
సాక్షి, అమరావతి: 25 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ప్రమోషన్ సమస్యను సీఎం జగన్ పరిష్కారించారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. '' 315 మంది ఎంపీడీవోలకు 25 ఏళ్ళు ప్రమోషన్ లు లేవు. దీని వలన 18,500 మంది పంచాయతీ రాజ్ ఉద్యోగులకు ప్రమోషన్‌లు రాలేదు. ఇప్పుడు ఉద్యోగులకు న్యాయం చేయాలని సీఎం జగన్ భావించారు. ప్రమోషన్‌ల సమస్యలన్నీ పరిష్కరించాం. 255 మందికి 12 క్యాడర్‌ల వారికి ప్రమోషన్‌లే ఇచ్చాం.బయట శాఖల నుంచి ఇప్పుడు అధికారులను తీసుకుంటున్నాం. కానీ ఇప్పుడు వీళ్ళకి అవకాశం ఇచ్చే పరిస్థితి వచ్చింది.
ఈ నిర్ణయం రాష్ట్రంలో ఎవరు తీసుకోలేకపోయారు. సీఎం జగన్ ఉద్యోగులకు అన్ని విషయాల్లోనూ న్యాయం చేస్తారన్న నమ్మకం ఉద్యోగుల్లో కలిగింది. పంచాయితీరాజ్ శాఖలో ఇదొక చరిత్రగా నిలుస్తుంది. ఎంపీడీవోలందరికి ప్రమోషన్ లు వస్తాయి. గిరిజ శంకర్, కమిషనర్ ఎంపిడివోలు అభివృద్ధి లో చాలా కీలకం. ఇప్పుడు పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతం అవుతుంది .. కానీ ఇప్పుడు వీళ్ళకి అవకాశం ఇచ్చే పరిస్థితి వచ్చింది. అమర్ రాజాపై మేం ఎలాంటి రాజకీయం చెయ్యలేదు. అది వెళ్లిపోవాలని మేం కోరుకోలేదు. కానీ అమర్ రాజా నిబంధనలకు లోబడి పనిచేయాలి. చిత్తూరు జిల్లాలో 4,5 వేల ఎకరాలు భూములు తీసుకున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నివేదికలు ఆధారంగా వెళ్లాలి. వాళ్ళు హైకోర్టుకి కూడా వెళ్లారు.'' అని పేర్కొన్నారు. ఇదిలా ఉంచితే, గ్రామ, వార్డు సచివాలయాల్లో మరిన్ని సేవలు అందుబాటులోకి తెస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్, పాన్‌కార్డు సేవలు అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్లు సీఎం జగన్ మానస పుత్రికలను పెద్దిరెడ్డి పేర్కొన్నారు. ప్రొబేషన్ ఎగ్జామ్‌లో ఎటువంటి రాజకీయాలు ఉండవని ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment