివారం ఒక్కసారిగా కూకటివేళ్లతో కూలిపోయింది. ఈ సంఘటనలో మురళీకృష్ణ అనే కానిస్టేబుల్ గాయపడగా, ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి కాన్వాయ్ వాహనాలతో పాటు, చీఫ్ సెక్రటరీ మహంతి వాహనం పూర్తిగా ధ్వంసం అయ్యింది. గాయపడిన కానిస్టేబుల్ను చికిత్స నిమిత్తం గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. పెద్ద ప్రమాదం తప్పటంతో సచివాలయ ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు.