sachivalayam
-
‘సచివాలయ వ్యవస్థను చంద్రబాబు నిర్వీర్యం చేశారు’
తాడేపల్లి : గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి తెచ్చిన సచివాలయ వ్యవస్థను ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ినిర్వీర్యం చేశారని ఏపీ ఎన్జీవో ామాజీ అధ్యక్షుడు నలమూరు చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు. అదే సమయం వాలంటీర్లకు రూ. 10 వేలు ఇస్తామని కూడా మోసం చేసిన ఘనత చంద్రబాబుదేనని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు మోసంతో వాలంటీర్లు రోడ్డున పడ్డారని, సంపద సృష్టించటం అంటే ఉద్యోగుల నోళ్లు కొట్టడమేనా? అని ఆయన ప్రశ్నించారు.‘సంపద అంటే ఉద్యోగులకు రాయితీలు ఇస్తారేమె అనుకొని అందరూ నమ్మి ఓట్లు వేశారు.గెలిచిన తరువాత ఉద్యోగులతో అవసరం లేదనేట్టుగా వ్యవహరిస్తున్నారు. జీవో ఎంఎస్ నెంబర్ 1ని జనవరి 25న రిలీజ్ చేశారు.అందులో గ్రామ సచివాలయ వ్యవస్దలో పని చేస్తున్న లక్షా 27వేల 175 మందిలో లక్ష 15వేల వరకు సరిపోతారని చెప్పారు. మిగిలిన 15,490మంది సర్ ప్లస్ అని పేర్కొనడం దారుణం. సచివాలయాల్లో ఉద్యోగులను ఏ,బీ, సీ గ్రేడ్ లుగా విభజించటం ఏంటి?, ఇదంతా ఏదో దురుద్దేశంతో చేస్తున్నారనే అనుమానం కులుగుతోంది.ఎవ్వరితో మాట్లాడకుండా జీవోలు ఎలా ఇస్తారు?, ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తున్నాం.ఉద్యోగుల్లో గందరగోళం సృస్టిస్తున్నారు.ఇన్ని రోజులు ఉద్యోగులకు ఉన్న ఎక్స్ పీరియన్స్ పోతుంది.మాకడుపు కొడుతున్నారంటూ ఉద్యోగులంతా బాధ పడుతున్నారు.ఉద్యోగులను మోసం చేస్తే సర్ణాంధ్ర ఎలా అవుతుంది?,వెంటనే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టాలి’ అని నలమారు చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
నిరుద్యోగుల నోట్లో కూటమి సర్కారు మట్టి
-
ఇంటికి వస్తావా..రావా..? టీడీపీ కామాంధుడు
-
ఏపీ టెంపరరీ సచివాలయం తాకట్టు పెట్టారంటూ ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం
-
రాగోలు గ్రామంలో సచివాలయ ప్రారంభోత్సవం
-
ఉత్తమ ప్రతిభకు ఉజ్వల భవిత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గ్రామీణ క్రీడాకారుల్లోని సత్తాను వెలుగులోకి తెచ్చేలా ‘ఆడుదాం ఆంధ్ర’ వేదికను సిద్ధం చేస్తోంది. దేశంలోనే అతిపెద్ద ఈ మెగా టోర్నిలో టాలెంట్ హంట్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. 15,004 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో ఐదు క్రీడాంశాల్లో (క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ డబుల్స్) మహిళలు, పురుషుల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారిని ఎంపికచేసి వారి ప్రతిభకు పట్టం కట్టేలా ప్రణాళికలు రచిస్తోంది. గ్రామ/వార్డు సచివాలయాలు, మండలస్థాయి పోటీల అనంతరం 175 నియోజక వర్గాలు, 26 జిల్లాల స్థాయిలో జరిగే పోటీలను నిశితంగా పర్యవేక్షించనుంది. వీటిల్లో రాణించిన క్రీడాకారుల వివరాలతో ప్రత్యేక జాబితాను తయారు చేయనుంది. అత్యుత్తమ శిక్షణ దిశగా.. క్రీడాసంఘాల ప్రతినిధులతో పాటు ఫ్రాంచైజీల ప్రత్యేక బృందాలు ‘ఆడుదాం ఆంధ్ర’ నియోజకవర్గ, జిల్లా స్థాయి పోటీలను దగ్గరుండి పర్యవేక్షించనున్నాయి. మైదానంలో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నవారిని నేరుగా ఫ్రాంచైజీలే దత్తత తీసుకుని శిక్షణ ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఉదాహరణకు క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న యువతకు సీఎస్కే, ఇతర క్రికెట్ ఫ్రాంచైజీల్లో శిక్షణతో పాటు భవిష్యత్తు సీజన్లో జట్టులో ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కుతుంది. కబడ్డీ, వాలీబాల్‌లో రాణించిన వారిని కూడా పీకేఎల్, పీవీఎల్లకు ఆయా జట్లు ఎంపిక చేసుకోవచ్చు. బ్యాడ్మింటన్‌లో అయితే అంతర్జాతీయ క్రీడాకారులు నెలకొల్పిన అకాడమీల్లో ఉత్తమ తర్ఫీదు లభిస్తుంది. ఇక్కడ ప్రతిభ చూపిన క్రీడాకారులకు వారి స్థాయిలను బట్టి వివిధ మార్గాల్లో శిక్షణ లభిస్తుంది. తద్వారా వారి ప్రతిభ మరింత మెరుగుపడనుంది. ప్రముఖ క్రీడా ఫ్రాంచైజీలతో.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిభావంతులైన క్రీడాకారులున్నా.. ఇప్పటివరకు సరైన దిశలో నడిపించేవారులేక గ్రామాల్లోనే నిలిచిపోతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం ‘ఆడుదాం ఆంధ్ర’ ద్వారా వారందరినీ గుర్తించే మహాయజ్ఞాన్ని తలపెట్టింది. రాష్ట్రంలోని క్రీడాసంఘాలతో పాటు ప్రముఖ క్రీడా ఫ్రాంచైజీలను ఇందులో భాగస్వాములను చేస్తోంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌తో కలిసి క్రికెట్ టాలెంట్‌ను గుర్తించేందుకు ఇప్పటికే చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్కే) అంగీకారం తెలిపింది. ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీలతోనూ శాప్ అధికారులు సంప్రదింపులు చేస్తున్నారు. కబడ్డీలో తురుపుముక్కలను ఎంపికచేసే బాధ్యతను ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) తీసుకుంది. వాలీబాల్‌లో ప్రతిభను ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) సంస్థ ఒడిసిపట్టనుంది. అంతర్జాతీయ క్రీడాకారులతో పాటు ఖోఖో, బ్యాడ్మింటన్ అసోసియేషన్లు సహకారం అందించనున్నాయి. -
సచివాలయాలపై ఎల్లో ఏడుపులు..!
-
Fact Check: సచివాలయాలపైనా ఏడుపే..
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసే సంక్షేమ పథకాల కోసం లబ్దిదారులెవరూ గతంలో మాదిరిగా జన్మభూమి కమిటీల చుట్టూ చెప్పులరిగేలా తిరిగే అగత్యం లేకుండా జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గ్రామ సచివాలయాల వ్యవస్థను తీసుకొస్తే ‘ఈనాడు’ అస్సలు సహించలేకపోతోంది. ముఖ్యమంత్రి స్థానంలో చంద్రబాబు లేరన్న అసూయతో నిత్యం లేనిపోని అబద్ధాలతో ఆ పత్రికను నింపేస్తోంది. ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్న ఈ క్షుద్ర పత్రిక శనివారం ‘పంచాయతీలను కొల్లగొట్టి.. సచివాలయాలకు పంచిపెట్టి..’ అంటూ పెడబొబ్బలు పెడుతూ గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థపై చేతికొచ్చింది రాసిపారేసింది. నిజానికి.. సచివాలయాలకు నిధులివ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని వార్త రాయడంలో ఎలాంటి వాస్తవంలేదని, ఆ వార్త పూర్తిగా సత్యదూరమని ప్రభుత్వం స్పష్టంచేసింది. దేశంలో మరే రాష్ట్రంలోని లేని విధంగా అత్యుత్తమ సేవలందిస్తున్న ఈ గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరును చూసి ఓర్వలేక.. ఈనాడు ఎప్పటిలాగే తప్పుడు వార్తలకు తెగబడింది. ఈ నేపథ్యంలో.. ‘ఈనాడు’ కథనంపై రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలతో ఫ్యాక్ట్‌చెక్‌ను విడుదల చేసింది. ఆ వివరాలు.. నిధులివ్వకుండా నిర్లక్ష్యం ఒట్టిమాటే.. ♦ రాష్ట్ర ప్రభుత్వం 2019 అక్టోబరు 2 నుంచి 15,004 గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటుచేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీరు, పట్టణ ప్రాంతాల్లో ప్రతి 70–100 ఇళ్లకు ఒక వలంటీరు చొప్పున రెండున్నర లక్షలకు పైగా వలంటీర్లను నియమించింది. వీరిలో ఒక్కొక్కరికీ నెలకు రూ.5వేల చొప్పున పారితోíÙకం చెల్లిస్తోంది. అంతేకాదు.. ఎలాంటి అవినీతికిగానీ వివక్షకుగానీ తావులేకుండా ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడానికి ఈ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఒకటిన్నర లక్షల మందికి పైగా ఉద్యోగులను శాశ్వత ప్రాతిపదికన నియమించింది. ♦ కొత్తగా ఏర్పాటైన సచివాలయాలకు 30,004 కంప్యూటర్లు, 15,002 యూపీఎస్, 15,002 ప్రింటర్లు, 3,000 ఆధార్ కిట్లు, 2,86,646 ఫింగర్ ప్రింట్ స్కానర్లు పంపిణీ చేసింది. వలంటీర్లతోపాటు ఇతర సచివాలయ సిబ్బంది విధులను వేగంగా నిర్వహించేందుకు.. టెక్నాలజీని ఉపయోగించేందుకు 2,91,590 స్మార్ట్ఫోన్లు, సిమ్‌కార్డులను అందజేసింది. వీటన్నింటి కోసం ప్రభుత్వం తొలిదశలోనే రూ.486.71 కోట్లను వెచ్చించింది. వీటికి ఎక్కడ కూడా గ్రామపంచాయతీ నిధులను ఖర్చుపెట్టలేదు. ♦ మరోవైపు.. సచివాలయాల ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ప్రభుత్వం ఎప్పటికప్పుడు అదనంగా నిధులు విడుదల చేస్తోంది. ‘జగనన్న సురక్ష శిబిరం’ నిర్వహణ కోసమే రూ.25 కోట్లు.. అలాగే ‘ఆరోగ్య సురక్ష శిబిరం’ కోసం ఇంకొక రూ.22 కోట్లను విడుదల చేసింది. ఇదికాక, అదనంగా రూ.16 కోట్లను మంజూరు చేయగా వాటిని చెల్లించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కానీ, వీటన్నింటినీ పక్కనపెట్టి ‘ఈనాడు’ సచివాలయాలకు నిధులివ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని వండిన వార్తలో ఎలాంటి వాస్తవంలేదు. ♦ ఇక ఈ నాలుగేళ్లలో సచివాలయాల నిర్వహణకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఇప్పటివరకు రూ.228 కోట్లు వెచ్చించింది. ఈ నిధులతో ప్రింటర్లు, కంప్యూటర్లు, యుపీఎస్, ఫోన్లు, ఫింగర్ ప్రింట్ స్కానర్ల నిర్వహణను చూస్తోంది. వీటికి ఎక్కడా కూడా పంచాయతీ నిధులను ఖర్చుపెట్టలేదు. ూ అలాగే, అన్ని సచివాలయాలకు ఫైబర్‌నెట్ సంస్థ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యాన్ని ప్రభు త్వం కలి్పస్తోంది. ప్రింటర్ల వినియోగంలో వాడే ఇంక్ రీఫిల్స్, స్టేషనరీ సరి్టఫికెట్లు, లామినేషన్ కవర్లను సైతం గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ద్వారా ప్రభుత్వమే ఎప్పటికప్పుడు సరఫరా చేస్తోంది. ♦ రాష్ట్రంలోని వలంటీర్లతో పాటు ఇతర సచివాలయాల సిబ్బంది ఉపయోగించే ఫోన్ల నెలవారీ చార్జీలు కూడా ప్రభుత్వమే చెల్లిస్తోంది. వీటికి కూడా ఎక్కడా గ్రామ పంచాయతీ నిధులను ఖర్చుపెట్టలేదు. ♦ ఇవన్నీ కాక.. సచివాలయాల్లో ఇతర అదనపు ఖర్చుల కోసం గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఇప్పటిదాకా రూ.25 కోట్లను ఖర్చుపెట్టింది. ఇంకా ఏవైనా అవసరాలుంటే కలెక్టర్ల ద్వారా అభ్యర్థనలు పంపితే ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిశీలించి నిధులు విడుదల చేస్తోంది. వీటికీ పంచాయతీ నిధులను ఖర్చుపెట్టలేదు. ♦ గ్రామ సచివాలయాలు సమర్థవంతంగా పనిచేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. రాష్ట్రంలో 10,893 గ్రామ సచివాలయ భవనాలను మంజూరుచేయగా వాటిలో ఇప్పటికే 5,926 పూర్తయ్యాయి. వార్డు సచివాలయాల అద్దె చెల్లింపుల కోసం ప్రభుత్వం 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ.54,56,49,999 చెల్లిస్తే, 2023–24 సంవత్సరానికి రూ.25,30,21,000 చెల్లిస్తోంది. పంచాయతీ కార్యదర్శులపై ఒత్తిడి లేదు.. గ్రామ పంచాయతీ సాధారణ నిధులు, ఆర్థిక సంఘం నిధులను గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, నిర్వహణ కోసం ఆయా గ్రామ పంచాయతీల తీర్మానాల మేరకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఖర్చుచేస్తోంది. 15వ ఆర్థిక సంఘం నిధులుగానీ, గ్రామ పంచాయతీ సాధారణ నిధులుగానీ ఏ అవసరానికి ఎంతెంత శాతం ఖర్చుపెట్టాలన్న దానిపై ఖచ్చితమైన నిబంధనలున్నాయి. ఇందులో ఎక్కడా కూడా పంచాయతీ నిధులను సచివాలయాల కోసం కేటాయించలేదు. ♦ గ్రామ సచివాలయాల నిర్వహణకు ఆ శాఖ ప్రత్యేకంగా నిధులను విడుదల చేస్తోంది. పైగా వీటి నిర్వహణ ఖర్చుల నిమిత్తం అధికారుల నుంచి పంచాయతీ కార్యదర్శులపై ఎలాంటి ఒత్తిడి లేదు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అందుతున్న సేవలకు విశేషమైన స్పందన లభిస్తుండడంతో కేవలం ప్రభుత్వాన్ని అప్రతిష్టపాల్జేయడానికే ఈ తప్పుడు కథనాన్ని ఈనాడు ప్రచురించిందని ప్రభుత్వం పేర్కొంది. -
ఏడాదిలో రాష్ట్ర వ్యాప్తంగా భూ సర్వే పూర్తవుతుంది : ధర్మాన ప్రసాదరావు
-
సచివాలయాల్లోనూ ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు
సాక్షి, అమరావతి: చదువు పట్ల ఆసక్తి ఉండి.. బడికి వెళ్లి చదువుకోలేనివారి కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ల్లో చేరే అవకాశాన్ని అందిస్తోంది. అలాగే పరీక్ష ఫీజులను కూడా వీటిలోనే చెల్లించే ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే వారం నుంచే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఇక నుంచి ఎవరైనా.. ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు తమ పేర్లు నమోదు చేసుకోవడంతోపాటు వాటికి సంబంధించిన పరీక్ష ఫీజు చెల్లింపులు వంటి సేవలను తమ దగ్గరలో ఉండే గ్రామ, వార్డు సచివాలయాల్లోనే పొందొచ్చు. ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాల శాఖ, ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ)ల మధ్య ఇప్పటికే అవగాహన కుదిరింది. ఈ సేవల టెస్టింగ్ ప్రక్రియ కూడా పూర్తయిందని.. వచ్చే వారంలో రాష్ట్రంలో అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ సేవలు అధికారికంగా మొదలవుతాయని అధికారులు వెల్లడించారు. తప్పనున్న ఇబ్బందులు.. కాగా, ఓపెన్ స్కూల్ ద్వారా ప్రవేశాలు పొందాలంటే ఇప్పటివరకు అధికారిక వెబ్సైట్ మాత్రమే అందుబాటులో ఉంది. సొంతంగా ఇంటర్నెట్తో కూడిన కంప్యూటర్, వెబ్ వినియోగంలో అవగాహన ఉన్నవారు ఇంట్లో నుంచే ప్రవేశాలు పొందేవారు. నెట్ సదుపాయం, అవగాహన లేకపోతే తమ ప్రాంతంలో లేదంటే, సమీప çపట్టణంలో నెట్ సెంటర్లకు వెళ్లాల్సి వస్తోంది. ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ సేవలు ప్రవేశపెడుతుండటంతో ఈ ఇబ్బందులు తప్పనున్నాయి. మరోవైపు.. 14 ఏళ్ల లోపు బడి ఈడు పిల్లలు ఎవరైనా పాఠశాలలకు వెళ్లని పరిస్థితి ఉంటే.. అలాంటి వారందరినీ ఆయా ప్రాంత గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, వలంటీర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తోంది. వారందరినీ వంద శాతం బడుల్లో చేర్పించేలా ఇప్పటికే చర్యలు చేపట్టింది. అలాగే వివిధ కారణాలతో బడి వయసు ఉన్నవారు, బడులకు వెళ్లలేని వారితోపాటు 17 ఏళ్లు దాటిన వయోజనులు ఓపెన్ స్కూల్ విధానంలో పదో తరగతి, ఇంటర్ చదువుకునే అవకాశాన్ని సచివాలయాల ద్వారా అందిస్తోంది. ఏటా నవంబర్‌నెలాఖరు దాకా అడ్మిషన్లు.. ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్ ప్రవేశాల ప్రక్రియ ఏటా నవంబరు నెలాఖరు వరకు కొనసాగుతోందని ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి “సాక్షి’కి తెలిపారు. ప్రవేశాలకు పేర్ల నమోదు సెప్టెంబర్ 15 నుంచి నవంబర్ నెలాఖరు వరకు ఎక్కువగా చేసుకుంటారని వెల్లడించారు. ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్ చదివే వారి కోసం ఈ ఏడాది నుంచి అధికారిక వెబ్సైట్లో ఆయా తరగతుల ఆన్లైన్ పాఠాల బోధన వీడియోలను ఉంచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. సార్వత్రిక విద్య అంటే.. మన దేశంలో కనీసం ఇంటర్‌గా గుర్తించిన నేపథ్యంలో ప్రతి గ్రామ, వార్డు సచివాలయం పరిధిలో ఎంత మంది ఇంటర్‌లోపు చదువుకున్న వారు ఉన్నారో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఇంటర్‌లోపు చదివిన వారందరినీ ఓపెన్ స్కూల్ ద్వారానైనా చదువుకునేలా ప్రోత్సహించడానికి అవకాశం ఉంటుందన్నారు. -
సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. వీఆర్ఏ వ్యవస్థ శాశ్వతంగా రద్దు
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో వీఆర్ఏల క్రమబద్ధీకరణ, సర్దుబాటు, స్థిరీకరణ తదితర అంశాలపై సచివాలయంలో సీఎం కేసీఆర్ ఆదివారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలుగా పనిచేస్తున్న సిబ్బందిని రెవెన్యూ శాఖలో సూపర్ న్యూమరరీ పోస్టుల్లో క్రమబద్ధీకరించనున్నట్టు తెలిపారు. అంతేకాకుండా వీఆర్ఏ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ అంశంపై చర్చించిన అనంతరం... నిబంధనలను అనుసరించి వీఆర్ఏల అర్హతలను ప్రకారం, మున్సిపాలిటీ, మిషన్ భగీరథ, ఇరిగేషన్ తదితర శాఖల్లో సర్దుబాటు చేస్తూ వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను రేపు (సోమవారం) విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని సీఎం ఆదేశించారు. చదవండి తాడో పేడో తేల్చుకుంటాం.. గాంధీభవన్‌లో పొన్నం అనుచరుల ఆందోళన -
గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ అద్భుతం: బండి శ్రీనివాస్
సాక్షి, అమరావతి: ఏపీఎన్జీవో భవనంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర జనరల్ బాడీ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో ఏపీఎన్జీవో సంఘం, సచివాలయ ఉద్యోగుల సంఘాల నేతలు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం ఏపీ అని.. ఎలాంటి అవినీతి లేకుండా లక్షా 30 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికే దక్కిందని కొనియాడారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయడం సరైనదేనని కరోనా సమయంలో నిరూపితమైందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) ఎన్.చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థతో ప్రపంచంలోనే ఏపీకి ప్రత్యేకత వచ్చిందని.. ఉద్యోగ వ్యవస్థకు ఇదొక గర్వకారణమని కొనియాడారు. సచివాలయ వ్యవస్థలోని ఉద్యోగులను రెగ్యులర్ చేయరని కొందరు అనుమానం వ్యక్తం చేశారని, కానీ సీఎం జగన్ సచివాలయ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి చూపించారని అన్నారు. చదవండి: ‘కన్నా పోటీచేస్తాడో.. పారిపోతాడో తెలియదు’ -
గ్రామవార్డు, సచివాలయ ఉద్యోగుల బదిలీలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీల్లో దివ్యాంగులు, ప్రత్యేక ప్రతిభావంతులైన పిల్లలు ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అటువంటివారి దరఖాస్తులు, వాటితోపాటు సమర్పించే వైద్యుల సర్టిఫికెట్లను ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేకంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అందుకోసం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీల షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసింది. జిల్లాలో బదిలీలు, అంతర్ జిల్లా బదిలీల కోసం గ్రామ, వార్డు సచివాలయాలశాఖ గురువారం విడుదల చేసిన తాజా షెడ్యూల్ ఇలా ఉంది. జిల్లాలో బదిలీల షెడ్యూల్ జిల్లాలవారీగా ఖాళీగా ఉన్న పోస్టుల గుర్తింపు: మే 28 బదిలీలకు దరఖాస్తు చేసేందుకు తుది గడువు: జూన్ 3 దరఖాస్తుల పరిశీలనకు తుది గడువు : జూన్ 10 కేటాయించిన మండలాలు,మున్సిపాలిటీలు, తిరస్కరించిన దరఖాస్తుల జాబితా ప్రకటన : జూన్ 12 బదిలీల కోసం కౌన్సెలింగ్ నిర్వహణ : జూన్ 14, 15 కౌన్సెలింగ్‌పై అభ్యంతరాల స్వీకరణ : జూన్ 15 నుంచి అంతర్ జిల్లా బదిలీల షెడ్యూల్ జిల్లాలవారీగా ఖాళీగా ఉన్న పోస్టుల గుర్తింపు: మే 28 బదిలీలకు దరఖాస్తు చేసేందుకు తుది గడువు: జూన్ 3 దరఖాస్తులను సంబంధిత జిల్లాకు పంపేందుకు గడువు: జూన్ 9 జిల్లా అధికారులు రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి దరఖాస్తుల సమర్పణ: జూన్ 10 రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుంచి దరఖాస్తులు కార్యదర్శికి సమర్పణ: జూన్ 13 బదిలీల కోసం కౌన్సెలింగ్ నిర్వహణ: జూన్ 14, 15 కౌన్సెలింగ్‌పై అభ్యంతరాల స్వీకరణ : జూన్ 15 నుంచి చదవండి: Manifesto: 99 శాతం పూర్తి.. దేశ చరిత్రలోనే తొలిసారి -
బదిలీలకు 15,526 మంది ‘సచివాలయాల’ ఉద్యోగులు దరఖాస్తు
సాక్షి, అమరావతి: బదిలీల కోసం గ్రామ, వార్డు సచివాయాల ఉద్యోగులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేశారు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన జరుగుతున్న ఈ బదిలీలకు సొంత జిల్లాల్లోనే మరో స్థానానికి బదిలో కోరుతూ 13,105 మంది, ఒక జిల్లా నుంచి వేరొక జిల్లాకు బదిలీ కోసం మరో 2,421 మంది దరఖాస్తు చేసుకున్నట్టు గ్రామ వార్డు సచివాలయాల శాఖ అధికారులు వెల్లడించారు. 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నాలుగు నెలల్లోనే రికార్డు స్థాయిలో ఒకే విడతలో 1.34 లక్షల గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగాలను భర్తీ చేసిన విషయం తెలిసిందే. వీరికి ప్రభుత్వం ఈ ఏడాది బదిలీలకు అవకాశం కల్పించింది. బదిలీలకు ఈ నెల 3వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. జిల్లా పరిధిలో, అంతర్ జిల్లాల బదిలీలకు కలిపి మొత్తం 15,526 మంది దరఖాస్తు చేసుకున్నారు. సోమవారం దరఖాస్తుల పరిశీలన చేపట్టారు. మంగళవారం రాత్రికల్లా జిల్లాల వారీగా, వివిధ కేటగిరీ పోస్టుల ప్రకారం బదిలీలకు దరఖాస్తు చేసుకున్న వారికి మెరిట్ ర్యాంకులు ఇస్తామని గ్రామ, వార్డు సచివాలయాల అధికారులు వెల్లడించారు. బదిలీలకు అర్హత ఉన్న వారికి 8, 9, 10 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించి వారు కోరుకున్న మేరకు కేటాయించే సచివాలయాల వివరాలతో ప్రొసీడింగ్స్ జారీ చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా డిజిటల్ అసిస్టెంట్ పోస్టుల్లోనే అత్యధికంగా కర్నూలు జిల్లా నుంచి 1,581 మంది బదిలీ కోరుతూ దరఖాస్తు చేశారు. ప్రత్యేకించి ఒక జిల్లా నుంచి వేరొక జిల్లాకు అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో 233 మంది దరఖాస్తు చేసుకోగా, ఆ తర్వాత గుంటూరు జిల్లా నుంచి 232 మంది దరఖాస్తు చేసినట్టు అధికారులు వివరించారు. అత్యధికంగా డిజిటల్ అసిస్టెంట్లు 1,976 మంది బదిలీకి దరఖాస్తు చేసుకున్నారు. ఒక జిల్లా నుంచి వేరొక జిల్లాకు బదిలీ కోరుతూ అత్యధికంగా మహిళా పోలీసులు 389 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఇంజనీరింగ్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు ఎక్కువ మంది బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. చదవండి: Fact Check : పేదల ఇళ్లపై పిచ్చి రాతలు.. బాబు కొంప కొల్లేరవుతుందనే! -
వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేస్తే చాలు మీ ప్రాబ్లం సాల్వ్..!
-
AP: సచివాలయాల పనితీరు బాగుంది
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటివద్దే సేవలందించే వలంటీర్ల వ్యవస్థతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల పనితీరు ఎప్పుడూ సమర్థవంతంగా ఉండేలా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయాలను కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో పాటు ఇతర ఉన్నతాధికారులతో తనిఖీలు నిర్వహిస్తోంది. వీటి ద్వారా ఏమైనా లోటుపాట్లు, పనితీరు సక్రమంగా లేనట్లు తేలితే వాటిని సరిచేయడం ద్వారా ప్రజలకు మరింత సమర్థవంతంగా మెరుగైన సేవలు అందించేలా వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. 2020 అక్టోబర్ 20 నుంచి ఈ నెల 3వ తేదీ వరకు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు గ్రామ, వార్డు సచివాలయాల్లో 27,473 తనిఖీలను నిర్వహించారు. ఇందులో ఒకసారి కన్నా ఎక్కువసార్లు 2,870 సచివాలయాలను సందర్శించారు. అక్కడ సిబ్బంది, వలంటీర్ల పనితీరు, రంగాల వారీగా ప్రజలకు అందిస్తున్న సేవలను పరీశీలించడమే కాక.. ప్రజల నుంచి సమాచారాన్ని సేకరించి, వాటి పనితీరును మదింపు చేశారు. 2021 సెప్టెంబర్ 1 నుంచి ఈ నెల 3 వరకు కూడా సచివాలయాల పనితీరును పరిశీలించారు. దాని ప్రకారం చూస్తే.. 80.90 శాతం గ్రామ, వార్డు సచివాలయాల పనితీరు బాగుందని.. మరో 17.99 శాతం ఓ మోస్తరుగా ఉన్నాయని తేలింది. మిగిలిన 1.11 శాతం సచివాలయాల పనితీరు బాగోలేదని తేలింది. అలాగే, 76.59 శాతం మంది వలంటీర్ల పనితీరు బాగుందని, 21.55 శాతం వలంటీర్ల పనితీరు ఓ మోస్తరుగా ఉందని.. 1.86 శాతం వలంటీర్ల పనితీరు బాగోలేదని ఆ తనిఖీల్లో తేలింది. తనిఖీలు విధిగా నిర్వహించండి : సీఎస్ ఈ నేపథ్యంలో.. ప్రజలకు మరింత మెరుగైన, నాణ్యమైన సేవలు అందించడంతో పాటు పథకాల పంపిణీని సమర్థవంతంగా నిర్వహించేందుకు ఉన్నతాధికారులు గ్రామ, వార్డు సచివాలయాలను క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కేఎస్ జవహర్‌రెడ్డి గురువారం కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశించారు. ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు నెలలో తప్పనిసరిగా రెండు గ్రామ, వార్డు సచివాలాయాలను తనిఖీ చేయాలని సూచించారు. అలాగే, శాఖాధిపతులు నెలకు రెండు, కలెక్టర్లు వారంలో రెండు..జాయింట్ కలెక్టర్లు వారానికి నాలుగు గ్రామ, వార్డు సచివాలయాలను తనిఖీచేయాలని జవహర్‌రెడ్డి స్పష్టంచేశారు. బాగోలేని, మోస్తరు పనితీరు సచివాలయాలపై ఫోకస్ ఇక పనితీరు బాగోలేని, మోస్తరు పనితీరు మాత్రమే ఉన్న సచివాలయాలపై కారణాలు అన్వేషించి ఫోకస్ పెట్టాల్సిందిగా జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్లు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక సీఎస్ అజయ్‌జైన్ తెలిపారు. మంచి పనితీరు కనబరిచేందుకు అవసరమైన చర్యలను తీసుకోవాల్సిందిగా కోరినట్లు ఆయన పేర్కొన్నారు. -
Janasena Party: బెదిరింపులు మీసం తిప్పుతున్నాయ్
సాక్షి, శ్రీకాకుళం: 'రేపు రా నీకు తోలు తీసి వదలకపోతే నా కొడకా... నీకు చెబుతున్నా క్లియర్‌గా. తమాషాగా ఉందా ఏంటి. పద్దుకు మాలిన వెధవా.. నేను ఊరుకుంటున్నానని కాదు నా సంగతి నీకు తెలీదు. పాత బిల్లు అయినా నిద్దాంలో నాకు తెలియకుండా చేస్తే నరికిపారేస్తా నా కొడకా... తమాషాగా ఉందా నీకు. ఎవడైనా నిద్దాంలో నాకు తెలియకుండా చేస్తే ఊరుకోను. ఇళ్లు కాదు అన్నీ అపాలి. నిద్దాంలో ఆడు తీసుకెళ్లాడు, ఈడు తీసుకెళ్లాడు అని చెబితే ఊరుకోనిక్కడ నేను. ఏ వలంటీర్ చెప్పినా తీసుకెళ్లడానికి లేదు, చేయడానికి లేదు. నాకు తెలియకుండా ఏమీ జరగడానికి లేదు. సచివాలయానికి వచ్చి సచివాలయం చూసుకొని వెళ్లిపో అంతే..’ ఇదీ నిద్దాం సచివాలయ ఉద్యోగికి జనసేన నాయకుడు మీసాల రవికుమార్ చేసిన ఫోన్ బెదిరింపు. జనసేన నేతలు దౌర్జన్యాన్ని నమ్ముకున్నట్టున్నారా? దాడులు, బెదిరింపులకు దిగి అటు ప్రజల్ని, ఇటు ఉద్యోగుల్ని భయపెట్టాలని చూస్తున్నారా? వీరంగం సృష్టిస్తే నాయకులమైపోతామని అనుకుంటున్నారా? ఎచ్చెర్ల నియోజకవర్గంలో జరిగిన సంఘటనలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఆ మధ్య రణస్థలం మండలం కొచ్చాడ గ్రామంలో దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి ఇంటిపై బస్వ గోవిందరెడ్డి అనే జనసేన నేత దాడి చేసి విధ్వంసం సృష్టించారు. అడ్డువచ్చిన దుర్గా ప్రసాద్ తల్లిదండ్రులు రాములమ్మ, అప్పలరాముడులపై భౌతికంగా దాడి చేశారు. తాజాగా జి.సిగడాం మండలం నిద్దాం గ్రామంలో జనసేన నాయకుడు మీసాల రవికుమార్ సచివాలయం ఉద్యోగికి ఫోన్ చేసి బెదిరింపులకు దిగారు. కొందరు జనసేన నాయకులు తమను ఎవరేమీ చేయలేరని కండకావరం చూపిస్తున్నారు. అటు ప్రజల్ని, ఇటు ఉద్యోగుల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు కూడా అడ్డు తగులుతున్నారు. ఏదీ జరగకూడదని, ఏం జరిగినా తమకు చెప్పి చేయాలన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. రణస్థలం మండలానికి చెందిన బస్వ గోవిందరెడ్డి ఇలాగే వ్యవహరించారు. తాజాగా జి.సిగడాం మండలం నిద్దాం గ్రామంలో జనసేన నాయకుడు మీసాల రవికుమార్ అదే రకంగా బెదిరింపులకు దిగారు. ఆ గ్రామంలో దళిత మహిళ సర్పంచ్. కానీ పవర్ అంతా మీసాల రవికుమారే చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఏ చిన్న పని అయినా తనకు తెలియకుండా చేస్తే ‘మీకు తోలు తీస్తా..’ అంటూ సచివాలయం ఉద్యోగస్తులపై వీరంగం చేస్తూనే ఉన్నారు. ఇక్కడ సచివాలయం ఉద్యోగులు ప్రతి రోజూ భయాందోళనతో విధులు నిర్వహిస్తున్నారు. చదవండి: (పెళ్లిలో కూడానా.. ఇదేమి ఖర్మరా బాబు..!) ఇప్పటికే సెలవుపై వెళ్లిన ఒక ఉద్యోగి నిద్దాం పంచాయతీకి ప్రభుత్వం మంజూరు చేసిన పక్కా గృహాలు అర్హులకు ఇవ్వకుండా తనకు నచ్చిన వారికి మాత్రమే మంజూరు చేయాలని ఇంజినీరింగ్ అసిస్టెంట్ కె.అశోక్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చి మానసికంగా ఇబ్బందులు పెట్టి నోటికి ఏది వస్తే అదే మాట్లాది వేధించారు. దీంతో ఆ ఉద్యోగి సెలవు పెట్టి ఇంటి దగ్గర ఉండిపోయాడు. ఇన్చార్జి ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా సీతంపేట సచివాలయానికి చెందిన వంపూరి గోపికి బాధ్యతలు అప్పగించారు. అయితే అతనిని కూడా జనసేన నాయకుడు వదలడం లేదు. గ్రామంలో అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిస్తూ.. అధిక సంఖ్యలో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసి, కోర్టుల ద్వారా నోటీసులిస్తూ భయపెట్టడమే కాకుండా నోటికి కూడా పని చెబుతున్నాడు. నేరుగా ఫోన్లో బెదిరింపులకు దిగాడు. ‘చెప్పినట్టే సచివాలయం ఉద్యోగస్తులు పని చేయాలి.. లేకుంటే సెలవుపై వెళ్లిపోండి... లేకపోతే మీ అంతు చూస్తా..’ అంటూ నానా వేధింపులకు గురి చేస్తున్నారు. దీంతో నిద్దాం గ్రామంలో ఉద్యోగం చేయలేమని సచివాలయం ఉద్యోగులు ఇప్పటికే సంబంధిత అధికారుల ముందు వాపోయారు. వంపూరి గోపికి ఫోన్ చేసి బెదిరించిన విషయమంతా ఆడియో లీక్ ద్వారా బయటపడింది. -
వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్టు పేరే సాల్ట్
-
సీఎం జగన్ చేతుల మీదుగా సచివాలయ కాంప్లెక్స్ ప్రారంభం(ఫొటోలు)
-
గడప గడపకు మన ప్రభుత్వంలో ప్రజా సమస్యల పరిష్కారానికి నిధులు
తాడేపల్లి: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రతి సచివాలయం పరిధిలో రూ.20 లక్షలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15,004 సచివాలయాలకు నిధులు మంజూరు చేసింది ప్రభుత్వం. మరోవైపు.. గ్రామాల్లో సమస్యల పరిష్కారం కోసం రూ. 3 వేల కోట్ల కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులకు ప్రతి ఇంటి వద్ద ప్రజల నుంచి ఆత్మీయ ఆదరణ లభిస్తోంది. తమ సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం వైఎస్ జగన్‌కి తమ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ప్రజలు దీవిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తోన్న సంక్షేమ పథకాలను వివరిస్తూ, అర్హులకు అవి అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకుంటున్నారు. ఇదీ చదవండి: CM YS Jagan: గడప గడపకూ మనలో ఒకడై.. -
వర్షాన్ని లెక్కచేయకుండా జనం ప్లీనరీకి తరలివచ్చారు
-
లక్ష్యానికి తూట్లు పొడుస్తున్న సచివాలయ సిబ్బంది తీరు
పాములపాడు: ప్రజలకు నాణ్యమైన పాలన అందించడమే కాకుండా, మరింత చేరువ చేయాలని ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది. ఎంతో మంది నిరుద్యోగులకు గ్రామంలో ఉద్యోగం కల్పించింది. ఈ విధానం విజయవంతం కావడంతో పలు రాష్ట్రాలు అధ్యయనం చేసి అమలు చేయడానికి పూనుకున్నాయి. అయితే కొన్నిచోట్ల స్థానిక సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పడుతున్నాయి. మండలంలోని చెలిమిల్ల గ్రామంలో సచివాలయ ఉద్యోగుల తీరు అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఉదయం 11.30 దాటినా ఒక్కరు కూడా విధులకు హాజరుకాకపోవడం, కార్యాలయానికి వచ్చిన వారిని పట్టించుకోకపోవడంతో స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో సిబ్బంది ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని వారు మండిపడుతున్నారు. సిబ్బంది సమయపాలన పాటించకపోవడంతో వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు నిరీక్షించి వెనుదిరిగి వెళ్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని సక్రమంగా విధులు నిర్వర్తించేలా చూడాలని కోరుతున్నారు. -
సీఎం జగన్ ప్రభుత్వాన్ని అభినందించిన ఎన్హెచ్ఆర్సీ డైరెక్టర్
సాక్షి ప్రతినిధి, విజయవాడ/ రామవరప్పాడు: దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు సచివాలయ వ్యవస్థ ద్వారా అవినీతికి ఆస్కారం లేకుండా, పారదర్శకమైన సేవలు అందించడం అభినందనీయమని జాతీయ మానవ హక్కుల కమిషన్ డైరెక్టర్ జనరల్ (ఇన్వెస్టిగేషన్) సంతోష్ మెహరా అన్నారు. ప్రజలకు పారదర్శకమైన పాలన అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. తొలుత సంతోష్ మెహరాను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ బృందం ఎన్టీఆర్ జిల్లాలోని ప్రసాదంపాడు, గూడవల్లి, ఇబ్రహీంపట్నం గ్రామాల్లోని సచివాలయాలను సోమవారం ఏపీ స్టేట్ హ్యూమన్ రైట్స్ సభ్యులు డాక్టర్ జి.శ్రీనివాసరావుతో కలసి సందర్శించారు. కలెక్టర్ ఢిల్లీరావు.. సంతోష్ మెహరాకు సచివాలయాల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలు, సచివాలయ వ్యవస్థలో పని చేస్తున్న వివిధ శాఖల వారి పనితీరును వివరించారు. ఈ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను బృందానికి తెలిపారు. చదవండి: (Somu Veerraju: ప్రధాని పర్యటనలో భారీ కుట్ర) అవినీతికి, వివక్షకు తావు లేకుండా పాలనను ప్రజలకు చేరువ చేయాలన్న ప్రధాన ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారని తెలిపారు. గ్రామ వార్డు సచివాలయాల్లో దాదాపు 35 ప్రభుత్వ శాఖలకు సంబంధించి 500కు పైగా సేవలు అందుబాటులో ఉంటాయని కలెక్టర్ వివరించారు. ఎన్నో గ్రామ సచివాలయాల్లో అర్జీ పెట్టుకున్న 72 గంటల్లోనే సమస్యలు పరిష్కరిస్తారని కలెక్టర్ తెలిపారు. సచివాలయ వ్వవస్థలో వలంటీర్ల వ్యవస్థ ప్రధాన పాత్ర పోషిస్తుందని.. అర్హులైన ప్రతి లబ్ధిదారుని గడపకు వెళ్లి స్వయంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని వివరించారు. దిశ యాప్ గరించి.. దిశ యాప్‌ను సంతోష్ మెహరా స్వయంగా పరిశీలించారు. దిశ యాప్ ఆయన ఉపయోగించగానే మంగళగిరిలోని దిశ కంట్రోల్ పోలీస్ స్టేషన్ సమాచారం అందుకుని స్పందించిన తీరుపై హర్షం వ్యక్తం చేశారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడంలో చేస్తున్న కృషి హర్షణీయమన్నారు. గ్రామ సచివాలయాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సంతోష్ మెహరా కోరారు. జెడ్పీ సీఈవో సూర్యప్రకాష్, డ్వామా పీడీ సునీత, డీపీవో కేపీ చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
అన్ని వర్గాల సంక్షేమమే సీఎం వైఎస్ జగన్ లక్ష్యం
సాక్షి,తణుకు అర్బన్: ప్రజలకు పారదర్శకంగా సంక్షేమాన్ని అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సచివాలయ వ్యవస్థ ఏర్పరచారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకులో మంగళవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో తణుకు మునిసిపాలిటీ పరిధిలోని సచివాలయ ఉద్యోగులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్దీకరిస్తానని ఇచ్చిన మాట ప్రకారం ఉత్తర్వులు జారీ చేశారని అన్నారు. ఓకేసారి ఇంత మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత దేశచరిత్రలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మాత్రమే దక్కుతుందని అన్నారు. ఏ లక్ష్యంతో సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయబడిందో దానికి కట్టుబడి ఉద్యోగులంతా ప్రజలకు మంచి సేవలు అందించాలని సూచించారు. సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం పీజీలు చేసి ఈ చెత్త ఉద్యోగాలే దిక్కా అని కొందరు.. మీ ఉద్యోగాలు నీటి బుడగలే అంటూ ఇంకొందరు తమను విమర్శించారని, వీటికి చెక్ చెబుతూ చెప్పాడంటే చేస్తాడంతే అనే రీతిలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తమను ప్రభుత్వ ఉద్యోగులుగా అవకాశం కల్పించారని సచివాలయ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. తమ జీవితాలు మారిపోయాయంటూ ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్, మంత్రి కారుమూరికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సచివాలయ ఉద్యోగులతో కలిసి మంత్రి కారుమూరి కేక్ కట్ చేసి వారందరికీ పంచారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు మంగెన సూర్య, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ దాట్ల సుందరరామరాజు, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మెహర్ అన్సారీ, పట్టణ మహిళాధ్యక్షురాలు నూకల కనకదుర్గ, మునిసిపాలిటీ పరిధిలోని సెక్రటరీలు పాల్గొన్నారు. -
సంతోషం ఖరారు!
అనంతపురం రూరల్: రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకుని డిపార్ట్మెంటల్ పరీక్ష పాసైన సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రొబేషన్ డిక్లేర్ చేసింది. వారిని శాశ్వత ఉద్యోగులుగా గుర్తిస్తూ పీఆర్సీ ప్రకారం జూలై నుంచి జీతాలు పెంచుతూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ చేసే అధికారాన్ని కలెక్టర్‌కు అప్పగించింది. ఉద్యోగుల పే స్కేల్‌ను సైతం ఖరారు చేసింది. పంచాయతీ సెక్రటరీ, వార్డ్ సెక్రటరీలకు బేసిక్ పే రూ.23,120 నుంచి రూ.74,770, ఇతర ఉద్యోగులకు బేసిక్ పే రూ.22,460 నుంచి రూ.72,810 ఉండేలా నిర్ణయించింది. ఈ మేరకు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రొబేషన్ డిక్లరేషన్ పొందిన 7,393 మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం రూ.15వేల వేతనం పొందుతున్న ఉద్యోగులు ఆగస్టులో పెరిగిన జీతాలు అందుకోనున్నారు. జీతాలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సచివాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల వద్ద సీఎం చిత్ర పటానికి క్షీరాభిషేకం చేసి, కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. విధుల్లోకి చేరిన రెండు సంవత్సరాలకే తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించి అండగా నిలిచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటామని, ఇక నుంచి మరింత బాధ్యతగా పని చేసి ప్రజలకు మెరుగైన సేవలందిస్తామని ఉద్యోగులు చెబుతున్నారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు రాప్తాడు: సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్, రెగ్యులర్ జీతాల అమలుకు ఉత్తర్వులు జారీ చేసిన సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి సచివాలయ ఉద్యోగులంతా రుణపడి ఉంటామని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భీమిరెడ్డి పేర్కొన్నారు. శనివారం హంపాపురం సచివాలయంలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం సచివాలయ ఉద్యోగులతో కలిసి రాష్ట్ర అధ్యక్షుడు భీమిరెడ్డి కేక్ కట్ చేసి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. చాలా సంతోషంగా ఉంది ఇచ్చిన మాట ప్రకారం సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లేర్ చేసి ఉత్తర్వులు జారీ చేయడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటాం. ఆయన ఆశయాలకు అనుగుణంగా పని చేసి పేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం. – నదియా, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్, రెడ్డిపల్లి సచివాలయం, బుక్కరాయసముద్రం మండలం పారదర్శకంగా సేవలు సచివాలయాల ద్వారా ప్రజల ముంగిటకే ప్రభుత్వ సేవలు వచ్చాయి. ఎవరి సిఫార్సులూ లేకుండా పారదర్శకంగా ప్రజలకు సేవలందించేందుకు ఈ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతోంది. రెండేళ్లలోనే సచివాలయ ఉద్యోగులను పర్మినెంట్ చేయడం చాలా గొప్ప విషయం. – జయప్రకాష్, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, ఉదిరిపికొండ, కూడేరు మండలం (చదవండి: పాత కక్షలతో....ప్రాణం తీసిన స్నేహితులు) -
ఏపీ: గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగులకు తీపి కబురు
-
సచివాలయ సేవలు దేశానికే ఆదర్శం
సాక్షి,ఒంటిమిట్ట: రాష్ట్రంలో సచివాలయాల సేవలు దేశానికే ఆదర్శమని, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చాలా బాగున్నాయని భారత ఆర్థిక వ్యవహారాల సంయుక్త కార్యదర్శి, ఆకాంక్ష జిల్లాల కేంద్ర ప్రాబరీ అధికారి పీయూష్ కుమార్ అన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం జిల్లాకు విచ్చేసిన ఆయన...ఆదివారం జిల్లా కలెక్టర్ విజయరామరాజు, జేసీ సాయికాంత్ వర్మతో కలిసి ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం సచివాలయ భవన సముదాయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలను కలెక్టర్, జేసీలు ఆయనకు వివరించారు. గ్రామ సచివాలయ భవనంలో ప్రదర్శించిన ప్రభుత్వ పథకాల పోస్టర్లను, లబ్ధిదారుల జాబితా, రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన 2021–2022 సంక్షేమ క్యాలెండర్లను పరిశీలించారు. రైతు భరోసా కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.ఈ కార్యక్రమంలో వేర్ హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్, జిల్లా వ్యవసాయ బోర్డు సలహా మండలి సభ్యులు ఆకేపాటి వేణుగోపాల్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసులరెడ్డి, ఎంపీడీవో రాజేంద్రప్రసాద్, జెడ్పీసీఈవో సుధాకర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వరరావు, కడప తహసీల్దార్ శివరామిరెడ్డి, సచివాలయ సిబ్బంది, స్థానిక మున్సిపల్, రెవెన్యు సిబ్బంది పాల్గొన్నారు. -
రెండు రోజుల ముందే పింఛను డబ్బు జమ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పింఛనుదారులకు మే 1వ తేదీ నుంచి పంపిణీ చేసే పింఛను డబ్బును రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల ముందుగానే సచివాలయాల ఖాతాల్లో జమ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 60,87,942 మందికి పింఛన్ల పంపిణీకి రూ.1,547.17 కోట్ల మొత్తాన్ని ఆయా గ్రామ, వార్డు సచివాలయాల ఖాతాల్లో శుక్రవారమే జమ చేసినట్టు ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే వలంటీర్లు లబ్ధిదారుల వద్దకే వెళ్లి పింఛను డబ్బు పంపిణీ చేస్తారని చెప్పారు. 5వ తేదీ లోగా పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించినట్లు వివరించారు. -
శ్రీరామవరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి శ్రీరంగనాథ రాజు
-
మంత్రాలయంలో సచివాలయ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి
-
హై స్కూళ్లు, కాలేజీల్లోనే సచివాలయ సిబ్బంది ద్వారా వ్యాక్సినేషన్
-
సచివాలయంలో విషాదం.. రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియో ప్రకటించిన సీఎం స్టాలిన్
సాక్షి, చెన్నై: రాష్ట్ర సచివాలయం వద్ద మంగళవారం విషాదం చోటు చేసుకుంది. పెద్ద చెట్టు హఠాత్తుగా నేలకూలడంతో భద్రతా విధుల్లో ఉన్న మహిళా హెడ్ కానిస్టేబుల్ కవిత(40) సంఘటనా స్థలంలోనే మృతిచెందారు. మరో కానిస్టేబుల్ తీ›వ్రంగా గాయపడ్డారు. జార్జ్ కోటలోని సచివాలయం నాలుగో గేట్ వద్ద సీఎం సెల్‌కు కూతవేటు దూరంలో ముత్యాల్‌పేట ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ కవిత(40), రాయపేట స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ మురుగన్(45) భద్రతా విధుల్లో ఉన్నారు. గాలి వీయడంతో హఠాత్తుగా అక్కడున్న పెద్ద చెట్టు వేళ్లతో సహా నేలకొరిగింది. ఈ ప్రమాదంలో కవిత మరణించారు. మురుగన్ తీవ్రంగా గాయపడ్డారు. చెట్టు కింద చిక్కుకున్న కవిత మృతదేహాన్ని బయటకు తీయడానికి తీవ్రంగా శ్రమించారు. గాయపడ్డ మురుగన్‌ను జీహెచ్‌కు తరలించారు. కవిత మృతదేహానికి నివాళులర్పిస్తున్న సీఎం స్టాలిన్ సీఎం నివాళి ఈ ఘటనతో సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతికి గురయ్యారు. కవిత కుటుంబానికి సంతాపం తెలిపారు. రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు. మంత్రులు దురై మురుగన్, శేఖర్ బాబు, డీజీపీ శైలేంద్ర బాబు, చెన్నై పోలీసు కమిషనర్ శంకర్ జివ్వాల్‌తో కలిసి రాజీవ్ గాంధీ జీహెచ్‌కు చేరుకుని కవిత మృతదేహానికి నివాళులర్పించారు. ఆమె భర్త పిల్లలను ఓదార్చారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలకు ఆదేశించారు. కాగా కవిత భర్త సాయిబాబా రైల్వే ఉద్యోగి. వీరికి కుమారులు అరుణ్‌కుమార్(22), విశాల్(15), కుమార్తె స్నేహప్రియ(20) ఉన్నారు. ఈ చెట్టు ఉదయం 9 గంటలకు నేలకొరిగింది. ఆ సమయంలో అధికారులు, సిబ్బంది సచివాలయానికి రాలేదు. అలాగే సీఎం సెల్‌కు విజ్ఞప్తిలు చేసుకునే వాళ్లూ రాలేదు. 10 గంటల అనంతరం చెట్టు నేలకొరిగి ఉంటే పెను ప్రాణనష్టం జరిగి ఉండేదని సచివాలయ సిబ్బంది పేర్కొన్నారు. చదవండి: (విషాదం: 4 రోజుల క్రితం పెళ్లిపీటలపై సందడి.. నేడు విగతజీవులుగా..) -
AP: ఈ సేవలన్నీ మీకు తెలుసా?
సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లా బంటుమిల్లి గ్రామానికి చెందిన వెంకట రమణ శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో టీవీ చూస్తోంది. ఇదే సమయంలో ఆ గ్రామ సచివాలయంలో పని చేసే వెల్ఫేర్ అసిస్టెంట్, మరో ముగ్గురు వలంటీర్లు ఆమె ఇంటి వద్దకు వచ్చి కాలింగ్ బెల్ కొట్టారు. తలుపు తీయగానే నమస్కారం.. అంటూ తాము వచ్చిన పని చెప్పారు. గ్రామ సచివాలయం ద్వారా ప్రభుత్వం అందజేస్తున్న సేవలు గురించి తెలుసా? అని వాకబు చేశారు. సచివాలయం ద్వారా అందిస్తున్న సేవలు పొందే విషయంలో ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా? అని అడిగి తెలుసుకున్నారు. వెంకట రమణ చెప్పిన సమాధానాన్ని ఆ సచివాలయ ఉద్యోగి తన వెంట తెచ్చుకున్న మొబైల్లోని ప్రత్యేక యాప్‌లో నమోదు చేసి, అప్పటికప్పుడే ఉన్నతాధికారులకు చేర వేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఊళ్లలోనూ సచివాలయాల బృందాలు ప్రజల ఇళ్ల వద్దకే వెళ్లి సమస్యలపై వాకబు చేశాయి. ప్రభుత్వ సేవలను మరింతగా ప్రజల ముంగిటకు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి నెలా లబ్ధిదారుల ఇళ్ల వద్దే పింఛన్లు, రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు ప్రభుత్వ సేవలు పొందడంలో ఎవరైనా ఇబ్బందులు పడుతున్నారా.. అని తెలుసుకోవడం కోసం ‘సిటిజన్, బెనిఫిషరీ ఔట్ రీచ్’ (ప్రభుత్వ సేవలపై ప్రజలకు అవగాహన కల్పించడం) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్ల ఆధ్వర్వంలో ఏర్పాటు చేసిన బృందాలు రాష్ట్ర వ్యాప్తంగా 44.55 లక్షల కుటుంబాలను కలిశాయి. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా వారి సొంత గ్రామంలో అందిస్తున్న సేవల గురించి వివరించాయి. సేవలు పొందడంలో ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నాయి. సాయంత్రం వరకు అందిన సమాచారం మేరకు గ్రామీణ ప్రాంతాల్లో 22.28 లక్షల కుటుంబాలను, పట్టణ ప్రాంతాల్లో 18.27 లక్షల కుటుంబాలను సచివాలయ ఉద్యోగుల బృందాలు కలిసి అభిప్రాయాలు సేకరించాయి. శనివారం కూడా ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఒక్కో బృందం వంద ఇళ్లకు.. ప్రతి నెలా ఆఖరి శుక్ర, శనివారాల్లో అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఒక్కో ప్రభుత్వ ఉద్యోగి, మరో ముగ్గురు వలంటీర్లను ఒక్కో బృందంగా ఏర్పాటు చేశారు. ఈ బృందం గ్రామం/వార్డులోని కనీసం వంద కుటుంబాలను కలిసి వారికి ప్రభుత్వం ద్వారా అందుతున్న సేవల గురించి వివరాలు సేకరిస్తోంది. ఆగస్టు నెలలో కేవలం పట్టణ ప్రాంతాలలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా.. ఈ నెల నుంచి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి కొనసాగిస్తోంది. ఇక ప్రతి నెలా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుందని గ్రామ, వార్డు సచివాలయ శాఖ అధికారులు వెల్లడించారు. ఉద్యోగుల ఫోన్ నంబర్ల కరపత్రాలు పంపిణీ రాష్ట్ర ప్రభుత్వ కాల్ సెంటర్ ఫోను నంబర్‌తో పాటు సంబంధిత గ్రామ, వార్డు సచివాలయంలో పని చేసే ఉద్యోగుల ఫోన్ నంబర్ల వివరాలు, ఆ ప్రాంత వలంటీరు ఫోను నంబరు ముద్రించిన కరపత్రాలను కూడా పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వ సేవలకు సంబంధించి ఎలాంటి సమాచారమైన ఆయా నంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని బృందం సభ్యులు ప్రజలకు వివరిస్తున్నారు. ‘సిటిజన్, బెనిఫిషరీ ఔట్ రీచ్’లో ప్రధాన వివరాలు ఇలా.. ► గ్రామ/వార్డు సచివాలయం ఎక్కడ ఉందో మీకు తెలుసా? ► మీ గ్రామ/వార్డు వలంటీర్ మీకు తెలుసా? ► మీ వలంటీర్ ఎన్ని రోజులకొకసారి మీ ఇంటికి వస్తున్నారు? ► మీకు ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి తెలుసా? (ఈ ప్రశ్న తర్వాత ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి చెబుతారు) ►సచివాలయంలో ఏయే సేవలు అందిస్తున్నారో మీకు తెలుసా? ► ‘సచివాలయం’ ద్వారా సేవలు పొందే విషయంలో మీరు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా? -
ప్రతి పర్యటనలోనూ సచివాలయాల పనితీరు గమనిస్తా : సీఎం జగన్
-
మద్యంపై ఎల్లో మీడియాతో తప్పుడు ప్రచారం చేస్తోంది
-
కృష్ణా జిల్లా కోడూరులో కలెక్టర్ నివాస్ ఆకస్మిక తనిఖీలు
-
బ్రాహ్మణ కోడూరు సచివాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
-
అక్కయపాలెం సచివాలయాన్ని పరిశీలించిన విశాఖ నగర మేయర్
-
డిజిటిల్ అసిస్టెంట్ సస్పెస్షన్
అనంతపురం: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన తలుపుల మండలం పులిగుండ్లపల్లి గ్రామ సచివాలయ డిజిటిల్ అసిస్టెంట్ నరేష్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ మేరకు మండల ఎంపీడీఓ విష్ణుప్రసాద్ గురువారం మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండటంతో పాటు అర్హులైన నలుగురికి నేతన్న నేస్తం అందకపోవడంలో డిజిటల్ అసిస్టెంట్ అలసత్వమే కారణమని గుర్తించామన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదించడంతో సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. -
శభాష్.. పది నిమిషాల్లోనే ఆరోగ్య శ్రీ కార్డు అందించిన డిజిటల్ అసిస్టెంట్
కురబలకోట (చిత్తూరు జిల్లా): పది నిమిషాల్లోనే ఆరోగ్యశ్రీ కార్డు చేతిలో పెట్టి శభాష్ అనిపించుకుంది తంబళ్లపల్లె నియోజకవర్గం, కురబలకోట మండలం, ఎర్రబల్లె సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ మానస. ఎర్రబల్లె సచివాలయ పరిధిలోని సింగన్నగారిపల్లెకు చెందిన శ్రీనివాసులు కుమారుడు యశ్వంత్ (4)కు బోన్ కేన్సర్. కుటుంబసభ్యులు చికిత్స కోసం ఇటీవల బెంగళూరులోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆరోగ్యశ్రీ కార్డు లేదని వైద్యం చేయడానికి అక్కడి వైద్యులు నిరాకరించారు. హైదరాబాద్ తీసుకెళ్లాలని ఉచిత సలహా ఇచ్చారు. ఈ విషయం స్థానిక సర్పంచ్ ఉప్పతి నాగరత్న ఈశ్వర్‌కు తెలియడంతో ఎర్రబల్లె సచివాలయానికి చేరుకుని డిజిటల్ అసిస్టెంట్ మానసను సంప్రదించారు. ఆమె విషయాన్ని వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి సూచనల మేరకు చిన్నారి వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసి.. పది నిమిషాల్లోనే ఆరోగ్యశ్రీ కార్డును చిన్నారి తల్లిదండ్రులకు అందజేశారు. గతంలో నెలలపాటు తిరిగినా ఆరోగ్యశ్రీ కార్డు వచ్చేది కాదని, ఇప్పుడు నిమిషాల్లో కార్డు చేతికందిందని చిన్నారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. చిన్నారిని చికిత్స కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్తామని తెలిపారు. -
ఏపీ: వారంలో రెండుసార్లు సచివాలయాలకు మంత్రులు
-
‘25 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యను సీఎం జగన్ పరిష్కరించారు’
సాక్షి, అమరావతి: 25 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ప్రమోషన్ సమస్యను సీఎం జగన్ పరిష్కారించారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. '' 315 మంది ఎంపీడీవోలకు 25 ఏళ్ళు ప్రమోషన్ లు లేవు. దీని వలన 18,500 మంది పంచాయతీ రాజ్ ఉద్యోగులకు ప్రమోషన్లు రాలేదు. ఇప్పుడు ఉద్యోగులకు న్యాయం చేయాలని సీఎం జగన్ భావించారు. ప్రమోషన్ల సమస్యలన్నీ పరిష్కరించాం. 255 మందికి 12 క్యాడర్ల వారికి ప్రమోషన్లే ఇచ్చాం.బయట శాఖల నుంచి ఇప్పుడు అధికారులను తీసుకుంటున్నాం. కానీ ఇప్పుడు వీళ్ళకి అవకాశం ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఈ నిర్ణయం రాష్ట్రంలో ఎవరు తీసుకోలేకపోయారు. సీఎం జగన్ ఉద్యోగులకు అన్ని విషయాల్లోనూ న్యాయం చేస్తారన్న నమ్మకం ఉద్యోగుల్లో కలిగింది. పంచాయితీరాజ్ శాఖలో ఇదొక చరిత్రగా నిలుస్తుంది. ఎంపీడీవోలందరికి ప్రమోషన్ లు వస్తాయి. గిరిజ శంకర్, కమిషనర్ ఎంపిడివోలు అభివృద్ధి లో చాలా కీలకం. ఇప్పుడు పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతం అవుతుంది .. కానీ ఇప్పుడు వీళ్ళకి అవకాశం ఇచ్చే పరిస్థితి వచ్చింది. అమర్ రాజాపై మేం ఎలాంటి రాజకీయం చెయ్యలేదు. అది వెళ్లిపోవాలని మేం కోరుకోలేదు. కానీ అమర్ రాజా నిబంధనలకు లోబడి పనిచేయాలి. చిత్తూరు జిల్లాలో 4,5 వేల ఎకరాలు భూములు తీసుకున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నివేదికలు ఆధారంగా వెళ్లాలి. వాళ్ళు హైకోర్టుకి కూడా వెళ్లారు.'' అని పేర్కొన్నారు. ఇదిలా ఉంచితే, గ్రామ, వార్డు సచివాలయాల్లో మరిన్ని సేవలు అందుబాటులోకి తెస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్, పాన్‌కార్డు సేవలు అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్లు సీఎం జగన్ మానస పుత్రికలను పెద్దిరెడ్డి పేర్కొన్నారు. ప్రొబేషన్ ఎగ్జామ్‌లో ఎటువంటి రాజకీయాలు ఉండవని ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. -
సచివాలయ వ్యవస్థ ప్రపంచస్థాయి గుర్తింపు పొందింది
సాక్షి, చిత్తూరు: సచివాలయ వ్యవస్థ ప్రపంచస్థాయి గుర్తింపు పొందిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. 'కుప్పం వాసులకు సాగు, తాగునీరు అందించి తీరుతాం.రాష్ట్రంలో అభివృద్ధి చంద్రబాబు, ఎల్లోమీడియాకు కనిపించట్లేదా. చంద్రబాబు డైరెక్షన్లో ఎల్లోమీడియా పనిచేస్తోంది.' అని పెద్దిరెడ్డి తెలిపారు. -
సచివాలయ వ్యవస్థతో మెరుగైన సేవలు: ఆళ్ల నాని
సాక్షి,జంగారెడ్డిగూడెం రూరల్: సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారని, సచివాలయాల సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం పంచాయతీ రామచర్లగూడెంలో విజయ హాస్పిటల్స్ ఐకేర్ ఆస్పత్రిలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సేవలను మంత్రి ప్రారంభించారు. అనంతరం శ్రీనివాసపురంలో రూ.40 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయాన్ని నాని ప్రారంభించారు. సచివాలయ ఆవరణలో మంత్రి మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందుతున్నాయన్నారు. కరోనా థర్డ్ వేవ్‌పై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. ఎన్ని వేవ్‌లు వచ్చినా గత అనుభవవాలను దృష్టిలో పెట్టుకుని మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నారన్నారు. అలాగే గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థతో రాష్ట్రంలో పరిపాలనలో వినూత్న మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే ఆ సమస్య నెల రోజుల్లో పరిష్కారం చూపి పథకాల లబ్ధి చేకూరుతుందన్నారు. చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా, జెడ్పీటీసీ అభ్యర్థి పోల్నాటి బాబ్జి, సర్పంచ్ యడ్లపల్లి దుర్గారావు, మండల పార్టీ అధ్యక్షులు వామిశెట్టి హరిబాబు, పట్టణ పార్టీ అధ్యక్షులు పీపీఎన్ చంద్రరావు, ఏలూరు పార్లమెంటరీ జిల్లా కార్యదర్శి చిలుకూరి జ్ఞానారెడ్డి, విజయ హాస్పటల్స్ ఐకేర్ వైద్యులు విజయభాస్కరరెడ్డి, మున్సిపల్ చైర్మన్ బత్తిన నాగలక్ష్మి పాల్గొన్నారు. -
సచివాలయం ఉద్యోగి అనుమానాస్పద మృతి
సాక్షి, కందుకూరు: గ్రామ సచివాలయం ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ సంఘటన పట్టణ శివారు లుంబినీవనం వద్ద శనివారం వెలుగుచూసింది. కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని కొండికందుకూరుకు చెందిన పిర్ల మాలకొండయ్య రెండో కుమారుడు రాఘవ (32) ప్రస్తుతం మండలంలోని కోవూరు సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. శుక్రవారం సచివాలయ కార్యదర్శికి ఫోన్ చేసిన రాఘవ తాను విధులకు రావడం లేదని, సెలవు కావాలని కోరాడు. సెలవు చీటీ పంపాలని కార్యదర్శి సూచించారు. ఆ తర్వాత రాఘవ నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో తనకు వాంతులు అవుతున్నాయని, ఆస్పత్రికి వెళ్లి వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పిన రాఘవ కందుకూరు పట్టణానికి వచ్చాడు. ఆ తర్వాత తిరిగి రాత్రికి ఇంటికి చేరుకోలేదు. రాత్రి అంతా ఎదురు చూసిన కుటుంబ సభ్యులు శనివారం ఉదయానికి కూడా ఇంటికి రాకపోవడం, పోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుండటంతో కుటుంబ సభ్యులు వెతుకుతూ కందుకూరు వైపు బయల్దేరారు. తండ్రి మాలకొండయ్య పట్టణ శివారు ప్రాంతం లుంబినీవనం కాలనీకి వచ్చే సరికి రాఘవ ద్విచక్ర వాహనం రోడ్డు పక్కన పడి ఉండటం గమనించాడు. ద్విచక్ర వాహనం ఆధారంగా వెతుకుతూ వెళ్లిన మాలకొండయ్యకు కొద్ది దూరంలో జామాయల్ తోటలో రాఘవ నిర్జీవంగా పడి ఉండటం గమనించాడు. చనిపోయినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రాఘవది ఆత్మహత్యా లేక మరేదైనా ఇతర కారణం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రేమ వ్యవహారం కోణంలోనూ అనుమానాలున్నాయి. అదే గ్రామానికే చెందిన ఓ వివాహితతో సన్నిహితంగా ఉంటున్నాడు. ఈ విషయంలో పలుమార్లు రెండు కుటుంబాల మధ్య ఘర్షణ కూడా చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయంలో కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడనే అనుమానాలు కుటుంబ సభ్యులు, పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధానంగా ఆత్మహత్య చేసుకున్నాడనే కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం పడి ఉన్న తీరు, మృతుడి ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడం వంటి కారణాల ఆధారంగా ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నట్లు పోలీసులు చెప్తున్నారు. ఈ కేసుకు సంబంధించి అన్ని విషయాలు సేకరిస్తున్నామని, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ కండే శ్రీనివాసులు తెలిపారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ సచివాలయ ఉద్యోగి మృతి వార్త తెలుసుకున్న డీఎస్పీ కండే శ్రీనివాసులు, సీఐ శ్రీరామ్‌లు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. స్థానికులను అడిగి సమాచారం తెలుసుకోవడంతో పాటు కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఏరియా హాస్పటల్‌కు తరలించారు. సచివాలయ ఉద్యోగి మృతికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సి ఉందని డీఎస్పీ తెలిపారు. -
సచివాలయ సిబ్బంది పై హత్యాయత్నం..
సాక్షి,విజయవాడ: నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన పైఅంతస్తును కూల్చేందుకు వెళ్లిన వార్డు సచివాలయ ఉద్యోగులపై నిర్మాణదారులు పెట్రోలు పోసి హత్యాయత్నం చేశారు. ఘటనపై విజయవాడ కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు.. విజయవాడ రామకృష్ణాపురానికి చెందిన గంజి పావని కృష్ణలంక 16వ డివిజన్లోని 74వ వార్డు సచివాలయంలో ప్లానింగ్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో సచివాలయం పరిధి కళానగర్‌పాకలు ప్రాంతంలో ఎలాంటి అనుమతులూ పొందకుండా డేరంగుల రాములమ్మ ఇంటి నిర్మాణాన్ని చేపట్టింది. ఆ అక్రమ నిర్మాణాన్ని కూల్చేందుకు పావని.. ముగ్గురు ప్లానింగ్ సెక్రటరీలు వి.మౌనిక, పాలేటి తీర్థ, ఎం.రాణితో పాటు చైన్మన్ రాజు తదితరులు వెళ్లారు. పైఅంతస్తుకు వెళ్లి నిర్మాణాన్ని కూల్చబోయారు. రాములమ్మ,ఆమె కుమార్తె గోవిందమ్మ పెట్రోల్ బాటిల్‌తో పైఅంతస్తుకొచ్చి ఆమె మీద పోసుకోవడమే కాకుండా నగర పాలక సంస్థ సిబ్బందిపై కూడా పోసింది. పెట్రోలు వారి కళ్లల్లో, నోట్లో పడటంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆమె చేతిలో అగ్గిపెట్టె కూడా ఉండడంతో వారంతా భయభ్రాంతులకు లోనై పరుగులుతీశారు. పావని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రాములమ్మ, గోవిందమ్మను అదుపులోకి తీసుకున్నారు. -
వారంలో 2 రోజులు గ్రామ, వార్డు సచివాలయాలు సందర్శిస్తా: సీఎం జగన్
-
ఏపీలో గ్రామ/వార్డ్ సచివాలయ వలంటీర్ ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ.. వివిధ జిల్లాల్లో గ్రామ/వార్డ్ సచివాలయ వాలంటీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► పోస్టులు: గ్రామ/వార్డ్ సచివాలయ వలంటీర్లు ► మొత్తం పోస్టుల సంఖ్య: 2268 ► జిల్లాల వారీగా పోస్టులు: శ్రీకాకుళం–397, నెల్లూరు–1006, చిత్తూరు–569, ప్రకాశం–296. ► అర్హతలు: పదో తరగతి/ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత సాధించాలి. స్థానిక గ్రామ/వార్డ్ పరిధిలో నివశిస్తూ ఉండాలి. వయసు: 18–35 ఏళ్ల మధ్య ఉండాలి. ► ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 2021 మే 20–25 (జిల్లాల వారీగా వివిధ చివరి తేదీలు ఉంటాయి). ► వెబ్సైట్: https://gswsvolunteer.apcfss.in మరిన్ని నోటిఫికేషన్లు: సీఎస్ఐఆర్–ఎస్ఈఆర్సీలో ఉద్యోగాలు బొల్లారం ఆర్మీ పబ్లిక్ స్కూల్లో ఉద్యోగాలు -
‘ఆ దంపతుల మృతి నన్ను కలిచి వేసింది’
అమరావతి: పంచాయతీరాజ్ శాఖలో సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేసే శాంతకుమారి దంపతులు కరోనాతో చనిపోవడం పట్ల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. రెండ్రోజుల వ్యవధిలోనే దంపతులిద్దరు కరోనాతో చనిపోవడం తనను తీవ్రంగా కలిచి వేసిందని పెద్దిరెడ్డి అన్నారు. వీరిద్దరు కూడా ఏపీ సచివాలయంలోనే ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఈ మహమ్మారి మొదట శాంతకుమారి భర్తకు సోకింది. ఆయన, ఆసుపత్రిలో ఉండి చికిత్స తీసుకున్నప్పటకి ప్రాణాలు దక్కలేదు. తాజాగా, శాంతకుమారి కూడా కరోనాతోనే చనిపోయింది. వీరి కుటుంబానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. -
ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..
సాక్షి, అమరావతి: గ్రామ సచివాలయాలు- పంచాయితీల డీడీఓ బాధ్యతల్ని వికేంద్రీకరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయాల్లో ఇప్పటి వరకు ఉన్న డ్రాయింగ్ ఆఫీసర్ వ్యవస్థలో మార్పులు చేస్తూ ఆదేశాలిచ్చింది. పంచాయితీ ఉద్యోగులకు పంచాయితీ ఎగ్జిక్యూటివ్ అధికారి.. డీడీఓగా వ్యవహరించనున్నారు. గ్రామ సచివాలయాల్లోని కార్యదర్శులందరికీ డీడీఓగా వీఆర్వోకు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకూ మొత్తం డ్రాయింగ్ అండ్ డిస్బర్స్మెంట్ అధికారి బాధ్యతల్ని కూడా పంచాయతీ ఎగ్జిక్యూటివ్ అధికారులే నిర్వర్తించారు. కాగా, ఇకపై పంచాయతీలకు, సచివాలయాలకు వేర్వేరుగా డీడీఓలు నియమించింది. పంచాయితీలకు, సచివాలయాలకు లింక్ అధికారిగా గ్రామ పంచాయితీ ఎగ్జిక్యూటివ్ అధికారిని నియమిస్తూ ఏపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. చదవండి: విద్యారంగం: ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం ఏపీ చరిత్రలోనే ఇదో రికార్డు: ఎంపీ విజయసాయిరెడ్డి -
ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం, నిర్లక్ష్యం తగదు
సాక్షి, నెల్లూరు: ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం, నిర్లక్ష్యం తగదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సచివాలయ పరిపాలన అధికారులను హెచ్చరించారు. జిల్లా నగరపాలక సంస్థ సచివాలయం పరిపాలన అధికారులతో బుధవారం మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే నెలలో అన్ని పార్టీలతో అఖీల పక్ష సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. నగర అభివృద్దికి అందరి అభిప్రాయాలు కొతామని, ప్లెక్సిల ఏర్పాటు అంశంపై అందరి సలహాలు తీసుకుని కీలక నిర్ణయాలు తీసుకుంటామన్నారు. అడ్డగోలుగా ఫ్లెక్సీలు ఏర్పాటుపై కూడా నియంత్రణ చేస్తామని, అవసరమైతే పెనాల్టీ వేసే అంశం ఆలోచిస్తామని చెప్పారు. ఆ నిబంధనలు తన ఫ్లెక్సీల విషయంలోనూ వర్తిస్తాయన్నారు. వరదల ప్రమాదం నుంచి నగరాన్ని కాపాడేందుకు అఖిలపక్షం సలహాలు కొరతామని ఆయన పేర్కొన్నారు. మంత్రి కొడాలి నాని గురించి మాట్లాడే అర్హత జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు లేదన్నారు. నాలుగు సార్లు గెలుచిన కొడాలి నాని గురించి రెండు చోట్ల ఓడిన పెద్ద మనిషి మాట్లాడటం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. మీరు ఏ లింగమో ప్రజలెప్పుడో తేల్చారని, రాజకీయాల్లోకి వచ్చాక సినిమాలు చేయను మీరే చెప్పారు కాబట్టి ప్రశ్నిస్తున్నామన్నారు. అసెంబ్లీని ముట్టడిస్తే ప్రభుత్వం ఊరికే కూర్చోదని, చట్టం పని చట్టం చేస్తుందని మంత్రి వ్యాఖ్యానించారు. -
చప్పట్లు కొట్టి అభినందించండి: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభించి శుక్రవారంతో ఏడాది పూర్తవుతుందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ప్రతి ఇంటి ముందుకు ప్రభుత్వ పాలనను తీసుకువెళ్లాలి అనే ఉద్దేశంతో ఈ సచివాలయ వ్యవస్థ ప్రారంభించడం జరిగింది అని పేర్కొన్నారు. గురువారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ‘అవినీతికి తావు లేకుండా 543 సేవలను ఈ రోజు గ్రామ సచివాలయం ద్వారా ప్రజలకు అందిస్తున్నాం. అవినీతి రహిత పాలనను ఈ ప్రభుత్వం అందిస్తోంది. సచివాలయ పనితీరుని మన దేశ ప్రధాని నరేంద్రమోదీ అభినందించారు. కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ కూడా ప్రత్యేకంగా మన సచివాలయ వ్యవస్థని అభినందించారు. యూపీఎస్సీ ట్రైనింగ్ సెంటర్ లో ఒక పాఠ్యాంశంగా మన సచివాలయ వ్యవస్థని చేర్చారు. 61,65,000ల మందికి పెన్షన్లు గత నెల వరకు ఇస్తున్నాం. 34,907 మందిని గత నెల కొత్తగా పెన్షన్ ఇచ్చే జాబితాలో చేర్చాం. గత ప్రభుత్వం లాగా కాకుండా మా ప్రభుత్వంలో ఈ పెన్షన్ల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. 1,26,200 మంది ఇప్పటి వరకు గ్రామ సచివాలయల్లో పనిచేస్తున్నారు. 4 లక్షల పైచిలుకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా ప్రభుత్వానిది. రేపు గ్రామ సచివాలయ ఉద్యోగులను అభినందించేందుకు సాయంత్రం 7 గంటలకు అందరూ ఇంటి బయటకు వచ్చి చప్పట్లు కొట్టి అభినందించాలని కోరుతున్నాను. ఎప్పుడో 11 ఏళ్ల క్రితం సస్పెండ్ అయిన జడ్జ్ ద్వారా దళితులలో లబ్ది పొందాలి అని చంద్రబాబు చూస్తున్నారు’ అని అన్నారు. చదవండి: ఏపీ: పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్ధం -
రెండో రోజు గ్రామ సచివాలయ పరీక్షలు
-
20 నుంచి గ్రామ, వార్డు సచివాలయల పరీక్షలు
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ పథకాలన్ని నేరుగా ప్రజలకి అందేలా సచివాలయ వ్యవస్థ తెచ్చారు అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి,జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో బుధవారం వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం నుంచి గ్రామ, వార్డు సచివాలయాల పోస్ట్‌ల భర్తీపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. కోవిడ్ నేపథ్యంలో సచివాలయ పోస్ట్‌ల భర్తీలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘16,208 ఖాళీ పోస్టులకు 10,56,931 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 20 నుంచి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. మొత్తం 7 రోజుల పాటు 14 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నాం. 20వ తేదీన 6,81,664 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. మొదటి రోజు ఉదయం 2,221 కేంద్రాలలో, మధ్యాహ్నం 1068 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించడానికి సర్వం సిద్ధం చేశాం. కరోనా పాజిటివ్ వున్న అభ్యర్ధులకు ఐసోలేషన్ రూములను సిద్ధం చేశాం. పీపీఈ కిట్లతో ఐసోలేషన్ రూంలో ఇన్విజిలేషన్ చేస్తారు’ అని చెప్పారు. ఈ వీడియో కాన్ఫెరెన్స్‌లో పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, పీఆర్ కమిషనర్ గిరిజాశంకర్, మున్సిపల్ అడ్మినిష్ట్రేషన్ కమిషనర్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫెరెన్స్ అనంతరం మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ, ‘సచివాలయ వ్యవస్థ వల్ల దేశంలో మన రాష్ట్రానికి ఎంతో గుర్తింపు వచ్చింది. ఒక్కో సచివాలయంలో 12 నుంచి 14 మంది వరకూ ఉద్యోగులు అందుబాటులో ఉన్నారు. గత ఏడాది 1.10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం. 14062 గ్రామ సచివాలయాల్లో, 2166 వార్డు సచివాలయాల్లో ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీల భర్తీ కోసం ఈ నెల 20వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నాం. 10 లక్షల మంది ఇప్పటి వరకు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారు. పరీక్షలు పకడ్బందీగా కోవిడ్ ప్రోటోకాల్‌తో నిర్వహిస్తాం. పాజిటివ్ వచ్చిన వారికి పరీక్ష కేంద్రాల్లో ప్రత్యేక రూమ్స్ ఏర్పాటు చేశాం. అభ్యర్థుల కోసం ఆర్టీసీతో కూడా మట్లాడాం. వారి సహకారం తీసుకుంటాం. ఇప్పటికే అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొంతమంది హాల్ టికెట్స్ రాలేదని ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది. నిర్దేశించిన అర్హతలు ఉన్నవారికి మాత్రమే హాల్ టికెట్స్ వస్తాయి’ అని ఆయన తెలిపారు. చదవండి: వీధి దీపాల నిర్వహణ సచివాలయాలకు -
జిల్లా ఎంపిక కమిటీలో ప్రభుత్వం మార్పులు
సాక్షి, అమరావతి: వచ్చే నెల 20 నుంచి సచివాలయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. దీంతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పరీక్షలను పర్యవేక్షించే జిల్లా ఎంపిక కమిటీలో ప్రభుత్వం మార్పులు చేసింది. వివిధ శాఖల ఉన్నతాధికారులను జిల్లా ఎంపిక కమిటీలో నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా ఎస్పీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీలో నూతనంగా బాధ్యతలు అప్పగించిన జాయింట్ కలెక్టర్లను ఉపాధ్యక్షులుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గ్రామ,వార్డు సచివాలయ జేసీలతో పాటు రైతు భరోసా, రెవెన్యూ జేసీలను కూడా జిల్లా ఎంపిక కమిటీలో నియమిస్తున్నట్లు పేర్కొంది. సంక్షేమ బాధ్యతలు చూసే మరో జేసీని కూడా ఈ కమిటీలో సభ్యుడిగా నియమించింది. (చదవండి: సెప్టెంబర్ 20 నుంచి సచివాలయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ) (చదవండి: ‘చేయూత’తో స్వయం సమృద్ధి) -
కేంద్రం అవార్డులు; ఏపీ రికార్డుల మోత
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలోని సచివాలయ, వలంటీర్ల వ్యవస్థతో దేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ సత్తా చాటుతోంది. నేరుగా ప్రజల వద్దకే అన్ని సేవలు చేరువ చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ రాష్ట్ర ప్రగతిలో కీలక భూమిక పోషిస్తోంది. కేంద్రం తాజాగా ప్రకటించిన స్వచ్చ సర్వేక్షణ్ అవార్డుల్లో రికార్డు స్థాయిలో ఏపీకి పురస్కారాలు దక్కాయి. సచివాలయ, వలంటీర్ల వ్యవస్థతో పట్టణాల్లో పారిశుద్ధ్యం మెరుగుపడింది. దీంతో స్వచ్చ సర్వేక్షణ్ అవార్డుల్లో అత్యధిక పురస్కారాలు ఏపీకి దక్కాయి. పరిశుభ్రత విషయంలో రాష్ట్ర ర్యాంక్ గణనీయంగా మెరుగుపడి 28వ ర్యాంక్ నుండి 6వ స్థానానికి చేరుకుంది. కేంద్రం ప్రకటించిన మొత్తం 64 అవార్డుల్లో 6 అవార్డులు రాష్ట్రానికే రావడం విశేషం. టాప్ 100 ర్యాంకుల్లో 72 ర్యాంకులు ఆంధ్రప్రదేశ్ పట్టణాలు కైవసం చేసుకున్నాయి. టాప్ 10లో ఎనిమిది మున్సిపాలిటీలు రాష్ట్రానివే ఉన్నాయి. విశాఖపట్నం 23 ర్యాంక్ నుంచి 9వ ర్యాంక్‌కు ఎగబాకింది. విజయవాడ 12 నుంచి 4వ ర్యాంక్‌కి, తిరుపతి 8 నుంచి 6వ స్థానానికి చేరుకున్నాయి. ఏపీకి అవార్డులు రావడం సంతోషకరం: వెంకయ్యనాయుడు -
వారం రోజుల పాటు పరీక్షల నిర్వహణ
సాక్షి, విజయవాడ: సెప్టెంబర్ 20నుంచి సచివాలయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. బుధవారం విజయవాడలో పంచాయతిశాఖ మంత్రి కార్యాలయంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగల భర్తీపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమవేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. వచ్చే నెల 20 నుంచి సచివాలయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమై వారం రోజుల పాటు నిర్వహిస్తామన్నారు. సుమారు 10లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతారని అంచనా వేస్తున్నామని తెలిపారు. తొలిరోజే సుమారు 4.5లక్షల మంది వరకు పరీక్షలు రాస్తారని పేర్కొన్నారు. దాదాపు 3నుంచి 5వేల పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కోవిడ్ నేపథ్యంలో భౌతికదూరం పాటిస్తూ పరీక్షలు రాసేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎక్కువగా ఖాళీలు ఉన్న పశుసంవర్థక అసిస్టెంట్ పోస్ట్‌ల భర్తీపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. అత్యంత పారదర్శకంగా పరీక్షల నిర్వహణ ఉండాలని అధికారులకు తెలిపారు. కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్, ఏపీపీఎస్సీ, పురపాలకశాఖ, వ్యవసాయ, పశుసంవర్థకశాఖ అధికారులు పాల్గొన్నారు. Village/Ward Secretariat Exams. 2020 in A. P. - It is informed to all the Applicants and others concerned, that Exams. will start from 20th September 2020. Detailed schedule will be released soon. — Gopal Krishna Dwivedi (@gkd600) August 12, 2020 -
ఏపీ: గ్రామ, వార్డు సచివాలయాల్లో మరో కీలక అడుగు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో మరో కీలక అడుగు పడింది. గ్రామ, వార్డు సచివాలయాల కోసం ప్రత్యేకంగా పీఎంయూ కాల్ సెంటర్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించించారు. యంత్రాంగంలో ఎక్కడ దరఖాస్తు ఆగినా పీఎంయూ అప్రమత్తం చేయనుంది. నిర్దేశించిన సమయంలోగా పరిష్కారం అయ్యేలా పీఎంయూను ఏర్పాటు చేశారు. మొదటగా నాలుగు సర్వీసులు, అక్టోబర్ నుంచి 543కి పైగా సేవలను అమలు చేయనున్నారు. (బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం) సామాజిక తనిఖీ మార్గదర్శకాలను సీఎం విడుదల చేశారు. మారుమూల ప్రాంతాల్లో సచివాలయాలకు నెట్ సదుపాయాన్ని వైఎస్ జగన్ ప్రారంభించారు. ఇంటర్నెట్ లేని 512 సచివాలయాలను అనుసంధానం చేయనున్నారు. ఇందులో 213 సచివాలయాల్లో ఇప్పటికే ఏర్పాటు చేశారు. మిగిలిన సచివాలయాలను వచ్చే 2 నెలల్లో అనుసంధానిస్తామని అధికారులు తెలిపారు. అనంతరం గ్రామ, వార్డు సచివాలయాలపై సీఎం జగన్ సమగ్ర సమీక్ష నిర్వహించారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, గ్రామ, వార్డు సచివాలయాల ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వార్డు సచివాలయాల నిర్మాణంపై దృష్టి పెట్టాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో డిజిటల్ బోర్డులు ఏర్పాటుచేసి ప్రభుత్వం అమలు చేయనున్న పథకాలు, వాటి మార్గదర్శకాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. అర్బన్ హెల్త్ క్లినిక్స్‌పై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ‘‘గ్రామ,వార్డు సచివాలయాల్లో ఖాళీలకు సెప్టెంబరు లోగా పరీక్షల ప్రక్రియ ముగియాలి. ప్రభుత్వ కార్యక్రమాలపై గ్రామ సచివాలయ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలి. సచివాలయాల్లోని ఉద్యోగులకు, వాలంటీర్లకు ప్రభుత్వ పథకాల మీద పూర్తి అవగాహన ఉండాలి. గ్రామ, వార్డు సచివాలయాలు ద్వారా ఇళ్లపట్టాలు ఇచ్చేందుకు 90 రోజుల సమయం పెట్టుకున్నా.. ఒక నెలలో వచ్చిన దరఖాస్తులను అదే నెలలో పరిష్కరించుకుని యాక్షన్ ప్లాన్‌కు సన్నద్ధం కావాలని’’ సీఎం సూచించారు. నిర్ణీత సమయంలోగా దరఖాస్తు పరిష్కారం కాకపోతే కారణం ఏంటనేది ముఖ్యమంత్రి కార్యాలయానికీ రావాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ సెంటర్ల ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం అంగీకరించదని అధికారులు వెల్లడించారు. ల్యాండ్ రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనకు ఒక షెడ్యూల్ ప్రకటించి, ఈ షెడ్యూల్‌ను తనకు నివేదించాలని సీఎం ఆదేశించారు. ఆ గ్రామానికి సంబంధించిన రికార్డులు అదే గ్రామంలో ఉంటే సమస్యలు తగ్గుతాయని సీఎం పేర్కొన్నారు. -
నాయకుడి గమ్యం గ్రామ స్వరాజ్యం
-
పంచాయతీరాజ్ శాఖలో రివర్స్ టెండరింగ్ సక్సెస్
-
సచివాలయ పరీక్షలకు సర్వం సిద్ధం
సాక్షి, కడప : సార్వత్రిక ఎన్నికల తరహాలో గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలను నిర్వహించనున్నామని కలెక్టర్ హరి కిరణ్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పరీక్షల నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామన్నారు. అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపారు. సెప్టెంబరు 1 నుంచి 8వ తేది వరకు జరిగే ఈ పరీక్షల కోసం 419 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 1,44,337 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు. మొదటిరోజు 1,03,000 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని చెప్పారు. అధికారుల నియామకం పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు ఏడు వేల మంది సిబ్బందిని నియమించామని కలెక్టరు తెలిపారు. పరీక్షా హాలులో వీడియోగ్రాఫర్లు ఉంటారన్నారు. 1141 మంది వీడియో గ్రాఫర్లను నియమించాలన్నారు. మహిళా అభ్యర్థుల తనిఖీకి అంగన్వాడీ వర్కర్లను నియమించామన్నారు. అంధులు, రెండు చేతులు లేని వాళ్ల కోసం 86 మంది స్క్రైబ్స్‌ను నియమించామన్నారు. పదవ తరగతి పాసైన వారిని ఇందుకోసం వినియోగిస్తున్నామన్నారు. ఓఎంఆర్ షీట్లు, ప్రశ్నాపత్రాలను జిల్లా ట్రెజరీలో భద్రపరిచామన్నారు. శనివారం వీటిని సంబంధిత పోలీసుస్టేషన్లకు పంపుతున్నామన్నారు. పోలీసుస్టేషన్లో డబల్ లాక్ గదిలో వీటిని భద్రపరుస్తామన్నారు. ఒక తాళం చెవి తహసీల్దార్ వద్ద, మరొకటి ఎస్ఐ వద్ద ఉంటుందన్నారు. పోలీసుస్టేషన్లో సీసీ కెమెరాలను అమర్చారని తెలిపారు. వీటిని పర్యవేక్షించేందుకు కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఇందుకోసం 08562–244070 లేదా 244437 నెంబర్లు అందుబాటులో ఉంటాయన్నారు. విధి నిర్వహణలో అధికారులకు ఏవైనా సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూముకు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. ఉదయానికి ఓఎంఆర్ షీట్లు చేరవేత సెప్టెంబరు 1వ తేది ఉదయం 6.00 గంటలకు ఓపెన్‌చేసి ఓఎంఆర్ షీట్లు, ప్రశ్నాపత్రాలను గట్టి బందోబస్తు మధ్య పరీక్షా కేంద్రాలకు పంపుతామని హరికిరణ్ చెప్పారు. ఓఎంఆర్ షీట్లో బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్నతోనే రాయాల్సి ఉంటుందన్నారు. పరీక్ష ముగిసిన తర్వాత అధికారులు ఓఎంఆర్ షీట్ తీసుకుని అభ్యర్థికి కార్బన్ షీట్ ఇస్తారన్నారు. కీ విడుదల చేసి అభ్యంతరాలను స్వీకరిస్తామన్నారు. ఆ తర్వాత ఫైనల్ కీ, ఫలితాలు విడుదల అవుతాయని తెలిపారు. ఈ పరీక్షలో ఇంటర్వ్యూలు ఉండవని స్పష్టం చేశారు. మెరిట్ ఆధారంగానే ఎంపికలు జరుగుతాయన్నారు. డబ్బులు ఇస్తే ఉద్యోగాలు ఇప్పిస్తామని వచ్చే మధ్యవర్తుల మాటలను నమ్మవద్దన్నారు. అలాంటి వారు ఎవరైనా ఉంటే కలెక్టరేట్లోని హెల్ప్‌డెస్క్‌కు ఫోన్ చేసి తెలుపాలన్నారు. పరీక్షల్లో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం ఉండదని స్పష్టం చేశారు. ఫ్లయింగ్ స్వా్కడ్స్‌ను ఏర్పాటు చేశామని, అభ్యర్థులెవరూ మాల్ ప్రాక్టిసెస్‌కు పాల్పడరాదన్నారు. పరీక్ష ముగిసిన తర్వాత ఓఎంఆర్ షీట్లను జిల్లా పరిషత్‌లోని రిస్పెన్షన్ సెంటర్‌కు తీసుకు వస్తామన్నారు. ఏరోజుకు ఆరోజు వాటిని డీజీటీ వాహనాల్లో విజయవాడకు తరలిస్తామన్నారు. అభ్యర్థులకు సూచన పరీక్ష ప్రారంభానికి గంట ముందే అభ్యర్థులు తమతమ పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాలన్నారు. అభ్యర్థుల సౌలభ్యం కోసం ఆర్టీసీ 340 ప్రత్యేక బస్సులను నడుపుతోందన్నారు. అభ్యర్థులు ఎలక్ట్రానిక్ గాడ్జెస్ తీసుకు రాకూడదన్నారు. బాల్ పెన్ను, హాల్ టిక్కెట్, ఏదో ఒక ఐడీ ప్రూఫ్, ఒక రైటింగ్ ప్యాడ్ మాత్రమే తమ వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జేసీ గౌతమి, రెండవ జేసీ శివారెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్, డీఆర్వో రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు. పరీక్షల్లో జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలి సచివాలయ పరీక్షల్లో సిబ్బంది జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ హరి కిరణ్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సభా భవనం, మీ కోసం హాలులో పరీక్షలకు సంబంధించిన చీఫ్ సూపరింటెండెంట్లు, సెంటర్ స్పెషల్ ఆఫీసర్లకు ఏర్పాటు చేసిన మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఆయన సందర్శించారు. ఈ సందర్బంగా వివిధ అంశాలపై సూచనలు చేశారు. ఇతరుల సహాయంతో పరీక్ష రాసే అభ్యర్థుల కోసం పదవ తరగతి ఉత్తీర్ణులైన వారినే సహాయకులుగా నియమించాలన్నారు. ఇందుకోసం దరఖాస్తు చేసుకునే సమయంలోనే అభ్యర్థులు పేర్కొని ఉండాలన్నారు. అలాంటి వారికే స్క్రైబ్స్ ఇవ్వాలన్నారు. ఎక్కడైనా వీడియోగ్రాఫర్ల సమస్య ఎదురైతే పరీక్షల ప్రారంభానికి ముందే జాయింట్ కలెక్టర్ గౌతమితో సంప్రదించాలన్నారు. ఓఎంఆర్ షీట్లతోపాటు నామినల్ రోల్స్ పంపుతామన్నారు. ప్రతి కేంద్రానికి ఇన్విజిలేటర్లు, హాలు సూపరింటెండెంట్లు 20 శాతం అదనంగా కేటాయించామన్నారు. అనంతరం జిల్లా పరిషత్‌లో ఏర్పాటు చేసి రిసెప్షన్ సెంటర్‌ను కలెక్టర్ తనిఖీ చేశారు. జిల్లా వ్యాప్తంగా వచ్చే నెల(సెప్టెంబర్) ఒకటో తేదీన నిర్వహించే పంచాయతీ కార్యదర్శి గ్రేడ్–5 రాత పరీక్ష కీలకం కానుంది. నాలుగు పోస్టులకు గాను ఒకటే పరీక్ష కావడంతో.. ఎక్కువ సంఖ్యలో నిరుద్యోగులు వీటికి దరఖాస్తు చేసుకున్నారు. సాధారణ డిగ్రీ అర్హత కావడం కూడా ఎక్కువ దరఖాస్తులు రావడానికి మరో కారణమని చెప్పవచ్చు. కేటగిరీ–1లో పంచాయతీ కార్యదర్శి గ్రేడ్–5, మహిళా పోలీస్, సంక్షేమ కార్యదర్శి, వార్డు పరిపాలన కార్యదర్శి పోస్టులకు 70 వేలకు పైగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాల్లో పరీక్ష కేంద్రాలను కేటాయించారు. చిన్న పాటి మండల కేంద్రాల్లో సైతం కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీంతో వారి సౌలభ్యం కోసం వెబ్సైట్లో నో యువర్ వెన్యూ పేరిట ఒక ఆప్షన్ ఏర్పాటు చేశారు. నో యువర్ వెన్యూను క్లిక్ చేయగానే ఒక కొత్త విండో ఓపెన్ అవుతుంది. అందులో జిల్లాను సెలక్షన్లో కడపను ఎంచుకోవాలి. అప్పుడు జిల్లాలోని పరీక్షా కేంద్రాల కోడ్లు వస్తాయి. హాల్‌టికెట్‌లో ఉన్న వెన్యూ కోడ్‌ను ఎంపిక చేయగానే క్లిక్ చేయాలి అక్షాంశాలు, రేఖాంశాలతోపాటు పరీక్షా కేంద్రం ఫొటో వస్తుంది. దీంతోపాటు ఊరు, పరీక్షా కేంద్రం చిరునామా(అడ్రస్) కూడా చూడవచ్చు. అదే విండోలో చివరన క్లిక్ హియర్ అనే అప్షన్, పక్కనే వెన్యూ లొకోషన్ ఇన్ గూగూల్ మ్యాప్స్ అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే కొత్త విండోలో మ్యాప్ వస్తుంది. స్మార్ట్ ఫోన్ ఉన్న అభ్యర్థులు లొకేషన్‌ను చూసుకుని డైరెక్షన్స్‌ను సెట్ చేసుకుని కేంద్రాలకు వెళ్లవచ్చు. మ్యాప్‌ను సైతం ఇతర ఫోన్ నంబరు, మెయిల్‌కు కూడా పంపుకునే అవకాశం కల్పించారు. గూగుల్ మ్యాప్స్‌తో సులువుగా కేంద్రాన్ని చేరుకునేలా ఈ ఏర్పాటు చేశారు. సూచనలు పరీక్షా రాసే అభ్యర్థులు ప్రభుత్వం చెప్పిన సూచనలు పాటించాల్సిన అవసరం చాలా ఉంది. పరీక్షలు రోజూ ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 2.30కు ప్రారంభం అవుతాయి. అభ్యర్థి కనీసం గంట ముందుగా కేంద్రానికి చేరితే మంచిది. పరీక్షా కేంద్రంలోకి ఉదయం 9.30, మధ్యాహ్నం 2 గంటల తరువాత మాత్రమే అభ్యర్థులు ప్రవేశించేందుకు అధికారులు అవకాశం కల్పిస్తారు. ఉదయం 10, మధ్యాహ్నం 2.30 గంటల తరువాత నిమిషం ఆలస్యమైనా పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించరు. హాల్‌టికెట్‌తోపాటు కనీసం ఒక ఫొటో ఐడెంటిటీ కార్డును వెంట తెచ్చుకోవాలి. పాస్‌పోర్టు, పాన్‌కార్డు, ఓటర్ ఐడీ, ఆధార్‌కార్డు, ప్రభుత్వ ఉద్యోగైతే గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్‌లను గుర్తింపు కార్డుగా తెచ్చుకోవచ్చు. హాల్‌టికెట్‌లో ఫొటో లేకపోయినా, సరిగా కనిపించకపోతే అటువంటి అభ్యర్థులు మూడు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలను గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించి తెచ్చుకుని ఇన్విజిలేటర్‌కు అందజేయాలి. ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తెచ్చుకోకూడదు. మొబైల్/సెల్‌ఫోన్, కాలిక్యులేటర్స్, ట్యాట్స్, బ్లూటూత్, పేజర్స్ వంటి పరికరాలను కేంద్రంలోకి అనుమతించరు. ప్రశ్నాపత్రాన్ని తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో ఇస్తారు. పరీక్షా సమయం 150 నిమిషాలు. పరీక్షా పత్రాన్ని జాగ్రత్తగా చదువుకోవాలి. తదుపరి సరైన సమాధానాన్ని ఎంచుకుని ఓఎమ్మార్ షీట్లో బబుల్ చేయాలి. ఇందుకోసం బాల్ పాయింట్ పెన్ బ్లూ/బ్లాక్ మాత్రమే వినియోగించాలి. పెన్సిల్, ఇంక్‌పెన్, జెల్ పెన్ వినియోగిస్తే జవాబుపత్రాన్ని ఇన్వ్యాలిగ్గా పరిగణిస్తారు. ఓఎమ్మార్ షీట్లో వైటనర్, ఇతర మార్కర్లను వినియోగిస్తే డిస్‌క్యాలిఫై చేస్తారు. ఓఎమ్మార్ షీట్లు రెండు ఉంటాయి. పై షీట్లో జవాబులను నమోదు చేయాలి. రెండో షీట్‌ను పరీక్ష అనంతరం అభ్యర్థి తెచ్చుకోవచ్చు. తమ సమాధానాలను చూసుకునే అవకాశం కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశం. మరిన్ని వివరాల కోసం గ్రామసచివాలయం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌ను సందర్శించి తెలుసుకోవచ్చు. నెగిటివ్ మార్కులున్నాయ్.. జాగ్రత్త ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయ పోస్టులకు నిర్వహిస్తున్న పరీక్షల్లో నెగిటివ్ మార్కుల పద్ధతి పెట్టారు. సరైన సమాధానానికి ఒక మార్కు ఇస్తారు. అదే తప్పుగా సమాధానం రాస్తే 0.25 (1/4) మార్కును ఫెనాల్టీగా వేస్తారు. హాల్‌టికెట్ల వివరాలు ఇలా... ఈ నెల 24 నుంచే కేటగిరి–1 పరీక్షకు సంబంధించిన హాల్‌టకెట్లను వెబ్సైట్లో ఉంచారు. అభ్యర్థులు పుట్టిన రోజుతోపాటు దరఖాస్తు సమయంలో వచ్చిన ఒన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ నంబరు (ఓటీపీఆర్), దరఖాస్తు ఐడీ, ఆధార్ నంబర్లలో ఏదైనా ఒకటి ఎంటర్ చేసి పొందవచ్చు. ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు ఉన్న నేపథ్యంలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. జిల్లా వ్యాప్తంగా 134 బస్సు సర్వీసులను ఆర్టీసీ అధికారులు నడుపుతున్నారు. ఇందులో కడప డిపో నుంచి 16, బద్వేలు 13, రాయచోటి 25, రాజంపేట 18, జమ్మలమడుగు 15, మైదుకూరు 14, ప్రొద్దుటూరు 17, పులివెందుల డిపో నుంచి 13 ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు. దీంతో పాటు అభ్యర్థుల సౌలభ్యం కోసం ఆర్టీసీ హెల్ప్లైన్లను సైతం నిర్వహిస్తోంది. సెప్టెంబరు ఒకటో తేదీ ఉదయం ఆరు గంటల నుంచి ప్రత్యేక సర్వీసులు ప్రారంభమవుతాయి. -
సచివాలయ పోస్టుల రాత పరీక్షలపై దృష్టి
సాక్షి, కర్నూలు(అగ్రికల్చర్): వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించిన ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేస్తుండడంతో అందుకు సంబంధించిన రాత పరీక్షల నిర్వహణపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఒక్కో సచివాలయంలో 11 రకాల పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ పోస్టులకు జిల్లా నుంచి సుమారు 2.50 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటారని అంచనాకు వచ్చిన రెవెన్యూ యంత్రాంగం.. అందుకు తగ్గట్టు రాత పరీక్ష కేంద్రాలను గుర్తించే పనిలో పడింది. 2.50 లక్షల మంది అభ్యర్థులకు కనీసం 1,250 సెంటర్లు అవసరమవుతాయని భావిస్తున్నారు. ఈ మేరకు సెంటర్లు గుర్తించి సోమవారం సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని కలెక్టర్ వీరపాండియన్ అన్ని మండలాల తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నివేదికలను రాష్ట్ర భూపరిపాలన శాఖ ముఖ్య కమిషనర్‌కు పంపి.. ఆమోదం లభించిన వెంటనే పరీక్ష నిర్వహణకు తేదీలు ఖరారవుతాయని అధికార వర్గాలు తెలిపాయి. వీఆర్వో పోస్టుల భర్తీకి కసరత్తు గ్రామ సచివాలయాల్లో రెవెన్యూ శాఖ నుంచి గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో) నియామకానికి అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. మొత్తం మంజూరు (శాంక్షన్) అయిన పోస్టులు ఎన్ని? ఎంతమంది పనిచేస్తున్నారు? వీఆర్ఏలకు పదోన్నతి కల్పించడం ద్వారా ఎన్ని పోస్టులు భర్తీ చేయాలి? రాత పరీక్ష ద్వారా ఎన్ని భర్తీ చేయాలనే దానిపై రెవెన్యూ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. జిల్లాలో అర్బన్ ప్రాంతాలకు 46, గ్రామీణ ప్రాంతాలకు 746.. మొత్తం 792 పోస్టులు మంజూరయ్యాయి. ఇందులో ప్రస్తుతం అర్బన్‌లో 43 మంది, గ్రామీణ ప్రాంతాల్లో 648 మంది.. మొత్తం 691 మంది వీఆర్వోలు పనిచేస్తున్నారు. 101 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 27 పోస్టులను వీఆర్ఏలకు పదోన్నతులు ఇవ్వడం ద్వారా భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇందుకోసం అర్హత కలిగిన వీఆర్ఏలను గుర్తిస్తున్నారు. మిగిలిన 74 వీఆర్వో పోస్టులను రాత పరీక్ష ద్వారా భర్తీ చేసేందుకు రెవెన్యూ శాఖ సిద్ధమవుతోంది. కాగా.. గ్రామీణ ప్రాంతాల్లోనే 879 సచివాలయాలు ఏర్పాటు కానున్నాయి. చిన్న సచివాలయాలు రెండింటికి కలిపి ఒక వీఆర్వోను నియమించే దిశగా కసరత్తు సాగుతోంది. -
ఇక గ్రామ పంచాయతీల వ్యవస్థ
సాక్షి, ఒంగోలు టూటౌన్: రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో గ్రామ పంచాయతీలు సచివాలయాలుగా రూపాం తరం చెందనున్నాయి. 70 ఏళ్ల క్రితం మహాత్మాగాంధీ కన్న కలలు నేడు సాకారం కాబోతున్నాయి. స్థానిక ప్రభుత్వాలతోనే పల్లెలు అభివృద్ధి చెందుతాయన్న బాపూజీ ఆలోచన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో నెరవేరబోతోంది. పంచాయతీలకే అధికారాలు అప్పగిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోవడం నేడు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి తీసుకోని నిర్ణయాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకోని పరిపాలనలో నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. గ్రామ పంచాయతీలకు బదలాయించిన 29 రకాల అధికారాలను పంచాయతీలే నిర్వహించుకునేలా గ్రామ సచివాలయ వ్యవస్థను తెరపైకి తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు శుక్రవారం సాయంత్రం పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తరుŠువ్ల జారీ చేశారు. పనిలో పనిగా గ్రామ సచివాలయాల ఏర్పాటు, వాటి నిర్వహణకు సంబంధించిన విధి, విధానాలను కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సచివాలయంలోనే పాలన... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరహాలోనే గ్రామ పంచాయతీల్లోనూ స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రభుత్వం ఏర్పాటు కావాలనే లక్ష్యంతో 1994 లో పార్లమెంట్లో అప్పటి కేంద్ర ప్రభుత్వం 73వ రాజ్యాంగ సవరణ చేశారు. దీనికి అనుగుణంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆధీనంలో ఉన్న 13 శాఖలకు చెందిన 29 రకాల అధికారాలను స్థానిక పంచాయతీలకు బదలాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకోవడంతోపాటు 2007లోనే ఉత్తరుŠువ్ల కూడా జారీ చేశారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వం కూడా స్థానిక పాలనను అమలు చేసిన దాఖలాలు లేవు. స్థానిక పాలనను అమలు చేయాలని కోరుతూ అప్పట్లో సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో పలు పోరాటాలు, ఆందోళనలు చేసినా ఫలితం లేకుండా పోయింది. పరిపాలనలో నూతన ఒరవడితోపాటు పేదల ఇంటివద్దకే సేవలు అనే నినాదంతో తొలి అడుగులేసిన సీఎం వెంటనే గ్రామ వాలంటీర్ల నియామకం చేపట్టారు. ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీర్‌ని నియమించి ప్రజల వద్దకే సత్వర సేవలు అనే విధానాన్ని అమలు చేయబోతున్నారు. ఈ గ్రామ వలంటీర్లకు మొత్తం 56, 809 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 24వ తేదీ వరకు ఎంపిక ప్రక్రియ నిర్వహించన్నారు. ప్రస్తుతం కొన్ని మండలాల్లో ఎంపిక జాబితా కూడా పూర్తయ్యాయి. రెవెన్యూ గ్రామాల్లో సచివాలయాల ఏర్పాటు... జిల్లాలో 56 మండలాలు ఉండగా ఒంగోలు, కందుకూరు, మార్కాపురం డివిజన్లుగా పరిపాలన సాగుతోంది. వీటి పరిధిలో 1038 గ్రామపంచాయతీలు ఉన్నాయి. వీటిలో మేజర్ పంచాయతీలు, మైనర్ పంచాయతీలు ఉన్నాయి. జిల్లా మొత్తం మీద 33 లక్షల జనాభా ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం గ్రామ సచివాలయం ఏర్పాటు చేయాలంటే జనాభా సంఖ్య ఆధారంగా చేయాల్సి ఉంది. రెండు వేలు జనాభా నుంచి నాలుగు వేల జనాభా మధ్య ఉండే గ్రామపంచాయతీలో ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు చేయాలని ఉత్తర్వుŠోల్ల పేర్కొన్నారు. వెయ్యి, పదిహేను వందలు, ఐదొందలు జనాభా కలిగిన గ్రామపంచాయతీలను ఒకటిగా చేసి ఒక గ్రామ సచివాలయంగా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో రెండు వేల కంటే తక్కువ జనాభా ఉన్నా ఒక గ్రామ సచివాలయం ఏర్పాటుకు వీలు కల్పించారు. పైగా రెవెన్యూ గ్రామంలోనే వీలున్నంత వరకు గ్రామ సచివాలయం ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలా జిల్లాలో 732 గ్రామ సచివాలయాలను గుర్తించారు. అయితే ప్రభుత్వం మళ్లీ ప్రస్తుతం ఉన్న గ్రామ సచివాలయాలను 912 గ్రామ సచివాలయాలకు ఎందుకు పెంచకూడదు అంటూ జిల్లా పంచాయతీ అధికారులకు ఉత్తరుŠువ్ల జారీ చేసింది. రెవెన్యూ విలేజ్‌కి గ్రామ పంచాయతీకి అనుసంధానం చేస్తూ గ్రామ సచివాలయాలను పెంచేందుకు చర్యలు చేపట్టాలని సీసీఎల్ఏ జాయింట్ సెక్రటరీ శారద ఆదేశాలు జారీ చేశారు. ప్రతిపాదనలు పూర్తి చేసి రెండు రోజుల్లో ప్రభుత్వానికి పంపాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో అధికారులు మళ్లీ అటు వైపు కసరత్తు మొదలెట్టారు. దీంతో మళ్లీ జిల్లాలో గ్రామ సచివాలయాలు మళ్లీ పెరిగే అవకాశం ఉంది. గ్రామ సచివాలయంలో ఉద్యోగాల నియామకం: గ్రామ వాలంటీర్ల నియామకమే కాకుండా కొత్తగా ఏర్పాటయ్యే సచివాలయంలో వివిధ శాఖల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. డిగ్రీ అర్హతగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. మొత్తం 91,652 ఉద్యోగాలు ఇవ్వాలనేది లక్ష్యం. ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా, వ్యయ ప్రయాసలు పడకుండా గ్రామ స్థాయిలోనే ప్రజల సమస్యలను తీర్చేందుకు సీఎం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్హం వ్యక్తమవుతోంది. అక్టోబర్ 2 నుంచి ఈ విధానం రాష్ట్రమంతటా ఒకే సారి అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సచివాలయ కన్వీనర్‌గా సెక్రటరీ: గ్రామ సచివాలయంలో పనిచేసే ఉద్యోగులకు గ్రామ కార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరిస్తారని ప్రభుత్వం శనివారం విడుదల చేసిన ఉత్తర్వుŠోల్ల పేర్కొన్నారు. జీతాల చెల్లింపు కూడా కార్యదర్శి ద్వారానే నిర్వహిస్తారు. అయితే కార్యదర్శితో పాటు గ్రామ సచివాలయంలో పనిచేసే ఉద్యోగులందరికీ సెలవుల మంజూరు చేసే అధికారం సర్పంచ్‌కి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. -
సచివాలయం కొలువులకు 22న నోటిఫికేషన్
సాక్షి, చిత్తూరు అర్బన్: ప్రభుత్వ ఉద్యోగాలంటే జిల్లా స్థాయిలో పోలీస్.. టీచర్ తప్ప మరే మాట వినిపించని పరిస్థితి. అది కూడా ఏ మూడేళ్లకోసారో.. అయిదేళ్లకోమారో నోటిఫికేషన్లు ఇచ్చే పరిస్థితి. కానీ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లోని నిరుద్యోగుల కోసం వార్డు సచివాలయాలను తీసుకొస్తోంది. ఈ నెల 22వ తేదీ విడుదలకానున్న నోటిఫికేషన్లో జిల్లాలోని 300కు పైగా సచివాలయాల్లో 3 వేలకు పైగా కొలువులకు సంబంధించి వివరాలు వెల్లడికానున్నాయి. జీవో విడుదల జిల్లాలో ఆరు మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లలో వార్డు సచివాలయాలకు సంబంధించి మరో రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కానుంది. వార్డు సచివాలయాల్లో కల్పించనున్న ప్రభుత్వ ఉద్యోగాలు, విధి విధానాలు, ఏయే పోస్టులు అనే వివరాలను సూత్రప్రాయంగా తెలియచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం జీఓ–201ను విడుదల చేసింది. ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేసిన సమయంలో ఇచ్చిన నవరత్నాల హామీలను పక్కాగా నెరవేర్చడంతో పాటు పరిపాలనను ప్రజల ముందే కొనసాగించడానికి వార్డు సచివాలయాలను ఏర్పాటు చేస్తామన్న మాటను నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రి అయ్యాక వైఎస్ జగన్మోహన్రెడ్డి భారీగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టారు. దీని ద్వారా జిల్లాలోని నిరుద్యోగుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. 4 వేల జనాభాకు ఓ సచివాలయం పట్టణ ప్రాంతాల్లో ఉన్న జనాభా ఆధారంగా వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి 4 వేల జనాభా ఉన్న ప్రాంతాన్ని ఓ వార్డు సచివాలయంగా పరిగణిస్తారు. ఇలా జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఉన్న ప్రతి 4 వేల జనాభాకూ ఒకటి ఏర్పడుతుంది. ఈలెక్కన జిల్లాలో 300లకు పైగా వార్డు సచివాలయాలు ఏర్పా టుకానున్నాయి. ప్రతి సచివాలయానికీ పది ప్రభుత్వ ఉద్యోగాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో జిల్లాలో మూడువేలకు పైగా ఉద్యోగాలు రానున్నాయి. డిగ్రీ అర్హతతో.. వార్డు సచివాలయాల్లో దాదాపు అన్ని పోస్టులకు డిగ్రీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ డిప్లొమాను విద్యార్హతగా నిర్ణయించారు. వార్డు పరిపాలన కార్యదర్శి (డిగ్రీ), మౌలిక వసతుల కార్యదర్శి (పాటిటెక్నిక్, సివిల్ ఇంజినీరింగ్), పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శి (డిగ్రీతో సైన్స్/ఇంజినీరింగ్), విద్యా కార్యదర్శి (డిగ్రీ), ప్రణాళిక కార్యదర్శి (డిప్లొమో అర్బన్ ప్లానింగ్/ సివిల్ ఇంజినీరింగ్), సంక్షేమ కార్యదర్శి (డిగ్రీతో సామాజిక సేవ/సోషియాలజీ/ఆంత్రోపాలజీ), ఇంధన కార్యదర్శి (ఎలక్ట్రికల్స్‌లో డిప్లొమో), ఆరోగ్య కార్యదర్శి (నర్సింగ్/ఫార్మా–డీ), రెవెన్యూ కార్యదర్శి (డిగ్రీ), మహిళా కార్యదర్శి (డిగ్రీ) పోస్టులను మంజూరు చేస్తూ వాటికి ఉండాల్సిన విద్యార్హతలను సైతం జీవోలో పేర్కొన్నారు. పోస్టుల భర్తీ షెడ్యూల్ ఈనెల 22వ తేదీ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఆగస్టు 5వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. రాత పరీక్షలను ఆగస్టు 16 నుంచి సెప్టెంబరు 15వ తేదీ వరకు నిర్వహిస్తారు. సెప్టెంబరు 20వ తేదీకి ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందచేసి, అదేనెల 23వ తేదీ నుంచి 28 వరకు శిక్షణ ఇచ్చి, 30వ తేదీ విధులను కేటాయిస్తారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి విధుల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. -
రాష్ట్రంలో కొత్తగా 34,350 ఉద్యోగాల భర్తీ
అమరావతి: గ్రామ సచివాలయాల తరహాలోనే పట్టణ ప్రాంతాల్లోనూ వార్డు సచివాలయాల ఏర్పాటుకు విధివిధానాలను ఖరారు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 3,775 వార్డు సచివాలయాల ఏర్పాటుకు పురపాలక శాఖ ఆదేశాలు ఇచ్చింది. ప్రతి నాలుగు వేల మంది జనాభాకూ ఓ వార్డు సచివాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక్కో సచివాలయంలో 10మంది ఉద్యోగులను నియమించేలా విధివిధానాల్ని రూపొందించారు. ఫలితంగా వార్డు సచివాలయాల్లో కొత్తగా 34,350 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. వార్డు సచివాలయాల ద్వారా అర్హులైన లబ్ధిదారులందరికీ నేరుగా ప్రభుత్వ సేవలు అందించాలని ఆదేశించింది. దాంతోపాటు వార్షిక అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన, ప్రభుత్వ పథకాలను వంద శాతం మేరకు అమలు చేయడమే లక్ష్యం అని పేర్కొంది. ఈ వార్డు వాలంటీర్ల ద్వారా ప్రతీ 50 నుంచి 100 మంది పౌరులకు సంబంధించిన అంశాల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలంది. పన్నుల వసూలు, పరిశుభ్రత, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల అమలును పర్యవేక్షించాలని సూచించింది. పురపాలికలు, నగరపాలికల్లోని వార్డు కార్యాలయం, అంగన్ వాడీ భవనం, పాఠశాల, ఇతర ప్రభుత్వ భవనాల్లో వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దాంతోపాటు వార్డు పాలనా కార్యదర్శి, మౌలిక సదుపాయాల కార్యదర్శి, సానిటేషన్, విద్య, వార్డు ప్రణాళిక, సంక్షేమాభివృద్ధి, విద్యుత్, ఆరోగ్యం, రెవెన్యూ, వెనుకబడిన వర్గాల రక్షణ కార్యదర్శులుగా 10 మందిని నియమించాలని నిర్ణయించింది. జూలై 22వ తేదీన నియామకాల నోటిఫికేషన్ చేపట్టి.. ఆగస్టు 16వ తేదీ నుంచి సెప్టెంబరు 15వ లోగా నియామకాలను పూర్తి చేయనున్నారు. అక్టోబరు రెండో తేదీ నుంచి గ్రామ సచివాలయాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో వార్డు సచివాలయాలు పనిచేయనున్నాయి. -
గ్రామ సచివాలయ ఉద్యోగాలోచ్..!
సాక్షి, నెల్లూరు(పొగతోట): అమ్మఒడి మొదలు..ఆశ కార్యకర్తలు..మధ్యాహ్న భోజన కార్యకర్తలు..మున్సిపల్ కార్మికులు..హోంగార్డులు..అన్నదాతలకు ఇలా అన్ని వర్గాలకు నెలరోజుల్లో వరాలు కురిపించిన సీఎం జగన్మోహన్రెడ్డి నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు చేరడానికి, నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలా గ్రామ వలంటీర్ల పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు గ్రామ సచివాలయ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది. గ్రామ సచివాలయ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం జగన్మోహన్రెడ్డి. ఇందుకు సంబంధించి ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ విడుదలచేయనుంది. ఇందుకు సంబంధించి జిల్లా యంత్రాంగం సన్నద్ధమలవుతోంది. సీఎం తీసుకున్న నిర్ణయంతో జిల్లాలో 10,340 మంది నిరుద్యోగులకు గ్రామ సచివాలయ పోస్టులు దక్కనున్నాయి. మున్సిపాలిటీల్లోనూ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.ఈ నిర్ణయంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అక్టోబర్ 2వ తేదీ నుంచి గ్రామ సచివాలయాలు పని చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ లోగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడం దరఖాస్తుల స్వీకరణ, ఇంటర్వ్యూల నిర్వహణ పూర్తి చేసి అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. నూతన సీఎం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేస్తున్నారని నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని నిరుద్యోగులు, ప్రజలు సీఎంను అభినందిస్తున్నారు. ఇచ్చిన హామీలను రోజుల వ్యవధిలోనే అమలు చేస్తున్న సీఎంను ప్రస్తుతం చూస్తున్నామని ప్రజలు, నిరుద్యోగులు అంటున్నారు. గ్రామ వలంటీర్ల ఎంపిక ప్రక్రియ పూర్తి కావచ్చింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో మెరిట్ ఉన్న వారికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రచురించి వారికి శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన రోజే నిరుద్యోగులకు శుభవార్త ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంపై నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకు నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతోంది. గత ప్రభుత్వం ఇంటికోక ఉద్యోగం కల్పిస్తామని నిరుద్యోగులను మోసం చేసి ఐదేళ్లు అధికారాన్ని దక్కించుకుంది. టీడీపీ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో విఫలమైంది. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంది. ఉద్యోగాలు కల్పించకపోతే నెలకు రూ.2వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని 2014 ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు ప్రకటించాడు. నాలుగున్నర సంవత్సరాలు కాలయాపన చేసిన చంద్రబాబుకు 2019 ఎన్నికల ముందు నిరుద్యోగులు గుర్తుకొచ్చారు. ఆగమేఘాల మీద నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ప్రకటించి చతికలపడ్డారు. నాలుగున్నర సంవత్సరాలు ఆటలాడుకున్నందుకు 2019 సార్వత్రిక ఎన్నికల్లో నిరుద్యోగులు టీడీపీకి బుద్ధిచెప్పారు. నూతన ముఖ్యమంత్రి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేలా జీఓ విడుదల చేశారు. జిల్లాలో 80 వేల మందికిపైగా నిరుద్యోగులు ఉన్నారు. జిల్లాలో 940 పంచాయతీలు ఉన్నాయి. ప్రతీ పంచాయతీలో 11 మందితో గ్రామ సచివాలయ పోస్టులు భర్తీ చేయనున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లో మంజూరు చేసేలా రూపకల్పన చేస్తున్నారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరగకుండా గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. దరఖాస్తులను సంబంధిత శాఖ అధికారులకు ఆన్లైన్ ద్వారా పంపించి అర్హులైన లబ్ధిదారులకు 72 గంటల్లో పథకాలు అందేలా సిస్టమ్‌ను ప్రభుత్వం రూపకల్పన చేస్తుంది. టీడీపీ ప్రభుత్వంలో పింఛన్లు, రేషన్‌కార్డులు, నివేశన స్థలాలు, ఇళ్ల కోసం ప్రజలు తహశీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేయాల్సి వచ్చేది. జన్మభూమి కమిటీలు సంతకం చేసిన వారికి మాత్రమే నెలల సమయంలో రేషన్‌కార్డులు, పింఛన్లు మంజూరు చేసే వారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నియమించనున్న గ్రామ సచివాలయ పోస్టుల ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయనున్నారు. ప్రజలు మండల కేంద్రానికి పోకుండా రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాల కోసం గ్రామంలో అందుబాటులో ఉండే గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే చాలు. దరఖాస్తులు చేసుకున్న 72 గంటల్లో అర్హులకు సంక్షేమ పథకాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం మంజూరు చేయనుంది. గ్రామ సచివాలయాలతో ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేయాల్సిన పరిస్థితి ఉండదు. ప్రజలకు సమయం మిగులుతుంది. ఖర్చు ఉండదు. అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందుతాయి. -
వలంటీర్లే వారధులు
గ్రామసచివాలయం వ్యవస్థ వలంటీర్ల నియామకాలు పూర్తి కాగానే వెంటనే గ్రామ సచివాలయ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. జిల్లాలో 1038 పంచాయతీల్లో ఒకే గ్రామంలో సచివాలయాలు 447, రెండు, మూడు పంచాయతీలు కలిసినవి 289 రానున్నాయి. ఇందులో మహిళా పోలీసు అధికారి సేవలు అందుబాటులో ఉంటాయి. వ్యవస్థ రూపకల్పన జరుగుతోంది. వలంటీర్ల వ్యవస్థ దీనికి అనుసంధానంగా ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వలంటీర్ల వ్యవస్థ వారధి కానుంది. దీనిలో భాగంగా గ్రామ వలంటీర్ల వ్యవస్థ త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు క్షేత్ర స్థాయిలో పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ప్రభుత్వం ఈ వ్యవస్థను ప్రజలకు చేరువ చేసి మెరుగైన సేవలను అందించాలని భావిస్తోంది. సంక్షేమ పథకాలను ప్రజల ముంగిటకు చేర్చేందుకు దీనిని బలోపేతం చేయనున్నారు. జగన్ నవరత్నాలు, ప్రభుత్వ ఇతర సంక్షేమ పథకాలు, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను అవినీతికి తావులేకుండా లబ్ధిదారులకు నేరుగా చేరవేయడంలో వలంటీర్లు కీలకం కానున్నారు. వలంటీర్ల నియామకాలు పూర్తి కాగానే వెంటనే గ్రామ సచివాలయ వ్య వస్థ అందుబాటులోకి రానుంది. దీని రూపకల్పన జరుగుతోంది. వలంటీర్ల వ్యవస్థ దీనికి అనుసంధానంగా ఉంటుందని అధికారులు చెప్తున్నారు. సాక్షి, ఒంగోలు సిటీ: గ్రామ, వార్డులతో పాటు పట్టణ, నగరాల్లోని డివిజన్లలోనూ వలంటీర్ల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే గ్రామ వలంటీర్ల పోస్టులకు ఆన్లైన్లో ధరఖాస్తులను స్వీకరించారు. వలంటీర్ల నియామకాలకు దరఖాస్తులను గత నెల 27వ తేదీ నుంచి స్వీకరించారు. మొదట ప్రకటించిన విధంగా గ్రామ వలంటీర్లకు ఈనెల 5వ తేదీతో గడువు ముగిసింది. సవరించిన ఉత్తర్వుల ప్రకారం పట్టణాల్లో వార్డు వలంటీర్లకు మాత్రం గడువుతేదీని ఈనెల 10వ తేదీ వరకూ పొడించారు. ఇక పరిశీలనకు అధికారులు పూనుకున్నారు. దరఖాస్తులను పరిశీలించి, అభ్యర్థులతో ముఖాముఖి నిర్వహించి వెంటనే నియామకాలను చేపట్టడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ శనివారం జిల్లా అధికారులతో సమావేశాన్ని నిర్వహించి వారికి తగిన సూచనలు, ఆదేశాలను ఇచ్చారు. జిల్లాలో 56 మండలాల పరిధిలో 1038 పంచాయతీలు ఉన్నాయి. 35 అటవీ గ్రామాలున్నాయి. ఒంగోలు కార్పొరేషన్‌తో పాటు ఎనిమిది మున్సిపాలిటీలు, నగర పంచాయతీలున్నాయి. జిల్లాలో సుమారు 58 వేల వరకు నిరుద్యోగులున్నట్లు అంచనా. గ్రామ వలంటీర్లకు జిల్లాలో మొత్తం 56,133 మంది గడువు ముగిసే నాటికి దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 44,389 దరఖాస్తులను పరిశీలించి 41,965 అనుమతించారు. 2424 తిరస్కరించారు. ఇంకా 11,744 దరఖాస్తులు పరిశీ లనలో ఉన్నాయి. తిరస్కరించిన దరఖాస్తుదారులు మళ్లీ సవరించుకునేందుకు ఈనెల 8వ తేదీ వరకూ అవకావం కల్పించారు. ఈనెల 11 నుంచి 25వ తేదీ వరకు ఇంటర్వ్యూలను నిర్వహించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆగస్టు 1వ తేదీ నాటికి ఎంపికైన అభ్యర్ధుల వివరాలను ప్రకటించే అవకాశం ఉంది. ఎంపిక విధి విధానాలు గ్రామ వలంటీర్లలో 50 శాతం పోస్టులు మహిళలకే కేటాయించారు. వలంటీర్లకు గౌరవ వేతనంగా నెలకు రూ. 5 వేలు చెల్లిస్తారు. గిరిజన ఏజెన్సీల్లోని వారికి మాత్రం విద్యార్హత పదోతరగతికి అవకాశం కల్పించారు. ► పట్టణాల్లో ప్రతి వంద కుటుంబాలకు ఒక వార్డు వలంటీరును నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని ఒంగోలు నగర పాలక సంస్థతో పాటు మార్కాపురం, కందుకూరు, చీరాల మున్సిపాలిటీలతో పాటు గిద్దలూరు, కనిగిరి, చీమకుర్తి, అద్దంకి నగర పంచాతీల్లోని వార్డుల్లో వలంటీర్లను నియమించనున్నారు. కలెక్టర్ పర్యవేక్షణలో ఒక్కొ పురపాలక నగర పాలక సంస్థకు ఎందరు అవసరమో కమిషనర్లు నిర్ణయించారు. ఈ జాబితా జిల్లా కేంద్రానికి చేరింది. పట్టణ, స్థానిక సంస్థల స్థాయిలో ఎంపిక కమిటీ ఇంటర్వ్యూలను నిర్వహించనుంది. ఈ కమిటీలో మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దారు, మెప్మా పీడీ ఉంటారు. పట్టణాన్ని యూనిట్‌గా తీసుకొని రిజర్వేషన్ అమలు చేస్తారు. ► జిల్లాలో 2424 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. దరఖాస్తు పూరించడంలో దొర్లిన తప్పిదాలు కారణంగా ఇప్పటి వరకు వీటిని తిరస్కరించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తిరిగి సరిగా నింపి సమర్పించే అవకాశం ఈనెల 8వ తేదీ వరకూ కల్పించారు. ► తొలి దశలో దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. గ్రామాల్లో ఎంపీడీఓ, తహశీల్దార్, ఈఓపీఆర్డీలతో కూడిన ఎంపిక కమిటీ అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహించనుంది. ► ఈ నేపథ్యంలో నవరత్నాలు, ప్రభుత్వ పథకాలు, ప్రజోపయోగమైన కార్యక్రమాలు, సంక్షేమ పథకాల పట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి. ఈ పథకాల ద్వారా ప్రజలకు జరుగుతున్న మేలు విశ్లేషించగలిగి ఉండాలి. సామాజిక ప్రభావాన్ని అంచనా వేయగలి ఉండాలి. ఇంటర్వ్యూలో అభ్యర్థులకు ఇటువంటి ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉంది. వీటిపై గణాంకాలు ఉదాహరణలతో వివరించాలి. వలంటీర్ల పనితీరు సంతృప్తిగా లేకుంటే తొలగిస్తారు. ప్రభుత్వం అప్పగించిన సర్వేలు చేయాలి. ప్రజల అవసరాలు, వారి సమస్యలు తెలుసుకోవాలి. ప్రజా సమస్యలు, వినతులు పరిష్కారానికి ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయం చేయాలి. వలంటీర్ల ఎంపిక పారదర్శకంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ఒంగోలు అర్బన్: జిల్లాలో గ్రామ వలంటీర్ల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అధికారులను ఆదేశించారు. శనివారం ప్రకాశం భవనంలోని కంట్రోలు రూములో గ్రామ పంచాయతీ వలంటీర్ల ఎంపిక కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మున్సిపల్ కమిషనర్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వం ద్వారా అందించే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసేందుకు వలంటీర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వలంటీర్ల దరఖాస్తులను ఈనెల 9వ తేదీనాటికి కమిషనర్లు, ఎంపీడీఓలు పరిశీలన పూర్తి చేయాలన్నారు. అనంతరం ఈనెల 11వ తేదీ నుంచి 25వ తేదీ వరకు అభ్యర్థులకు మౌఖిక పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎంపికైన వారి వివరాలను ఆగస్టు 1వ తేదీ తెలియచేయడం జరుగుతుందన్నారు. ఎంపికైన వారికి ఆగస్టు 5 నుంచి 10వ తేదీ వరకు శిక్షణ తరగతులు జరుగుతాయన్నారు. ఆగస్టు 15 నుంచి వలంటీర్ల విధులు ప్రారంభమవుతాయన్నారు. -
జీతాలు బ్రేక్.. వేధింపుల షాక్!
సాక్షి, సచివాలయం (తుళ్లూరు రూరల్) : సభాపతి, రాష్ట్ర మంత్రులు, పెద్ద సంఖ్యలో ఐఏఎస్ అధికారులు ఉండే సచివాలయంలో మహిళా కార్మికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ‘మాకు అన్యాయం జరుగుతోందని ప్రశ్నిస్తే ఇబ్బందులకు గురిచేస్తున్నా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం’ అంటూ తాత్కాలిక సచివాలయం ‘సాక్షి’గా మహిళా కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని రెండు రోజుల క్రితం నిరసన వ్యక్తం చేసిన సచివాలయంలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేసే 170 మంది మహిళా కార్మికులను శుక్రవారం ‘సాక్షి’ పలుకరించింది. వారు తమ ఆవేదనను వెళ్లబోసుకున్నారు. గతంలో ఎన్నో సార్లు వేతనాల విషయంలో ఆలస్యం చేస్తుంటే, ఇదేంటని ప్రశ్నించిన వారిని సచివాలయం బయట రహదారులు, పార్కింగ్ ప్రాంతాల్లో పనిచేయాలని, లేదా పురుషుల మరుగుదొడ్లను శుభ్రపరచడం లాంటి పనులు కేటాయించడం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు బెదిరింపు కాల్స్ కార్మికులకు వేతనాలు చెల్లించడం లేదని యాజమాన్యానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన కార్మికులకు ఫోన్లు చేసి మరీ కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు బెదిరింపులకు పాల్పడ్డట్లు బాధిత మహిళా కార్మికులు వాపోయారు. మూడేళ్లుగా పనిచేస్తున్నా రోజురోజుకు ఇబ్బందులు ఎక్కువవుతున్నాయని తెలిపారు. సమస్యలను కాంట్రాక్టర్ దృష్టికి తీసుకెళ్దామంటే అందుబాటులో ఉండటం లేదని, అందుబాటులో ఉన్న ఇద్దరు సంస్థ ఉన్నత స్థాయి ప్రతినిధులు కుమ్మక్కై ఈ విధంగా వ్యవహరిస్తున్నారని కార్మికులు ఆరోపించారు. కనీస వేతనాలు ఇవ్వని పరిస్థితి కార్మికులకు కనీస వేతనాలు చెల్లించని పరిస్థితి సచివాలయంలో నెలకొంది. మూడేళ్లుగా సచివాలయంలో 170 మంది కార్మికులు పనిచేస్తున్నా వారికి నెలకు రూ.6,470 వేతనం చెల్లిస్తున్నారు. నాలుగు నెలలుగా వేతనం పెంచామని చెప్పి ఒక నెల రూ.6,670 ఇవ్వగా, మూడు నెలలుగా వేతనాలు అసలు ఇవ్వడంలేదని కార్మికులు చెబుతున్నారు. చట్టం ప్రకారం ప్రతి కార్మికునికి రూ.12,500 వేతనం చెల్లించాల్సి ఉందని కార్మిక సంఘాల నేతలు పేర్కొంటున్నారు. సీఆర్డీఏ చోద్యం చూస్తోందా? కార్మికులు, అందులోనూ మహిళలకు సచివాలయం సాక్షిగా ఇంత అన్యాయం జరుగుతుంటే సీఆర్డీఏ అధికారులు ఏమిచేస్తున్నారు. మూడు నెలలుగా వేతనాలు చెల్లించకపోగా, అడిగిన వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మహిళా కార్మికులకు ఫోన్ చేసి బెదిరించిన కాంట్రాక్టు సంస్థ ప్రతినిధిపై పోలీసు కేసు నమోదు చేయాలి. తక్షణమే కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ కార్డులను అందజేయాలి. లేకుంటే కార్మికులతో సచివాలయం ముట్టడిస్తాం. – ఉండవల్లి. శ్రీదేవి, వైఎస్సార్సీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలి గతంలో కాంట్రాక్టు సంస్థను ప్రశ్నించినందుకు పనిలో నుంచి తొలగించిన కార్మికులను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. వారికి గతంలో వేతనంలో నుంచి తీసుకున్న పీఎఫ్‌ను అందించాలి. ప్రతి కార్మికునికి చట్ట ప్రకారం వేతనం చెల్లించాలి. వారాంతపు సెలవులను కేటాయించాలి. – మెరుగుమళ్ల రవి, రాజధాని డివిజన్ కార్మిక సంఘం కార్యదర్శి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి రాజధానిలో కార్మికులు అంతా దళితులు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. అలాంటి వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సచివాలయంలో పని చేస్తున్న కార్మికులకు నెలకు ఒక్క రోజు మాత్రమే సెలవు దినం. కానీ వేతనం మాత్రం సరిగా ఇవ్వరు. పేదల శ్రమ దోచుకునితింటున్నారు. ప్రతి ఒక్క కార్మికునికి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. లేకుంటే ఊరుకునేది లేదు. – శంగారపాటి సందీప్, అధ్యక్షుడు, ఎస్సీ సెల్ -
నేడు పునర్విభజన కమిటీ భేటీ
-
చకచకా సచివాలయం బదలాయింపు
హైదరాబాద్: రాష్ట్ర సచివాలయం తరలింపునకు అవసరమైన భూ బదలాయింపు ప్రక్రియ వేగం పుంజుకుంది. సచివాలయం నిర్మాణానికి కంటోన్మెంట్‌లోని బైసన్ పోలో గ్రౌండ్, జింఖానా మైదానాల్ని తమకు ఇవ్వాల్సిందిగా సీఎం కేసీఆర్ కేంద్ర రక్షణ మంత్రిని కోరడం తెలిసిందే. ఈ మేరకు ఆ స్థలాల సమాచారాన్ని అందజేయాల్సిందిగా రక్షణ శాఖ ఉన్నతాధికారులు స్థానిక డిఫెన్స్ ఎస్టేట్స్, లోకల్ మిలటరీ అథారిటీస్(ఎల్ఎంఏ) అధికారులను ఆదేశించారు. తాజాగా సికింద్రాబాద్ డిఫెన్స్ ఎస్టేట్స్ అధికారులు, ఎల్ఎంఏ అధికారులు పంపిన నివేదిక ఆధారంగా రక్షణ మంత్రిత్వ శాఖ కొద్ది రోజుల్లోనే సానుకూల నిర్ణయం వెలువరించే అవకాశమున్నట్లు తెలిసింది. గత నెలలోనే లేఖ: బైసన్ పోలో గ్రౌండ్, జింఖానా మైదానాల్ని తమకు అప్పగించాల్సింది కోరుతూ సీఎం కేసీఆర్ గత నెల 24న రక్షణమంత్రి మనోహర్ పారికర్‌కు లేఖ రాశారు. దీనిపై రక్షణ మంత్రిత్వ శాఖ సాధ్యాసాధ్యాలపై క్షేత్రస్థాయి నివేదికను సమర్పించాల్సిందిగా డెరైక్టర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ ఎస్టేట్స్(డీజీడీఈ)అధికారులకు సూచించింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు త్వరగా నివేదికను అందజేయాల్సిందిగా సూచిస్తూ ఈ నెల 6న పుణేలోని సదరన్ కమాండ్ ప్రిన్సిపల్ డెరైక్టర్ సికింద్రాబాద్ డీఈఓ కార్యాలయానికి లేఖ పంపారు. ప్రిన్సిపల్ డెరైక్టర్ ఆదేశాలకు అనుగుణంగా నివేదికను సిద్ధం చేసిన స్థానిక అధికారులు సోమవారం సమాధానం పంపారు. భూబదలాయింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన, అంగీకారాల కోసం రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు(ముఖ్యమంత్రి కూడా పాల్గొనే అవకాశం ఉంది), లోకల్ మిలటరీ అధికారులు(ఎల్ఎంఏ) మధ్య సివిల్ మిలటరీ లైజన్ కాన్ఫరెన్స్(సీఎంఎల్సీ) జరగాల్సి ఉంది. ఈ సమావేశం సజావుగా ముగిస్తే భూ బదలాయింపు లాంఛనమే. ప్రభుత్వం కోరుతున్న ఈ 60 ఎకరాల స్థలం మార్కెట్ విలువ వెయ్యి కోట్లకు పైగానే ఉంటుందని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు చెబుతున్నారు. -
సచివాలయంలో సీఎం ఆఫీస్ వద్ద కూలిన భారీవక్షం