కొందరికి అదే పనిగా వాంతులవుతాయి. అంతేకాదు... రోజూ అదే టైమ్‌కు అవుతాయి. ఒకవేళ వాంతులు కాని పక్షంలో... కనీసం వికారంగానైనా ఉండే అవకాశముంది. వాంతులై కొన్ని గంటలు గడిచాకే హాయిగా అనిపిస్తుంటుంది. చిత్రంగా మళ్లీ ఆ మర్నాడు మళ్లీ అదే టైమ్‌కు వాంతులు కావడం మొదలవుతుంది! క్రితం రోజు ఎంత సేపు అయ్యాయో, ఆ మర్నాడు సైతం అంతే సేపు అవుతుంటాయి!. విచిత్రమైన ఈ జబ్బు పేరు... ‘సైక్లిక్ వామిటింగ్ సిండ్రోమ్’. సంక్షిప్తంగా సీవీఎస్ అంటారు.
చిన్నపిల్లల్లో ఇది మరీ ఎక్కువ. పెద్ద వయసు వాళ్లలోనూ కొందరిలో ఈ సమస్య కనిపిస్తుంటుంది. సాధారణంగా ఈ ‘సీవీఎస్’తో పాటు కడుపునొప్పి, తలనొప్పి, మైగ్రేన్ కూడా కనిపించే అవకాశాలెక్కువ. దీనికి నిర్దిష్టమైన చికిత్స ఏదీ లేదుగానీ... వాంతుల వల్ల తగ్గి΄ోయిన / దేహంలోంచి వెళ్లిపోయిన లవణాలను భర్తీ చేసేందుకు సెలైన్ ఎక్కించాల్సి ఉంటుంది. ఇతరత్రా ప్రత్యేకమైన చికిత్స లేకపోయినప్పటికీ... సాధారణంగా వాంతులను, వికారాన్ని తగ్గించే మందులను‘యాంటీ–ఎమెటిక్’ డ్రగ్స్‌తో డాక్టర్లు ఈ ‘సీవీఎస్’ సమస్యకు చికిత్స అందిస్తారు.
ఇదీ చదవండి: Clinical vampirism రక్తం తాగాలనిపించే జబ్బు గురించి తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment