
కూలిన భారీ వృక్షం..నలుగురికి గాయాలు
హైదారాబాద్: బంజారాహిల్స్‌లోని రోడ్డు నంబర్ 13లో ఓ భారీ వృక్షం నెలకొరిగింది. సోమవారం తెల్లవారుజామున స్థానిక ఎన్బీటీ నగర్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలు అయ్యాయి. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. చెట్టు కూలడంతో ఈ రహదారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అధికారులు విరిగిని చెట్టును తొలగించేందుకు చర్యలు చేపట్టారు.