vomtings
-
రోజూ అదే టైమ్‌కు ఠంచనుగా వాంతులా? ఎందుకలా?!
కొందరికి అదే పనిగా వాంతులవుతాయి. అంతేకాదు... రోజూ అదే టైమ్‌కు అవుతాయి. ఒకవేళ వాంతులు కాని పక్షంలో... కనీసం వికారంగానైనా ఉండే అవకాశముంది. వాంతులై కొన్ని గంటలు గడిచాకే హాయిగా అనిపిస్తుంటుంది. చిత్రంగా మళ్లీ ఆ మర్నాడు మళ్లీ అదే టైమ్‌కు వాంతులు కావడం మొదలవుతుంది! క్రితం రోజు ఎంత సేపు అయ్యాయో, ఆ మర్నాడు సైతం అంతే సేపు అవుతుంటాయి!. విచిత్రమైన ఈ జబ్బు పేరు... ‘సైక్లిక్ వామిటింగ్ సిండ్రోమ్’. సంక్షిప్తంగా సీవీఎస్ అంటారు. చిన్నపిల్లల్లో ఇది మరీ ఎక్కువ. పెద్ద వయసు వాళ్లలోనూ కొందరిలో ఈ సమస్య కనిపిస్తుంటుంది. సాధారణంగా ఈ ‘సీవీఎస్’తో పాటు కడుపునొప్పి, తలనొప్పి, మైగ్రేన్ కూడా కనిపించే అవకాశాలెక్కువ. దీనికి నిర్దిష్టమైన చికిత్స ఏదీ లేదుగానీ... వాంతుల వల్ల తగ్గి΄ోయిన / దేహంలోంచి వెళ్లిపోయిన లవణాలను భర్తీ చేసేందుకు సెలైన్ ఎక్కించాల్సి ఉంటుంది. ఇతరత్రా ప్రత్యేకమైన చికిత్స లేకపోయినప్పటికీ... సాధారణంగా వాంతులను, వికారాన్ని తగ్గించే మందులను‘యాంటీ–ఎమెటిక్’ డ్రగ్స్‌తో డాక్టర్లు ఈ ‘సీవీఎస్’ సమస్యకు చికిత్స అందిస్తారు. ఇదీ చదవండి: Clinical vampirism రక్తం తాగాలనిపించే జబ్బు గురించి తెలుసా? -
కొందరూ నెలల పిల్లలు నవ్వితే వాంతులవుతుంటాయి ఎందుకు?
ఆరు నెలల లోపు చిన్నపిల్లలు కొందరిలో... వాళ్లు బాగా నవ్వుతున్నా, వేగంగా కాళ్లూచేతులు కదిలిస్తున్నా వెంటనే వాంతులు అవుతుంటాయి. అప్పటివరకూ వాళ్లు చురుగ్గా ఆడుతుండటం చూసిన తల్లిదండ్రులకు... అంతలోనే ఎదురైన ఆ సంఘటన ఎంతగానో ఆందోళన కలిగిస్తుంది. నిజానికి అది ఏమాత్రం అపాయకరం కాని ఒక కండిషన్. దాన్ని ‘గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్’ అంటారు. ఈ కండిషన్ కారణంగానే ఈ నెలల పిల్లలకు ఈ తరహాలో వాంతులవుతుంటాయి. చిన్నారుల పొట్ట కింది భాగంలో లోయర్ ఈసోఫేగస్ స్ఫింక్టర్ అనే కండరాలు పొట్టలోపలికి వెళ్లిన ఆహారాన్ని మళ్లీ పైకి రాకుండా నొక్కిపెడతాయి. కొందరిలో ఈ స్ఫింక్టర్ కండరాలు ఉండవలసిన దాని కంటే వదులుగా (రిలాక్స్డ్గా) ఉండే అవకాశం ఉంది. అప్పుడు పాలు, ద్రవాలు (యాసిడ్ కంటెంట్స్) కడుపు లోంచి ఈసోఫేగస్ వైపునకు నెట్టినట్లుగా బయటకు వస్తాయి. అలా వెనక్కురావడాన్ని ‘రిఫ్లక్స్’ అంటారు. చిన్నతనంలో చాలా మంది పిల్లల్లో సాధారణంగా కనిపించే ఈ సమస్య... వారికి మూడు నుంచి తొమ్మిది నెలలు వచ్చే నాటికి స్ఫింక్టర్ కండరం బలపడటంతో దానంతట అదే తగ్గిపోతుంది. వాంతులు అనే లక్షణం అనేక ఇతర ఆరోగ్య సమస్యల్లోనూ కనిపిస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో కొద్దిమంది పిల్లల్లో వాంతులతో పాటు ఒకవేళ పసరుతో కూడుకున్న వాంతులు (బిలియస్ వామిటింగ్), వాంతుల్లో రక్తపు చారిక కనిపించడం, వాంతులతో పాటు విరేచనాలు కనిపిస్తుంటే మాత్రం మరికొన్ని ఇతర కారణాల గురించి ఆలోచించాల్సి ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో వాంతులు అదేపనిగా అవుతున్నప్పుడు యాంట్రల్ వెబ్, ఇంటస్టినల్ మొబిలిటీ డిజార్డర్స్ (పేగు కదలికల్లో సమస్యలు), హెచ్. పైలోరీ ఇన్ఫెక్షన్, పెప్టిక్ అల్సర్, ఆహారం సరిపడకపోవడం (ఫుడ్ అలర్జీస్), హయటస్ హెర్నియా వంటి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయేమోనని తప్పక అన్వేషించాలి. ఆర్నెల్లు దాటిన వారు మొదలుకొని, రెండేళ్ల వరకు పిల్లల్లో వాంతులవుతూ, పై లక్షణాలు కనిపిస్తుంటే అప్పుడు వారిలో ఇంకేమైనా ఆరోగ్య సమస్యలున్నాయేమోనని అదనపు పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. నిర్ధారణ పరీక్షలు... గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ సమస్యను బేరియం ఎక్స్–రే పరీక్ష, మిల్క్ స్కాన్, 24 గంటల పీహెచ్ మానిటరింగ్, ఎండోస్కోపీ వంటి పరీక్షలతో నిర్ధారణ చేస్తారు. చికిత్స... చాలామంది పిల్లల్లో ఇది దానంతట అదే తగ్గిపోతుంది. ఒకవేళ వాంతులు కావడం మరీ ఎక్కువగా ఉంటే అలాంటి పిల్లలకు ద్రవపదార్థాలు తక్కువగా ఇవ్వడం, ప్రోకైనెటిక్ డ్రగ్స్ (ఉదాహరణకు సిసాప్రైడ్, మెటాక్లోప్రమైడ్ వంటి మందులు), ఎసిడిటీ తగ్గించే మందులు వాడటం చాలావరకు ఉపశమనాన్నిస్తుంది. అలాగే ఈ సమస్య ఉన్న పిల్లలను పాలుపట్టిన వెంటనే పడుకోబెట్టకపోవడం, తల కొద్దిగా ఎత్తున ఉంచి పడుకోబెట్టడం, తిన్న వెంటనే పొట్టపై ఒత్తిడి పెంచే (ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ కలిగించే) యాక్టివిటీస్ వంటి వాటికి దూరంగా ఉంచాలి. ఈ సమస్య ఉన్న పిల్లల్లో వ్యాధి తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే ఫండోప్లెకేషన్ అనే ఆపరేషన్ అవసరం పడవచ్చు. -
జర్నీలో వాంతులు, వికారం రాకుండా ఉండాలంటే..ఇలా చేయండి!
కొంతమందికి బస్సులో లేదా రైలులో ప్రయాణిస్తున్నప్పుడు వికారంగా అనిపించడంతోపాటు తలనొప్పి, వాంతులు వస్తాయి. ఇలాంటి పరిస్థితిని మోషన్ సిక్నెస్ అంటారు. ఇది రాకుండా ఉండాలంటే లాంగ్ జర్నీ చేయాల్సి వచ్చినప్పుడు టీ, కాఫీల వంటివి తాగకూడదు. అలాగే ఖాళీ కడుపుతో కూడా ఉండకూడదు. సులభంగా జీర్ణమయ్యే తేలికపాటి ఆహారాలని తీసుకోవాలి. నోటిలో ఒకటి రెండు యాలకులు పెట్టుకోవాలి. ఇది వికారం సమస్యని తొలగిస్తుంది. ప్రయాణం చేసేరోజు ఖాళీ కడుపుతో అర టీస్పూన్ నల్ల ఉప్పు, నిమ్మకాయ రసం, తేనె కలిపి తాగితే గ్యాస్‌కు సంబంధించిన సమస్యలు దరిచేరవు. ప్రయాణంలో నిమ్మ, నారింజ వంటి సిట్రస్ పండ్లను తింటూ ఉండాలి. అరగ్లాసు నీటిలో చెంచాడు యాపిల్ సిడార్ వెనిగర్ కలిపి పరగడుపున తాగితే వాంతులు రావు. కిస్మిస్లలో జింక్, కాల్షియం, విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి మనకు ఎంతగానో మేలు చేస్తాయి. రాత్రిపూట కొన్ని కిస్మిస్లను తీసుకుని తినాలి. దీంతో మరుసటి రోజు ఉదయం విరేచనం సాఫీగా జరుగుతుంది. మలబద్దకం తగ్గుతుంది. దీంతో పైల్స్ సమస్య నుంచి బయట పడవచ్చు. రాత్రిపూట కిస్మిస్లను నీటిలో నానబెట్టి.. మరుసటి రోజు ఉదయం తిన్నా సమస్య నుంచి బయటపడచ్చు..ఒకటి రెండు జామాకులను తీసుకుని శుభ్రంగా కడిగి వాటిని నీటిలో వేసి పది నిమిషాల పాటు మరిగించాలి. ఆ నీటిని వడకట్టి అందులో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి హెర్బల్ టీ మాదిరిగా తాగాలి. రోజుకు ఇలా రెండు సార్లు తాగితే చాలు, స్త్రీలకు నెలసరి సమయంలో వచ్చే నొప్పులు రాకుండా ఉంటాయి. షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. చర్మం కాంతిమంతంగా... మృదువుగా తయారవుతుంది. (చదవండి: అప్పుడే జుట్టు తెల్లబడుతుందా! ఇలా చేసి చూడండి!) -
విరేచనాలు..వాంతులు
సిరిసిల్లలో ప్రబలుతున్న జ్వరాలు ఇంటికొకరు జ్వరపీడితులు కిటకిటలాడుతున్న ఆస్పత్రులు సర్కార్ ఆస్పత్రిలో మందుల కొరత సిరిసిల్ల : జ్వరంతో బాధపడుతూ.. ఒకే మంచంలో సొమ్మసిల్లిన ఈ ఇద్దరు చిన్నారుల పేర్లు గజ్జెల్లి శాంతిప్రియ(6), శరణ్య(4). సిరిసిల్ల శివారులోని రాజీవ్‌నగర్‌కు చెందిన లత, శ్రీనివాస్ దంపతుల సంతానం. ఆరు రోజులుగా జ్వరం, వాంతులతో బాధపడుతున్నారు. స్థానికంగా ఆర్ఎంపీ వైద్యుడికి చూపించారు. ఎంతకూ తగ్గకపోవడంతో గురువారం సిరిసిల్ల ప్రాంతీయ ఆస్పత్రికి వచ్చారు. కానీ ఆస్పత్రిలో మంచాలు ఖాళీ లేవు. దీంతో ఒకే మంచంలో ఇద్దరు పిల్లలను పడుకోబెట్టి వైద్యం చేయిస్తున్నారు. ఆటో నడిపే శ్రీనివాస్, బీడీలు చుట్టే లత ఇద్దరు చిన్నారులు అనారోగ్యంతో మంచం పట్టడంతో తల్లడిల్లిపోతున్నారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న ఈ పిల్లల పేర్లు కారంపురి ప్రణవ్(6), తేజ(8). పట్టణంలోని ప్రగతినగర్‌కు చెందిన ఇద్దరు అబ్బాయిలు రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. ఈ పిల్లల తల్లి స్రవంతి బీడీ కార్మికురాలు, తండ్రి సత్యనారాయణ డైయింగ్ కార్మికుడు. ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించే స్థోమత లేక ప్రభుత్వాస్పత్రిలో చేరారు. ఈ బాబు సుభాష్‌నగర్‌కు చెందిన అభినవ్. మూడు రోజులుగా వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నాడు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వాంతులు, విరేచనాలు తగ్గక, జ్వరం కూడా రావడంతో అభినవ్ ఇబ్బంది పడుతున్నాడు. ఆస్పత్రులు కిటకిట సిరిసిల్లలో జ్వరాలు ప్రబలుతున్నాయి. ఇంటికొకరు జ్వరపీడితులు ఉన్నారు. నిత్యం 50 మంది వరకు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. సిరిసిల్ల మండలం రామచంద్రాపూర్‌కు చెందిన బత్తుల సంజయ్(11) జ్వరంతో సొమ్మసిల్లి పడిపోయాడు. కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన దుగ్గం అశ్విత్(7) జ్వరం, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నాడు. సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మకాలనీకి చెందిన తోట రక్షానంద్(6) జ్వరంతో ఆస్పత్రిలో చేరాడు. బద్దెనపల్లికి చెందిన నంగునూరు పూజిత(14) జ్వరంతో బాధపడుతుంది. కొత్తగా వర్షం నీరు రావడంతో డయేరియా ప్రబలుతోంది. వంద పడకల ఆస్పత్రిలో మంచాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఒకే మంచంలో ఇద్దరి చొప్పున రోగులకు వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం 70 మంది వరకు జ్వరాలు, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారు అడ్మిట్ అయ్యారు. ఇంతకు రెట్టింపు స్థాయిలో ప్రైవేటు ఆస్పత్రులు, ఆర్ఎంపీ, పీఎంపీల వద్ద చికిత్స పొందుతున్నారు. భారీ సంఖ్యలో రోగులు రావడంతో ఆస్పత్రిలో మందుల కొరత ఏర్పడింది. ముందు జాగ్రత్తే మేలు డాక్టర్ గూడూరి రవీందర్, ఆస్పత్రి సూపరింటెండెంట్ వైరల్ ఫీవర్స్ ఎక్కువగా వస్తున్నాయి. వాంతులు, విరేచనాలు ఉన్నాయి. రెండు రోజులుగా రోజూ 50 మంది వస్తున్నారు. మందుల కొరత ఏమీ లేదు. ముందుచూపుతో రెండో క్వార్టర్ మందులకు ఇండెంట్ ఇచ్చాము. పరిసరాల పరిశుభ్రత పాటించాలి. కాచి చల్లార్చిన నీరు తాగాలి. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. బయటి ఆహారం తీసుకోవద్దు. దోమలు, ఈగలు వాలకుండా జాగ్రత్త పడాలి.