కొన్ని వృక్షాలకు ఎంతో చరిత్ర, నేపథ్యం జ్ఞాపకాలు ముడివేసి ఉంటాయి. అవి కొన్ని గాథాలకు నిలువెత్తు సాక్ష్యంగా ఉంటాయి. అలాంటివి కనుమరుగైతే ఎవ్వరికైనా బాధగానే ఉంటుంది. అంతా నేపథ్యం కలిగిన వాటిని మనం ఏవిధంగానూ రీ క్రియేట్ చేయలేం.
అలాంటి చారిత్రక నేపథ్యం ఉన్న ఈ చెట్టు హఠాత్తుగా కనుమరుగైపోయింది. యూకేలోని నార్తంబర్ ల్యాండ్‌లో ఈ ప్రసిద్ధ చెట్టు ఉంది. ఏమైందో ఏమో సెప్టెంబర్ 28న తెల్లవారుజామున ఎవరో నరికేశారు. ఏం బుద్ది పుట్టి ఇలా చేశారో గానీ ఒక్కసారిగా ఈ విషయం యూకే అంతటా దావానంలా వ్యాపించింది. ఈ విషయం తెలుసుకున్న యూకే అధికారులు 16 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత దర్వాప్తులో 60 ఏళ్ల వ్యక్తి ప్రమేయం ఉందని తేలడంతో అతడిని అరెస్టు చేశారు.
ఈ ఘటన జరిగిన వెంటనే ఫోరెన్సిక్ అధికారులు ఆ చెట్టు అవశేషాలు, కొలతలు, నమునాలు తీసుకున్నారు. ఆ విచారణలో ఈ చెట్టు 300 ఏళ్ల నాటిదని తేలింది. ప్రకృతిలో చాలా సహజంగా పెరిగిందని చెబుతున్నారు అధికారులు. హాలివుడ్‌లో కెవిన్ కాస్ట్‌నర్, ప్రిన్స్ ఆప్ థీవ్స్ నటించిన 1991నాటి ప్రముఖ చిత్రం రాబిన్ హుడ్‌లో ఈ చెట్టు అందర్నీ ఆకర్షించింది. ఈ చెట్టు ఎంతోమంది కళాకారులకు, రచయితలకు, ఫోటోగ్రాఫర్‌లకు గొప్ప ప్రేరణ ఇచ్చిన మొక్కగా పేరుగాంచింది.
ఈ చెట్టుతో చాలామందికి ఎన్నో గొప్ప జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ మేరకు వుడ్‌ల్యాండ్ ట్రస్ట్‌లోని ఎస్టేట్ మేనేజర్ మార్క్ ఫెదర్ మాట్లాడుతూ..మిగిలిన కాండం నుంచి ఒక చిన్న చెట్టుగా అభివృద్ధి చెందడానికి కొన్ని ఏళ్లు పడుతుంది. అంటే.. మనం కోల్పోయిన చెట్టులా అవ్వడానికి దాదాపు 150 నుంచి 200 ఏళ్లు పడుతుంది. ఈ చెట్టుని సైకామోర్ గ్యాప్ ట్రీ లేదా రాబిన్ హుడ్ ట్రీగా పిలుస్తారు. ఇది ఇంగ్లండ్‌లోని నార్తంబర్‌ల్యాండ్‌లోని క్రాగ్ లాఫ్ సమీపంలో హాడ్రియన్ వద్ద ఉంది. అంతేగాదు ఈ చెట్టు 2016 ఇంగ్లండ్ ట్రీ ఆఫ్ ది ఇయర్ అవార్డును సైతం గెలుచుకుంది. ఇది యూకే ఐకానిక్ చెట్టుగా కూడా ప్రసిద్ది.
(చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లి..ఏకంగా రూ. 914 కోట్లు!ముఖేశ్‌అంబానీ కూతురు మాత్రం కాదు!)
Comments
Please login to add a commentAdd a comment