సాక్షి, అమరావతి: ఏపీఎన్జీవో భవనంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర జనరల్ బాడీ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో ఏపీఎన్జీవో సంఘం, సచివాలయ ఉద్యోగుల సంఘాల నేతలు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
సమావేశం అనంతరం ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం ఏపీ అని.. ఎలాంటి అవినీతి లేకుండా లక్షా 30 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికే దక్కిందని కొనియాడారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయడం సరైనదేనని కరోనా సమయంలో నిరూపితమైందని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) ఎన్.చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థతో ప్రపంచంలోనే ఏపీకి ప్రత్యేకత వచ్చిందని.. ఉద్యోగ వ్యవస్థకు ఇదొక గర్వకారణమని కొనియాడారు. సచివాలయ వ్యవస్థలోని ఉద్యోగులను రెగ్యులర్ చేయరని కొందరు అనుమానం వ్యక్తం చేశారని, కానీ సీఎం జగన్ సచివాలయ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి చూపించారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment