అత్యంత అరుదైన వ్యాధి. దీని బారినపడితే ఆ వ్యక్తి అత్యంత నరకయాతన అనుభవిస్తాడు. చివరికి ఆ నొప్పిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోతారట. అందుకే దీన్ని "ఆత్మహత్య వ్యాధి" అని కూడా పిలుస్తారని వైద్యులు చెబుతున్నారు. ఇంతకీ ఏంటా ఆ వ్యాధి? ఎలా సోకుతుంది తదితరాల గురించే ఈ కథనం.!
ఈ వ్యాధి పేరు ట్రిజెమినల్ న్యూరల్జియా లేదా ట్రైఫేషియల్ న్యూరల్జియా అంటారు. వ్యవహారికంలో ఫాంటమ్ ఫేస్ పెయిన్ అని పిలుస్తారు. ఇది ముఖంలోని నరాలకు సంబంధించిన వ్యాధి. కపాలం నుంచి ముఖానికి వెళ్లే ట్రెజిమినల్ నాడిని ప్రభావితం చేస్తుందట. దీంతో ఆ వ్యక్తి ముఖంలో ఎడమ లేదా కుడివైపు విపరితమైన నొప్పి వస్తుంది. అది ఒక తిమ్మిరి మాదిరిగా, ఎవ్వరైన కొడితే దిమ్మతిరిగినట్లుగా పెయిన్ వస్తుందట. అలా అరగంట నుంచి గంట వరకు విపరీతమైన నొప్పి ఉంటుందట. దీంతో నోరు లేదా దవడలను కదపడం చాలా ఇబ్బందిగా ఉంటుందట.
ఎంతసేపు ఉంటుందనేది చెప్పలేం. తగ్గాక కూడా మళ్లీ ఎప్పుడూ వస్తుందో కూడా చెప్పలేం. దీని ప్రభావం దైనందిన జీవితంపై ఎక్కువగా ఉంటుంది. ఈ నొప్పి వచ్చినప్పుడూ కనీసం బ్రెష్ కూడా చేయలేరు. ఆ నొప్పికి తాళలేక ముఖాన్ని మాటి మాటికి రాపిడికి గురి చేస్తారు రోగులు. దీంతో ముఖం పుండ్లుగా ఏర్పడి ఒక విధమైన చర్మవ్యాధికి దాదితీస్తుంది. ఇది 50 ఏళ్ల వయసు నుంచి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. కొన్ని వ్యక్తిగత కారణాల రీత్యా కూడా ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఈ సమస్యను క్రికెటర్ల దగ్గర నుంచి ఎందరో ప్రముఖ సెలబ్రెటీలు కూడా ఫేస్ చేశారట. అలాగే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కూడా ఈ వ్యాధి బారినే పడ్డారు. దీని కోసం యూఎస్ వెళ్లి మరీ శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఐతే ఈ చికిత్స అత్యంత ఖర్చుతో కూడినది. పైగా ఎక్కడ పడితే అక్కడ అందుబాటులో ఉండదు.
ఎలా వస్తుందంటే..
ట్రిజెమినల్ న్యూరల్జియా లేదా ట్రిజెమినల్ డిఫెరెంటేషన్ నొప్పి అనేది కపాలం నుంచి ముఖానికి వెళ్లే త్రిభుజాకారంలోని నరాలు దెబ్బతినడంతో ఈ సమస్య ఉత్ఫన్నమవుతుంది. ఈ నొప్పి తొమ్మిరితో కూడిన ఒక విధమైన భరించేలేనిదిగా ఉంటుంది. మైగ్రైన్ నొప్పిలా అనిపిస్తుంది. దీనికి చికిత్స కూడా చాల కష్టం.
ప్రస్తుతం తాజాగా పోలాండ్‌కి చెందిన 70 ఏళ్ల మహిళ కూడా ఇదే వ్యాధిని బారినపడింది. దీని కారణంగా ఆమె కుడివైపు నాసికా రంధ్రం గాయమవ్వటమే కాకుండా కన్ను కుడవైపు ముఖ ప్రాంతమంతా పుండుగా మారిపోయింది. ఆ నొప్పికి తాళ్లలేక ముఖాన్ని రుద్దడంతో పుండ్లు వచ్చి చర్మవ్యాధికి దారితీసింది. దీంతో ఆమెను హుటాహుటినా ఆస్పత్రితో జాయిన్ చేశారు. వైద్యులు ఆమె ట్రైజెమినల్ ట్రోఫిక్ సిండ్రోమ్(టీటీస్)తో బాధపడుతున్నట్లు గుర్తించి చికిత్స అందించారు.
ఎదురయ్యే సమస్యలు..
దీని కారణంగా దవడ, దంతాలు లేదా చిగుళ్ళలో విద్యుత్ షాక్‌గా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. దీన్ని ముఖంలో ఆకస్మిక నొప్పికి కారణమయ్యే నరాల నష్టం అని అన్నారు. దీన్ని శస్త్ర చికిత్స ద్వారా నయం చేయవచ్చు గానీ కొన్ని దుష్పరిణామాలు కూడా ఉంటాయని అంటున్నారు. దాదాపు నూరు కేసుల్లో 70 శాతం సక్సెస్ అయితే 30 శాతం ఫెయిల్ అయ్యే ఛాన్స్‌లు ఉన్నాయని అన్నారు.
దీనికి పవర్‌ఫుల్ యాంటి బయోటిక్ మందులు వినియోగించాల్సి ఉంటుందన్నారు. వృద్ధులు వాటిని తట్టుకునే స్థితిలో ఉండలేరు కాబట్టి వారికి చికిత్స చేయడం కష్టమేనని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఇలాంటి వ్యాధి భారినపడ్డవారు చేతికి గ్లౌజ్‌లు ధరించి ముఖాన్ని రాపిడికి గురిచేయకుండా ఉండేలా క్లాత్‌ని చుట్టి ఉంచుకుంటే..కొద్ది మోతాదు మందులతోనే నయం చేసే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు.
(చదవండి: రక్తంలో ట్రైగ్జిజరైడ్స్‌ను తగ్గించుకోవాలంటే..ఇలా చేయండి!)
Comments
Please login to add a commentAdd a comment