Dingko Singh
-
ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్.. మాజీ బాక్సర్ కన్నుమూత
ఇంఫాల్: భారత మాజీ బాక్సర్.. ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ డింగ్కో సింగ్(42) అనారోగ్యంతో గురువారం కన్నుమూశాడు. మణిపూర్‌కు చెందిన డింగ్కో సింగ్ 2017లో లివర్ క్యాన్సర్ బారీన పడ్డారు. 2020లో ఢిల్లీలోని లివర్ అండ్ బిలియరీ సైన్సన్(ఐఎల్‌బీఎస్) రేడియేషన్ థెరపీ చేయించుకున్న ఆయన కాస్త కోలుకున్నట్లే కనిపించారు. కానీ కొద్దిరోజులకే కరోనా సోకడం.. దాని నుంచి కోలుకున్నప్పటికి తాజాగా ఆరోగ్యం మరింత క్షీణించడంతో మృతి చెందారు. బ్యాంకాక్ వేదికగా 1998లో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించడం ద్వారా అందరి దృష్టిలో పడ్డాడు. 16 ఏళ్ల తర్వాత బాక్సింగ్ విభాగం నుంచి దేశానికి స్వర్ణ పతకం తీసుకొచ్చిన ఆటగాడిగా డింగ్కో సింగ్ నిలిచాడు. 1998లో అర్జున అవార్డు పొందిన డింగ్కో సింగ్ 2013లో భారత అత్యున్నత నాలుగో పురస్కారం పద్మ శ్రీ అవార్డును అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్నాడు. ప్రొఫెషనల్ బాక్సింగ్‌కు వెళ్లని డింగ్కో సింగ్ ఇండియన్ నేవికి సేవలందించడంతో పాటు బాక్సింగ్ కోచ్‌గాను పనిచేశాడు. డింగ్కో సింగ్ మృతిపై ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్‌తో పాటు.. ఆరుసార్లు వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన మహిళ బాక్సర్ మేరీకోమ్ అతని మృతి పట్ల తమ సంతాపం ప్రకటించారు. చదవండి: Indian Olympic Association: మాకొద్దీ చైనా దుస్తులు! -
భారత మాజీ బాక్సర్ డింకో సింగ్‌కు కరోనా పాజిటివ్
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత, భారత మాజీ స్టార్ బాక్సర్ డింకో సింగ్‌కు కరోనా వైరస్ సోకింది. 1998 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో పసిడి పతకం గెలిచిన 41 ఏళ్ల డింకో సింగ్ ప్రస్తుతం కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. చికిత్స కోసం ఇటీవల మణిపూర్ నుంచి ఢిల్లీకి వచ్చిన డింకో సింగ్‌కు పచ్చ కామెర్లు రావడంతో రేడియేషన్ థెరపీని మధ్యలోనే ఆపేశారు. దాంతో డింకో సింగ్ రోడ్డు మార్గం గుండా 2400 కిలోమీటర్లు అంబులెన్స్‌లో ప్రయాణించి మళ్లీ మణిపూర్‌కు చేరుకున్నాడు. అక్కడ అతనికి వైద్య పరీక్షలు నిర్వహించగా కోవిడ్–19 పాజిటివ్ వచ్చినట్లు తేలింది. -
ఒకవైపు క్యాన్సర్.. మరొకవైపు కరోనా!
ఇంఫాల్: మణిపూర్ మాజీ బాక్సర్ డింకో సింగ్ (41)కు కరోనా వైరస్ సోకింది. 1998 ఆసియా క్రీడల్లో ఆయన స్వర్ణ పతకం సాధించారు. ప్రస్తుతం డింకో సింగ్ కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. లాక్డౌన్ కారణంగా రేడియేషన్ థెరపీకి దూరమైన డింకోను ఈనెల 25న ఎయిర్ అంబులెన్స్‌లో ఢిల్లీకి తీసుకొచ్చారు. చికిత్స కోసం డింకో కొంతకాల అక్కడే గడిపారు. అయితే, రేడియేషన్ థెరపీ అనంతరం ఆయన 2400 కిలోమీటర్ల రోడ్డు ప్రయాణం చేసి మణిపూర్‌లోని తన ఇంటికి చేరుకున్నాడు. ఆయనకు వైరస్ లక్షణాలు బయటపడటంతో మణిపూర్‌లో కరోనా పరీక్ష నిర్వహించారు. ఆదివారం పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఢిల్లీలో ఉన్న క్రమంలోనే ఆయన కరోనా బారినట్టు తెలుస్తోంది. బాక్సింగ్‌లో విశేష ప్రతిభ కనబర్చిన డింకోను భారత ప్రభుత్వం పద్మశ్రీ, అర్జున అవార్డుతో సత్కరించింది. ఇక డింకో సింగ్‌కు మెరుగైన వైద్య సహాయం అందించాలని క్రీడల మంత్రి కిరణ్ రిజుజు మణిపూర్ ప్రభుత్వాన్ని కోరారు. కాగా, భారత్‌లో కోవిడ్ బారినపడ్డ ప్రముఖ ఆటగాళ్లలో మొదటివాడిగా డింకో నిలిచారు. (చదవండి: కొంపముంచిన లాక్డౌన్ 4.0..!) -
బాక్సర్ షాహిద్
బాలీవుడ్లో బయోపిక్స్ హవా కొనసాగుతోంది. ముఖ్యంగా స్పోర్ట్స్ బేస్డ్ బయోపిక్స్‌కు బాగా గిరాకీ ఉన్నట్లు కనిపిస్తోంది. ఆల్రెడీ రన్నర్ మిల్కాసింగ్, లేడీ బాక్సర్ మేరి కోమ్, క్రికెటర్ ధోనీ, రెజ్లర్ మహావీర్ సింగ్ ఫోగట్, హాకీ ప్లేయర్స్ సందీప్‌సింగ్, బల్బీర్‌సింగ్ బయోపిక్‌లు వెండితెరపైకి వచ్చాయి. క్రికెటర్ కపిల్‌దేవ్, ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్, బ్యాడ్మింట¯Œ ప్లేయర్ పుల్లెల గోపీచంద్, బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బయోపిక్స్ రానున్నాయి. ఇప్పుడీ జాబితాలోకి మణిపూర్ బాక్సర్ డింగ్కో సింగ్ బయోపిక్ చేరనుంది. రాజ కృష్ణమీనన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో షాహిద్ కపూర్ హీరోగా నటించనున్నారు. ‘‘1998 బ్యాంకాక్ ఆసియన్ గేమ్స్‌లో బాటమ్ వెయిట్ కేటగిరీలో డింగ్కో గోల్డ్ మెడల్ సాధించారు. పద్మశ్రీ అవార్డు కూడా సాధించారు. ఆ తర్వాత క్యాన్సర్ వ్యాధితో బాధపడ్డారు. ఇలా ఆయన జీవితంలో చాలా ఆసక్తికర విషయాలు ఉన్నాయి. ఇలాంటి వ్యక్తుల చరిత్ర అందరికీ తెలియాలి’’ అని చిత్రబృందం పేర్కొంది. -
వేధింపుల కేసులో బాక్సర్ డింకో సింగ్ అరెస్ట్
ఇంపాల్ : ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్, బాక్సర్ డింకో సింగ్‌ను మణిపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మహిళా వెయిట్ లిఫ్టర్‌ను వేధించాడన్న ఆరోపణలపై డింకోను అరెస్ట్ చేసిన పోలీసులు.. కోర్టు ముందు హాజరు పరచనున్నారు. ఇంపాల్లోని లంపాక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఈ నెల 13న 17 ఏళ్ల మహిళా వెయిట్ లిఫ్టర్‌ను డింకో వేధించాడు. అతని కారుపై ఓజా డింకో అని రాసినందుకు తనను కర్రతో తీవ్రంగా కొట్టాడని సదరు లిఫ్టర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆ మహిళా లిఫ్టర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. 1998లో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో డింకో సింగ్ గోల్డ్ మెడల్ గెలిచి పేరు సంపాదించాడు. అనంతరం అతన్ని కేంద్రం అర్జున, పద్మశ్రీ అవార్డులతో సత్కరించింది. గతేడాది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా.. అతన్ని కోచ్‌గా నియమించింది. అలాంటి వ్యక్తి ఇంటువంచి చర్యలకు పాల్పడటాన్ని వెయిట్‌లిఫ్టింగ్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. డింకోపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.