వైట్ లంగ్ సిండ్రోమ్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. నాలుగేళ్ల క్రితం వచ్చిన కోవడ్ మహమ్మారిలా నెమ్మదిగా పెరుతుగున్నాయి ఈ సిండ్రోమ్ కేసులు. అదికూడా ప్రధానంగా చిన్నారులే అధికంగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. న్యూమెనియాకు సంబంధించిన మిస్టీరియస్ వ్యాధిగా పరిశోధకులు వెల్లడించడంతో సర్వత్రా భయాందళోనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా చైనాలోనే ఈ వ్యాధులు ప్రబలంగా ఉన్నాయి. సీజనల్‌గా వచ్చే వ్యాధేనని, శీతకాలం కావడం వల్ల కేసులు పెరుగుతన్నాయని చైనా వివరణ ఇచ్చింది. పైగా కరోనా మహమ్మారి అంతా తీవ్రంగా లేదని తెలిపింది. అసలు ఎంతకీ ఏంటీ వైట్ లంగ్ సిండ్రోమ్? దేని వల్ల వస్తుందంటే..
వైట్ లంగ్ సిండ్రోమ్ అంటే ఏమిటి?
ఛాతీలో పేరుకుపోయి తెల్లటి పాచెస్ లాంటి ద్రవం పేరుకుని ఉంటే దాన్ని 'వైట్ లంగ్ సిండ్రోమ్' అంటారు. ఇది అక్యూట్ రెస్పీరేటరీ డిస్ట్రెస్, పల్మనరీ అల్వియోలార్ మైక్రోలిథియాసిస్, సిలికా సంబంధిత శ్వాసకోశ వ్యాధులకు దారితీస్తుంది. దీని కారణంగా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. నిజం చెప్పాలంటే ఇలాంటి శ్వాస సంబంధిత సమస్యలు ఊపిరితిత్తుల్లో ద్రవం నిండినప్పడూ లేదా ఊపిరితిత్తుల్లోని గాలి సంచుల్లో కాల్షియం నిక్షేపాలు ఉన్నప్పుడూ సంభవిస్తాయి.
లక్షణాలు..
సాధార శ్వాస సంబంధిత వ్యాధుల్లో వచ్చే సంకేతాలనే చూపిస్తుంది. ముఖ్యంగా దగ్గు, ఛాతీ నొప్పి, జ్వరం, అలసట తదితర లక్షణాలు కనిపిస్తాయి.
కారణాలు..
కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. కానీ ఇది కోవిడ్-19కి సంబంధించిన ఇన్ఫ్లుఎంజా లేదా కోవిడ్-19 వంటి వైరస్‌లు ఊపిరితిత్తుల గాలి సంచులను దెబ్బతీయడం వల్ల సంభవించినట్లు అనుమానిస్తున్నారు శాస్త్రవేత్తలు. మైక్రోప్లాస్మా న్యూమెనియా అనే బ్యాక్టీరియా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కలిగించడం వల్ల ఈ సిండ్రోమ్‌కి దారితీసి ఉండొచ్చని భావిస్తున్నారు . అలాగే సిలికా ధూళి లేదా ఇతర కాలుష్య కారకాలను పీల్చడం లేదా పర్యావరణ కారకాలు తదితరాలు ఈ వైట్ లంగ్ సిండ్రోమ్ ప్రధాన కారణమై ఉండొచ్చని చెబుతున్నారు పరిశోధకులు.
చికిత్స..
యాంటీబయాటిక్స్, యాంటీవైరల్, ఆక్సిజన్ థెరపీ, కార్టికోస్టెరాయిడ్స్ వంటి వాటితో ఈ వ్యాధిని నివారించడం జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అదే టైంలో ఈ వ్యాధి తగ్గడం అనేది రోగి ఆరోగ్యంపై ఆధారపడింది. సత్వరమే చికిత్స తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులకు ఎలాంటి నష్టం వాటిల్లదని లేదంటే పరిస్థితి సివియర్ అవుతుందని అన్నారు.
(చదవండి: నిమోనియా.. అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు, ఇవి పాటిస్తున్నారా?)
Comments
Please login to add a commentAdd a comment