సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పింఛనుదారులకు మే 1వ తేదీ నుంచి పంపిణీ చేసే పింఛను డబ్బును రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల ముందుగానే సచివాలయాల ఖాతాల్లో జమ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 60,87,942 మందికి పింఛన్ల పంపిణీకి రూ.1,547.17 కోట్ల మొత్తాన్ని ఆయా గ్రామ, వార్డు సచివాలయాల ఖాతాల్లో శుక్రవారమే జమ చేసినట్టు ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు.
ఆదివారం తెల్లవారుజాము నుంచే వలంటీర్లు లబ్ధిదారుల వద్దకే వెళ్లి పింఛను డబ్బు పంపిణీ చేస్తారని చెప్పారు. 5వ తేదీ లోగా పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించినట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment