Fact Check: సచివాలయాలపైనా ఏడుపే..  | Eenadu false writings on sachivalayam | Sakshi
Sakshi News home page

Fact Check: సచివాలయాలపైనా ఏడుపే.. 

Published Sun, Nov 12 2023 4:04 AM | Last Updated on Sun, Nov 12 2023 9:27 AM

Eenadu false writings on sachivalayam - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసే సంక్షేమ పథకాల కోసం లబ్దిదారులెవరూ గతంలో మాదిరిగా జన్మభూమి కమిటీల చుట్టూ చెప్పులరిగేలా తిరిగే అగత్యం లేకుండా జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం గ్రామ సచివాలయాల వ్యవస్థను తీసుకొస్తే ‘ఈనాడు’ అస్సలు సహించలేకపోతోంది. ముఖ్యమంత్రి స్థానంలో చంద్రబాబు లేరన్న అసూయతో నిత్యం లేనిపోని అబద్ధాలతో ఆ పత్రికను నింపేస్తోంది.

ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్న ఈ క్షుద్ర పత్రిక  శనివారం ‘పంచాయతీలను కొల్లగొట్టి.. సచివాలయాలకు పంచిపెట్టి..’ అంటూ పెడబొబ్బలు పెడుతూ గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థపై చేతికొచ్చింది రాసిపారేసింది. నిజానికి.. సచివాలయాలకు నిధులివ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని వార్త రాయడంలో ఎలాంటి వాస్తవంలేదని, ఆ వార్త పూర్తిగా సత్యదూరమని ప్రభుత్వం స్పష్టంచేసింది.

దేశంలో మరే రాష్ట్రంలోని లేని విధంగా అత్యుత్తమ సేవలందిస్తున్న ఈ గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరును చూసి ఓర్వలేక.. ఈనాడు ఎప్పటిలాగే తప్పుడు వార్తలకు తెగబడింది. ఈ నేపథ్యంలో.. ‘ఈనాడు’ కథనంపై రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలతో ఫ్యాక్ట్‌చెక్‌ను విడుదల చేసింది. ఆ వివరాలు..  

నిధులివ్వకుండా నిర్లక్ష్యం ఒట్టిమాటే.. 
రాష్ట్ర ప్రభుత్వం 2019 అక్టోబరు 2 నుంచి 15,004 గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటుచేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీరు, పట్టణ ప్రాంతాల్లో ప్రతి 70–100 ఇళ్లకు ఒక వలంటీరు చొప్పున రెండున్నర లక్షలకు పైగా వలంటీర్లను నియమించింది. వీరిలో ఒక్కొక్కరికీ నెలకు రూ.5వేల చొప్పున పారితోíÙకం చెల్లిస్తోంది. అంతేకాదు.. ఎలాంటి అవినీతికిగానీ వివక్షకుగానీ తావులేకుండా ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడానికి ఈ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఒకటిన్నర లక్షల మందికి పైగా ఉద్యోగులను శాశ్వత ప్రాతిపదికన నియమించింది.  

కొత్తగా ఏర్పాటైన సచివాలయాలకు 30,004 కంప్యూటర్లు, 15,002 యూపీఎస్, 15,002 ప్రింటర్లు, 3,000 ఆధార్‌ కిట్లు, 2,86,646 ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్లు పంపిణీ చేసింది. వలంటీర్లతోపాటు ఇతర సచివాలయ సిబ్బంది విధులను వేగంగా నిర్వహించేందుకు.. టెక్నాలజీని ఉపయోగించేందుకు 2,91,590 స్మార్ట్‌ఫోన్లు, సిమ్‌కార్డులను అందజేసింది. వీటన్నింటి కోసం ప్రభుత్వం తొలిదశలోనే రూ.486.71 కోట్లను వెచ్చించింది. వీటికి ఎక్కడ కూడా గ్రామపంచాయతీ నిధులను ఖర్చుపెట్టలేదు. 

మరోవైపు.. సచివాలయాల ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ప్రభుత్వం ఎప్పటికప్పుడు అదనంగా నిధులు విడుదల చేస్తోంది. ‘జగనన్న సురక్ష శిబిరం’ నిర్వహణ కోసమే రూ.25 కోట్లు.. అలాగే ‘ఆరోగ్య సురక్ష శిబిరం’ కోసం ఇంకొక రూ.22 కోట్లను విడుదల చేసింది. ఇదికాక, అదనంగా రూ.16 కోట్లను మంజూరు చేయగా వాటిని చెల్లించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కానీ, వీటన్నింటినీ పక్కనపెట్టి ‘ఈనాడు’ సచివాలయాలకు నిధులివ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని వండిన వార్తలో ఎలాంటి వాస్తవంలేదు.  

ఇక ఈ నాలుగేళ్లలో సచివాలయాల నిర్వహణకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఇప్పటివరకు రూ.228 కోట్లు వెచ్చించింది. ఈ నిధులతో ప్రింటర్లు, కంప్యూటర్లు, యుపీఎస్, ఫోన్లు, ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్ల నిర్వహణను చూస్తోంది. వీటికి ఎక్కడా కూడా పంచాయతీ నిధులను ఖర్చుపెట్టలేదు. 
ూ అలాగే, అన్ని సచివాలయాలకు ఫైబర్‌నెట్‌ సంస్థ ద్వారా ఇంటర్‌నెట్‌ సౌకర్యాన్ని ప్రభు త్వం కలి్పస్తోంది. ప్రింటర్ల వినియోగంలో వాడే ఇంక్‌ రీఫిల్స్, స్టేషనరీ సరి్టఫికెట్లు, లామినేషన్‌ కవర్లను సైతం గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ద్వారా ప్రభుత్వమే ఎప్పటికప్పుడు సరఫరా చేస్తోంది.  

రాష్ట్రంలోని వలంటీర్లతో పాటు ఇతర సచివాలయాల సిబ్బంది ఉపయోగించే ఫోన్ల నెలవారీ చార్జీలు కూడా ప్రభుత్వమే చెల్లిస్తోంది. వీటికి కూడా ఎక్కడా గ్రామ పంచాయతీ నిధులను ఖర్చుపెట్టలేదు. 

ఇవన్నీ కాక.. సచివాలయాల్లో ఇతర అదనపు ఖర్చుల కోసం గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఇప్పటిదాకా రూ.25 కోట్లను ఖర్చుపెట్టింది. ఇంకా ఏవైనా అవసరాలుంటే కలెక్టర్ల ద్వారా అభ్యర్థనలు పంపితే ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిశీలించి నిధులు విడుదల చేస్తోంది. వీటికీ పంచాయతీ నిధులను ఖర్చుపెట్టలేదు. 

 గ్రామ సచివాలయాలు సమర్థవంతంగా పనిచేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. రాష్ట్రంలో 10,893 గ్రామ సచివాలయ భవనాలను మంజూరుచేయగా వాటిలో ఇప్పటికే 5,926 పూర్తయ్యాయి. వార్డు సచివాలయాల అద్దె చెల్లింపుల కోసం ప్రభుత్వం 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ.54,56,49,999 చెల్లిస్తే, 2023–24 సంవత్సరానికి రూ.25,30,21,000 చెల్లిస్తోంది.   

పంచాయతీ కార్యదర్శులపై ఒత్తిడి లేదు.. 
గ్రామ పంచాయతీ సాధారణ నిధులు, ఆర్థిక సంఘం నిధులను గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, నిర్వహణ కోసం ఆయా గ్రామ పంచాయతీల తీర్మానాల మేరకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఖర్చుచేస్తోంది. 15వ ఆర్థిక సంఘం నిధులుగానీ, గ్రామ పంచాయతీ సాధారణ నిధులుగానీ ఏ అవసరానికి ఎంతెంత శాతం ఖర్చుపెట్టాలన్న దానిపై ఖచ్చితమైన నిబంధనలున్నాయి. ఇందులో ఎక్కడా కూడా పంచాయతీ నిధులను సచివాలయాల కోసం కేటాయించలేదు.  

గ్రామ సచివాలయాల నిర్వహణకు ఆ శాఖ ప్రత్యేకంగా నిధులను విడుదల చేస్తోంది. పైగా వీటి నిర్వహణ ఖర్చుల నిమిత్తం అధికారుల నుంచి పంచాయతీ కార్యదర్శులపై ఎలాంటి ఒత్తిడి లేదు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అందుతున్న సేవలకు విశేషమైన స్పందన లభిస్తుండడంతో కేవలం ప్రభుత్వాన్ని అప్రతిష్టపాల్జేయడానికే ఈ తప్పుడు కథనాన్ని ఈనాడు ప్రచురించిందని ప్రభుత్వం పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement