సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీల్లో దివ్యాంగులు, ప్రత్యేక ప్రతిభావంతులైన పిల్లలు ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అటువంటివారి దరఖాస్తులు, వాటితోపాటు సమర్పించే వైద్యుల సర్టిఫికెట్లను ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేకంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అందుకోసం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసింది. జిల్లాలో బదిలీలు, అంతర్ జిల్లా బదిలీల కోసం గ్రామ, వార్డు సచివాలయాలశాఖ గురువారం విడుదల చేసిన తాజా షెడ్యూల్ ఇలా ఉంది.
జిల్లాలో బదిలీల షెడ్యూల్
జిల్లాలవారీగా ఖాళీగా ఉన్న పోస్టుల గుర్తింపు: మే 28
బదిలీలకు దరఖాస్తు చేసేందుకు తుది గడువు: జూన్ 3
దరఖాస్తుల పరిశీలనకు తుది గడువు : జూన్ 10
కేటాయించిన మండలాలు,మున్సిపాలిటీలు,
తిరస్కరించిన దరఖాస్తుల జాబితా ప్రకటన : జూన్ 12
బదిలీల కోసం కౌన్సెలింగ్ నిర్వహణ : జూన్ 14, 15
కౌన్సెలింగ్‌పై అభ్యంతరాల స్వీకరణ : జూన్ 15 నుంచి
అంతర్ జిల్లా బదిలీల షెడ్యూల్
జిల్లాలవారీగా ఖాళీగా ఉన్న పోస్టుల గుర్తింపు: మే 28
బదిలీలకు దరఖాస్తు చేసేందుకు తుది గడువు: జూన్ 3
దరఖాస్తులను సంబంధిత జిల్లాకు పంపేందుకు గడువు: జూన్ 9
జిల్లా అధికారులు రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి
దరఖాస్తుల సమర్పణ: జూన్ 10
రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుంచి
దరఖాస్తులు కార్యదర్శికి సమర్పణ: జూన్ 13
బదిలీల కోసం కౌన్సెలింగ్ నిర్వహణ: జూన్ 14, 15
కౌన్సెలింగ్‌పై అభ్యంతరాల స్వీకరణ : జూన్ 15 నుంచి
Comments
Please login to add a commentAdd a comment