నటి సన్యా మల్హోత్రా దంగల్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల మన్ననలను అందుకుంది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ఇటీవల జవాన్ మూవీలో డాక్టర్‌గా నటించి మంచి పేరు తెచ్చకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విమర్శకుల ప్రసంసలందుకుంది కూడా. అయితే సన్యా ఒక ఇంటర్యూలో తాను ఇంపోస్టర్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చింది. దీని వల్ల ఎన్నో తప్పులు చేశానని ఒక్కోసారి తనను తాను క్షమించుకోలేని విధంగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయినట్లు చెప్పుకొచ్చింది.
ఇది మన పనిపై భయంకరంగా ప్రభావితం చేస్తుందని చెబుతోంది. దీని కారణంగా ఏది చెయ్యలేని పరిస్థితికి వచ్చేస్తామని అంటోంది. మొదట్లో పెద్దగా ఈ సిండ్రోమ్‌ని పట్టించుకోలేదని, రాను రాను అది తన జీవితాన్నే నిస్తేజంగా చెయ్యడం మొదలు పెట్టడంతో దీన్నుంచి బయటపడే మార్గాలు అన్వేషించి నెమ్మది నెమ్మదిగా కోలుకోవడం చేశానని వివరించింది. ఇదే సిండ్రోమ్‌తో ప్రముఖ సెలబ్రిటి విద్యాబాలన్, గాయని ఎల్లీ గౌల్డింగ్, మోడల్ బెల్లా హడిద్ వంటి వాళ్లు సైతం బాధపడ్డారట.
విద్యాబాలన్ పిలింఫేర్ అవార్డులో ఈ విషయం గురించి చెప్పుకొచ్చింది. బాడీని బ్యాలెన్సింగ్‌గా ఉంచుకోవడానికి పడే శ్రమలో ఒక్కోసారి భయనాక అనుమానాలు వచ్చి అది ఎలా ఇంపోస్టర్ సిండ్రోమ్‌కి దారితీసిందో తెలిపింది. అలాగే గాయని ఎల్లీ గౌల్డింగ్ కూడా ఈ సిండ్రోమ్ తన కెరీర్‌ని ఎలా నాశనం చేసిందో వివరించింది. మోడల్ బెల్ హడిద్ కూడా ఈ సమస్యతో ఎంతలా బయటకి కాలు పెట్టేందుకు భయపడిందో చెప్పుకొచ్చింది. అసలు ఏంటీ సిండ్రోమ్ అంటే..!
ఇంపోస్టర్ సిండ్రోమ్ అంటే..
తనను తాను తక్కువ చేసుకోవడం
ఆత్మనూన్యతకు గురవ్వడం
దీనికి తాను అర్హురాలిని కాననుకోవడం
తాను చెబితే అవతలి వాళ్లు చేస్తారో లేదా అనే అనుమానం
తన మాటకు విలువ ఉండదనే భావన
అభద్రత భావం
తదితరాలు ఈ సిండ్రోమ్ లక్షణాలు. ఇది ఎక్కువగా కెరీర్లో మంచి పొజిషన్ ఉన్నవారికి, అప్పుడే ఉన్నతస్థికి ఎదుగుతున్న వారికి ఈ సమస్య ఎదురవుతుంటుందని చెబుతున్నారు నిపుణులు. ఇవి అందరిలో కనిపించే సర్వసాధారణ లక్షణాలే. కానీ అది శృతి మించితేనే ప్రమాదం అని చెబుతున్నారు. ఈ పరిస్థితి మన పనిపై సరిగా ఫోకస్ చెయ్యనివ్వదు. చెప్పాలంటే కెరీర్‌ని అగాథంలోకి నెట్టే మనలోని మోసగాడు లేదా శత్రువుగా చెప్పొచ్చు.
బయటపడాలంటే..
మనం ఒంటరి కాదు మన చుట్టు మనలాంటి ఉన్నారనే భావనతో ఉండాలి.
ఒకవేళ ప్రతిసారి విజయం మిమ్మల్నే వరించదనే దృక్పథం ఉండాలి.
అలాగే మనకు గౌరవం దక్కకపోయినా లేదా మాట వినకపోయినా..లైట్ తీసుకోవడం లేదా ఆ వ్యక్తులను పట్టించుకోకుండా ముందుకు వెళ్లేలా మనసుని సిద్ధం చేసుకోవాలి.
అభద్రతా భావం వదిలేయాలి. ఆత్మవిశ్వాసం పెంపొందించుకునేలా యోగా, ధ్యానం వంటివి చేయాలి.
నలుగురితో ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటే ఆటోమెటిగ్గా ఈ సమస్య నుంచి సులభంగా బయట పడగలమని చెబుతున్నారు నిపుణులు.
(చదవండి: ఛారిటీ కోసం ఇంగ్లీష్ ఛానల్‌ని ఈదిన భారత సంతతి విద్యార్థి!)
Comments
Please login to add a commentAdd a comment