సాక్షి, నెల్లూరు: ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం, నిర్లక్ష్యం తగదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సచివాలయ పరిపాలన అధికారులను హెచ్చరించారు. జిల్లా నగరపాలక సంస్థ సచివాలయం పరిపాలన అధికారులతో బుధవారం మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే నెలలో అన్ని పార్టీలతో అఖీల పక్ష సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. నగర అభివృద్దికి అందరి అభిప్రాయాలు కొతామని, ప్లెక్సిల ఏర్పాటు అంశంపై అందరి సలహాలు తీసుకుని కీలక నిర్ణయాలు తీసుకుంటామన్నారు. అడ్డగోలుగా ఫ్లెక్సీలు ఏర్పాటుపై కూడా నియంత్రణ చేస్తామని, అవసరమైతే పెనాల్టీ వేసే అంశం ఆలోచిస్తామని చెప్పారు. ఆ నిబంధనలు తన ఫ్లెక్సీల విషయంలోనూ వర్తిస్తాయన్నారు.
వరదల ప్రమాదం నుంచి నగరాన్ని కాపాడేందుకు అఖిలపక్షం సలహాలు కొరతామని ఆయన పేర్కొన్నారు. మంత్రి కొడాలి నాని గురించి మాట్లాడే అర్హత జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు లేదన్నారు. నాలుగు సార్లు గెలుచిన కొడాలి నాని గురించి రెండు చోట్ల ఓడిన పెద్ద మనిషి మాట్లాడటం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. మీరు ఏ లింగమో ప్రజలెప్పుడో తేల్చారని, రాజకీయాల్లోకి వచ్చాక సినిమాలు చేయను మీరే చెప్పారు కాబట్టి ప్రశ్నిస్తున్నామన్నారు. అసెంబ్లీని ముట్టడిస్తే ప్రభుత్వం ఊరికే కూర్చోదని, చట్టం పని చట్టం చేస్తుందని మంత్రి వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment