సాక్షి, అమరావతి: బదిలీల కోసం గ్రామ, వార్డు సచివాయాల ఉద్యోగులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేశారు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన జరుగుతున్న ఈ బదిలీలకు సొంత జిల్లాల్లోనే మరో స్థానానికి బదిలో కోరుతూ 13,105 మంది, ఒక జిల్లా నుంచి వేరొక జిల్లాకు బదిలీ కోసం మరో 2,421 మంది దరఖాస్తు చేసుకున్నట్టు గ్రామ వార్డు సచివాలయాల శాఖ అధికారులు వెల్లడించారు. 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నాలుగు నెలల్లోనే రికార్డు స్థాయిలో ఒకే విడతలో 1.34 లక్షల గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగాలను భర్తీ చేసిన విషయం తెలిసిందే.
వీరికి ప్రభుత్వం ఈ ఏడాది బదిలీలకు అవకాశం కల్పించింది. బదిలీలకు ఈ నెల 3వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. జిల్లా పరిధిలో, అంతర్ జిల్లాల బదిలీలకు కలిపి మొత్తం 15,526 మంది దరఖాస్తు చేసుకున్నారు. సోమవారం దరఖాస్తుల పరిశీలన చేపట్టారు. మంగళవారం రాత్రికల్లా జిల్లాల వారీగా, వివిధ కేటగిరీ పోస్టుల ప్రకారం బదిలీలకు దరఖాస్తు చేసుకున్న వారికి మెరిట్ ర్యాంకులు ఇస్తామని గ్రామ, వార్డు సచివాలయాల అధికారులు వెల్లడించారు. బదిలీలకు అర్హత ఉన్న వారికి 8, 9, 10 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించి వారు కోరుకున్న మేరకు కేటాయించే సచివాలయాల వివరాలతో ప్రొసీడింగ్స్ జారీ చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు.
అత్యధికంగా డిజిటల్ అసిస్టెంట్ పోస్టుల్లోనే
అత్యధికంగా కర్నూలు జిల్లా నుంచి 1,581 మంది బదిలీ కోరుతూ దరఖాస్తు చేశారు. ప్రత్యేకించి ఒక జిల్లా నుంచి వేరొక జిల్లాకు అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో 233 మంది దరఖాస్తు చేసుకోగా, ఆ తర్వాత గుంటూరు జిల్లా నుంచి 232 మంది దరఖాస్తు చేసినట్టు అధికారులు వివరించారు. అత్యధికంగా డిజిటల్ అసిస్టెంట్లు 1,976 మంది బదిలీకి దరఖాస్తు చేసుకున్నారు. ఒక జిల్లా నుంచి వేరొక జిల్లాకు బదిలీ కోరుతూ అత్యధికంగా మహిళా పోలీసులు 389 మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఆ తర్వాత ఇంజనీరింగ్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు ఎక్కువ మంది బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు.
చదవండి: Fact Check : పేదల ఇళ్లపై పిచ్చి రాతలు.. బాబు కొంప కొల్లేరవుతుందనే!
Comments
Please login to add a commentAdd a comment