
న్యూఢిల్లీ: హాకీ ఇండియా (హెచ్‌ఐ) సిబ్బందిలో శనివారం ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా వచ్చింది. శుక్రవారం హెచ్‌ఐ సిబ్బందికి కోవిడ్–19 పరీక్షలు నిర్వహించగా అకౌంటెంట్, జూనియర్ ఫీల్డ్ ఆఫీసర్ వైరస్ బారిన పడినట్లు తేలింది. దాంతో రెండువారాలపాటు హాకీ ఇండియా కార్యాలయం మూతపడనుంది. మరోవైపు తన తండ్రి కరోనా పాజిటివ్‌గా తేలడంతో అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) అధ్యక్షుడు, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరీందర్ బత్రా స్వీయ నిర్బంధంలో ఉన్నారు. జూన్ మొదటి వారంలో మరోసారి తాను కోవిడ్–19 పరీక్షకు హాజరవుతానని తెలిపారు. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని జాతీయ క్రీడా సమాఖ్యలు (ఎన్‌ఎస్‌ఎఫ్), జాతీయ ఒలింపిక్ కమిటీలు (ఎన్‌ఓసీ) తమ ఉద్యోగులకు, సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించాలని బత్రా విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment