
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత, భారత మాజీ స్టార్ బాక్సర్ డింకో సింగ్‌కు కరోనా వైరస్ సోకింది. 1998 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో పసిడి పతకం గెలిచిన 41 ఏళ్ల డింకో సింగ్ ప్రస్తుతం కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. చికిత్స కోసం ఇటీవల మణిపూర్ నుంచి ఢిల్లీకి వచ్చిన డింకో సింగ్‌కు పచ్చ కామెర్లు రావడంతో రేడియేషన్ థెరపీని మధ్యలోనే ఆపేశారు. దాంతో డింకో సింగ్ రోడ్డు మార్గం గుండా 2400 కిలోమీటర్లు అంబులెన్స్‌లో ప్రయాణించి మళ్లీ మణిపూర్‌కు చేరుకున్నాడు. అక్కడ అతనికి వైద్య పరీక్షలు నిర్వహించగా కోవిడ్–19 పాజిటివ్ వచ్చినట్లు తేలింది.
Comments
Please login to add a commentAdd a comment